E-Paper
Advertisement

BBL15 : బిగ్ బాష్ లీగ్ లో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. వీడియో వైర‌ల్..!

BBL15 :  బిగ్ బాష్ లీగ్ లో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. వీడియో వైర‌ల్..!
Advertisement

BBL15 :  సాధార‌ణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌మాదాలు కూడా జ‌రిగే అవ‌కాశాలున్నాయి. వాటిలో ముఖ్యంగా బ్యాట్స్ మెన్ బ్యాట్ జారి కింద‌ప‌డిపోవ‌డం.. మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో ఫీల్డ‌ర్లకు గాయాలు కావ‌డం.. ఇంకా ప్ర‌మాదం ఏంటంటే..? క్యాచ్ కోసం వెళ్లి ఇద్ద‌రూ ఫీల్డ‌ర్లు ఎదురెదురుగా ఢీ కొట్ట‌డం.. ఇద్ద‌రూ బ్యాట‌ర్లు కూడా ప‌రుగెత్తుతున్న స‌మ‌యంలో ఒక‌రికొక‌రు ఢీ కొన‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. తాజాగా బిగ్ బాష్ లీగ్ లో ఇలాంటి సంఘ‌ట‌నే క‌నిపించ‌డం విశేషం.  ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ భ‌యంక‌ర దృశ్యం క‌నిపించింది. మెల్ బోర్న్ స్టార్స్, సిడ్నీ థండ‌ర్ మ‌ధ్య జ‌రిగిన ఓ మ్యాచ్ లో క్యాచ్ కోసం ఇద్ద‌రు ఫీల్డ‌ర్లు ఒక‌రికొక‌రు ఎదురెదురుగా వ‌చ్చారు. పాకిస్తాన్ స్పీడ్ స్ట‌ర్ హారీస్ రౌఫ్, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ హిల్ట‌న్ కార్ట్ రైట్ త‌ల‌లు ప‌గిలేంత ప్ర‌మాదం తృటిలోనే త‌ప్పింది. దీంతో మైదానంలో ఉన్న ఆట‌గాళ్ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఒక్క‌సారిగా షాక్ కి గురికావ‌డం విశేషం.

Also Read : INDW Vs SLW : మ‌ళ్లీ అదే జోరు.. పోరాడి ఓడిన శ్రీలంక

జ‌స్ట్ మిస్.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

Advertisement

సిడ్నీ థండ‌ర్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. టామ్ క‌ర‌న్ వేసిన బంతిని బ్యాట‌ర్ గాల్లోకి లేపాడు. అది బ్యాక్ వ‌ర్డ్ పాయింట్, డీప్ పాయింట్ మ‌ధ్య‌లో ప‌డ‌బోయింది. అయితే ఆ క్యాచ్ ను అందుకోవ‌డానికి పాయింట్ లో ఉన్న హారీస్ రౌఫ్ వెన‌క్కి ప‌రుగెత్తాడు. అలాగే బౌండ‌రీ వ‌ద్ద ఉన్న కార్ట్ రైట్ ముందుకు దూసుకొచ్చాడు. ఇద్ద‌రూ బంతిపైనే క‌ళ్లు పెట్టి చాలా వేగంగా ఎదురెదురుగా రావ‌డంతో పెను ప్ర‌మాదాన్నే త‌ల‌పించింది. అందులో ఇద్ద‌రూ ఒకేసారి మ్యాచ్ కోసం డైవ్ చేయ‌బోయారు. సరిగ్గా డైవ్ చేసే క్ష‌ణంలో కార్ట్ రైట్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. హారీస్ రౌఫ్ త‌న వైపే వ‌స్తున్నాడ‌ని గ‌మ‌నించి.. చివ‌రి సెక‌న్ త‌మ డైవ్ ను ప‌క్క‌కు మ‌ళ్లించాడు. లేదంటే ఇద్ద‌రి త‌ల‌లు బ‌లంగా ఢీ కొనేవి. క్యాచ్ అయితే మిస్ అయింది. కానీ ఎవ్వ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకున్నారు.

హారిస్ రౌఫ్ సూపర్ స్పెల్

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్ర‌ధానంగా ఆట‌గాళ్లు క్యాచ్ ను అందుకోవ‌డంలో చూపే అత్యుత్సాహం ఒక్కోసారి కెరీర్ కే ముప్పు తెస్తుంద‌ని ఈ ఘ‌ట‌న మ‌రోసారి గుర్తు చేసింది. ఈ ప్ర‌మాదం త‌ప్పిన‌ప్ప‌టికీ.. అంత‌కు ముందు హారిస్ రౌఫ్ త‌న బౌలింగ్ ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. రౌఫ్ నిప్పులు చెరిగే బంతులు విస‌ర‌డంతో సిడ్నీ థండ‌ర్ బ్యాట‌ర్లు ఒక్క‌సారిగా విల‌విల‌లాడిపోయారు. రౌఫ్ 3 వికెట్లు తీయ‌డంతో పాటు సిడ్నీని కేవ‌లం 128 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అనంత‌రం మెల్ బోర్న్ స్టార్స్ బ్యాట‌ర్లు జో క్లార్క్ (60), మాక్స్ వెల్ (39) రెచ్చిపోవ‌డంతో మెల్ బోర్న్ జ‌ట్టు 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రౌఫ్ త‌న స్పీడ్ తో మ్యాచ్ ను మ‌లుపు తిప్పాడు.

Advertisement

Also Read : DC Vs MIE : పొలార్డ్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 6, 4, 2, 6, 6, 6

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×