OTT Movie : అనేక వాయిదాల తర్వాత మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫార్మా’ డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తోంది. నిర్మాతలు చివరకు ఒక అప్డేట్
విడుదల అందించారు. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. నివిన్ పౌలీ నటించిన ఈ సిరీస్ మలయాళంతో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషలలో కూడా అందుబాటులోకి రానుంది. నివిన్ పౌలీ ఫార్మాస్యూటికల్ పరిశ్రమతో పోరాడుతున్నట్లు ట్రైలర్ చూపిస్తుంది. ఫార్మాలోని చీకటి కోణాలను ఇది కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. మన జీవితంలో ఇతర ముఖ్యమైన వస్తువుల పట్ల ఉన్న జాగ్రత్త, మందులు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఉండాలనేది ఈ సిరీస్ చూపించబోతోంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.
ప్రశాంత్ నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మలయాళ ‘ఫార్మా’ థ్రిల్లర్ సిరీస్ డిసెంబర్ 19 నుండి JioHotstar, OTTplay Premiumలో అందుబాటులో ఉంటుంది. ఇందులో నివిన్ పౌలీ, రజిత్ కపూర్, శృతి రామచంద్రన్, నరైన్, ముత్తుమణి వంటి నటులు నటించారు. జేక్స్ బిజోయ్ దీనికి సంగీతం అందించారు. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Read Also : 18 ఏళ్ల వయసులో ఉరి… బ్రిటిష్ వాళ్ళను వణికించిన చిచ్చరపిడుగు… ఓటీటీలోకి వచ్చేసిన ఖుదిరామ్ బోస్ బయోపిక్
మధ్యతరగతికి చెందిన కె.పి. వినోద్ (నివిన్ పౌలీ) అనే యువకుడు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేరతాడు. వినోద్ తన ఉద్యోగంలో టార్గెట్ లను రీచ్ అవ్వడానికి చాలా కష్టపడతాడు. ఈ క్రమంలో అతను ఫార్మా పరిశ్రమలోని లూప్ హోల్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను ప్రమోట్ చేసే “కైడోక్సిన్” అనే కొత్త ఔషధం అకస్మాత్తుగా భారీ సేల్స్ సాధిస్తుంది. దీంతో అతనికి మంచి కమిషన్లు కూడా వస్తాయి. అంతా బాగుందనుకున్న సమయంలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఈ మందు వెనుక ఉన్న రహస్యం త్వరలోనే బయటపడుతుంది. ఆ మందు ప్రమాదకరమైనదని, అనేక మంది ప్రాణాలను బలిగొందని వినోద్ తెలుసుకుంటాడు. ఇది తెలుసుకున్న వినోద్, ఫార్మా పరిశ్రమలో పాతుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంటాడు. చివరికి పేద ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకురావడానికి అతను చేసే పొరటంతో ఈ సిరీస్ ముగుస్తుంది.