E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి వరుస షాక్ లు.. భాగ్యం ఏం ప్లాన్ చేస్తుంది..? ఇదే ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి వరుస షాక్ లు.. భాగ్యం ఏం ప్లాన్ చేస్తుంది..? ఇదే ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఎలాగైనా సరే శ్రీవల్లిని జాబ్ చేయమని అందరి చేత ఒప్పించాలి అని నర్మదా శ్రీవల్లి ప్లాన్ చేసుకుంటారు. రాత్రి భోజనం చేస్తున్న టైంలో శ్రీవల్లిని కావాలని నర్మదా రెచ్చగొడుతుంది. నువ్వు ఉద్యోగం చేయకుండా ఇలా ఖాళీగా ఉండి నీ చదువుకి ఎందుకు అన్యాయం చేస్తావని అంటారు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా జాబ్ చేయాలని కోరుకుంటారు.. నేను జాబ్ చేస్తే అత్తయ్య గారికి సాయం ఎవరు చేస్తారు అని రివర్స్లో అంటుంది..

అత్తయ్య గారికి సాయంగా అన్ని పనులు చేయాలి లేకుంటే ఆవిడ చేసుకోలేదు. వీరిద్దరు కూడా ఎవరి పనిలో వాళ్ళు వెళ్లిపోతారు. దేవత లాంటి అత్తయ్య ఈ వయసులో పనిచేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఆవిడకి సాయంగా ఉంటాను అని అంటుంది.. వేదవతి వద్దమ్మా నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అనేసి అంటుంది.. మామగారు అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు. నువ్వు ఇంత చదువు చదివి ఇప్పుడు ఇలా అనడం బాగోలేదమ్మా నువ్వు కూడా రేపటి నుంచి జాబ్ కి వెళ్ళు అని వేదవతి షాక్ ఇస్తుంది..ఆఖరికి రామరాజు కూడా జాబ్ చెయ్యొచ్చు అని అనడంతో షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. భాగ్యం దగ్గరకు వెళ్లిన శ్రీవల్లి. కన్న తల్లి దండ్రులు అని కూడా చూడకుండా రివేంజ్ తీర్చుకుంటుంది. మీరు నన్ను అత్తారింటికి కాదు ఐసియుకి పంపించారు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళిద్దరూ ఏం జరిగిందని ఎంత చెప్పినా సరే శ్రీవల్లి మాత్రం నా చదువు గురించి అబద్ధం చెప్పి నన్ను ఇరికించేశారు అని అంటుంది. ఏ మాత్రం ఆ సర్టిఫికెట్ రాకుండా నేను చేస్తాను అని అంటుంది. ఇక సాగర్ గదిలో లేకపోవడంతో నర్మదా ఎక్కడికి వెళ్లాడో అని వెతుక్కుంటూ బయటికి వెళుతుంది. సాగర్ వర్షంలో తడుస్తూ కూర్చో ఉండడం చూసి నర్మదా ఏమైందని అతని తీసుకొని లోపలికి వస్తుంది.. సాగర్ ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది..

గవర్నమెంట్ జాబ్ చేయాల నాకు నా కోరిక తీరదు అని నాకు అర్థం అవుతుంది అని బాధపడుతూ ఉంటాడు. నువ్వు చాలా మంచి వాడివి.. భార్యను ఎప్పుడూ సంతోషంగా చూడాలని అనుకుంటావు. నీలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఏదో ఒక రోజు ఆ దేవుడు కరుణించి మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు నువ్వేమీ బాధ పడవద్దు అని నర్మదా సాగర్ కు పదే పదే చెప్పిన సరే తను మాత్రం మనసులో బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టి చూపించాలి అని అనుకుంటాడు. సాగర్ బాధను ఎలాగైనా సరిపోగొట్టాలి అని నర్మదా అనుకుంటుంది..

Advertisement

ప్రేమ పోలీస్ ఉద్యోగం ఎలాగైనా సరే సాధించాలి అని తెగ కష్టపడి చదువుతూ ఉంటుంది… అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ నువ్వు బాగానే కష్టపడుతున్నావు. కచ్చితంగా నీకు ఈ జాబ్ వస్తుంది అని అంటాడు. జాబ్ అప్లికేషన్ అయితే తెచ్చావు కానీ కనీసం ఒక ఎంకరేజ్మెంట్ కూడా లేదు. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు నీకోసం ఇది చేయాలి అని నీకు కనీసం లేదు. నాకు లేకపోవడమేంటి నిన్ను పోలీస్గా చూడాలని నాకు కల అని ధీరజ్ అంటాడు. సరే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అనేసి ధీరజ్ అనగానే ప్రేమ పోయినసారి సర్ప్రైజ్ అని చెప్పి వాకింగ్ షూస్ కొనిచ్చావు. సారీ ఇంకెలాంటి సర్ప్రైజ్లు ఇస్తావో చూడాలి అని ప్రేమ అనుకుంటుంది.

Also Read :చిరంజీవి, నయన్‌ల ‘శశిరేఖ’ సాంగ్.. ‘కాత్యాయనీ’ పాటకు కాపీలా ఉందే!

ధీరజ్ ప్రేమకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఇందులో ఏముందో చెప్పరా అని అంటే అని ప్రేమ అడుగుతుంది. అందులో ఏముందో నువ్వే ఓపెన్ చేసి చూడు అని ధీరజ్ అంటాడు.. ఆ గిఫ్ట్ బాక్స్ లో పోలీస్ డ్రెస్ ఉండడం చూసి ప్రేమ ఆశ్చర్యంతో షాక్ అవుతుంది.. నేను ఇంకా ఎగ్జామ్ ఏ రాయలేదు కానీ నువ్వేంటి రా అప్పుడే డ్రెస్ కూడా తీసుకొని వచ్చావు అని ప్రేమ అడుగుతుంది.. నువ్వు కచ్చితంగా పోలీస్ అవుతావని నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్లి ఈ డ్రెస్ ని వేసుకోరా ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అని ధీరజ్ అంటాడు. ప్రేమ ధీరజ్ కోరిక మేరకు వెళ్లి డ్రెస్ ను వేసుకుని వస్తుంది. అది చూసిన ధీరజ్ సంతోష్ పడతాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ప్రేమ పోలీస్ డ్రెస్ గురించి శ్రీవల్లి రామరాజుకి చెప్తుందేమో చూడాలి..

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×