E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి షాక్.. ప్రేమకు నిజం చెప్పిన నర్మద.. విశ్వం, భద్రలను కడిగిపడేసిన ప్రేమ..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి షాక్.. ప్రేమకు నిజం చెప్పిన నర్మద.. విశ్వం, భద్రలను కడిగిపడేసిన ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్లి ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఆమె సీరియస్ అవుతూ వస్తుంది.. అమూల్యకు ఇప్పుడే పెళ్లి వద్దు అత్త చదువుకొనివు అని అంటుంది.. మా కూతురికి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని వేదవతి సీరియస్ అవుతుంది.. లేచిపోయి పెళ్లి చేసుకున్నావు నా కూతురు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలా అని అనగానే ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. నర్మదా వచ్చి వేదవతి తో మాట్లాడుతుంది. లేచిపోయింది అని నువ్వు అంటున్నావు అంతకన్నా ముందు నువ్వు బయటికి వచ్చావు అది ఆలోచించవా అత్తయ్య అని అంటుంది.. ప్రేమను ఓదారుస్తుంది. శ్రీవల్లి నోటితోనే ప్లాన్ చెప్పించి, అమూల్యతో నిజం కక్కిస్తుంది నర్మద అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదకు శ్రీవల్లి ఇచ్చిన సలహా పై భాగ్యం సీరియస్ అవుతుంది. బుద్ధిలేని దాన ఇలా చేసావ్ ఏంటి నీ కూతురు నువ్వే తోవ్వుకున్నావు అని తిడుతుంది. భాగ్యమిచ్చిన క్లారిటీతో శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అమూల్య నుంచి నిజం కాబట్టి సమయంలో ప్రేమ అక్కడికి వచ్చి అమూల్య చెప్పిన విషయాన్ని నేను విని షాక్ అవుతుంది.. ఆ తర్వాత ప్రేమ చాలా పెద్ద తప్పు చేశానని అనుకుని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళ అందరి దగ్గర నేను చెడ్డ అయిపోయాను అని బాధపడుతూ ఉంటుంది.. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి వెళ్లిన నర్మదా అమూల్య చెప్పిన విషయం గురించి మరోసారి చెబుతుంది..

Advertisement

నువ్వు ఏమి బాధపడకు ప్రేమ నువ్వు నిజం తెలుసుకోవాలని అనుకున్నావు కదా ఆ నిజం నీకు తెలిసింది అమూల్య గురించి నాకు ముందే తెలుసు. తను చాలా అమాయకురాలు ఇలాంటి విషయాల్లో అసలు మెచ్యూరిటీ లేదు అని అంటుంది. నన్ను క్షమించు అక్క నేను చేసింది నిజంగానే తప్పు. ఇంట్లో వాళ్ళందరూ దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయాను మా అన్నయ్య కన్నీళ్లు నమ్మి మోసపోయాను అని ప్రేమ అంటుంది.. నువ్వేం తప్పు చేయలేదు ప్రేమ వాళ్ళలా నిన్ను నమ్మించారు అంతే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి అని నర్మదా ప్రేమకు సలహా ఇస్తుంది..

శ్రీవల్లి ఇంట్లో ఎలాంటి కొంపలు మునుగుతున్నాయో ఏంటో అని కంగారు పడిపోతూ లోపలికి వస్తుంది. నర్మదని ఢీ కొట్టి కింద పడిపోతుంది శ్రీ వల్లి.. అమూల్య అంత నిజం చెప్పేసింది ప్రేమకు అసలు నిజం తెలియాల్సి ఉంది కదా అది తెలిసిపోయింది ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు.. ప్రేమ ఏం చేయాలో అది చేస్తుంది. ఏంటి అమూల్య నిజం చెప్పేసిన ఏం నిజం చెప్పింది అని వల్లి టెన్షన్ పడుతుంది. నర్మదా ఏం చెప్పాలి అది చెప్పింది నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావ్ ఇందులో నీ హస్తము ఏమైనా ఉందా అని నర్మదా అడుగుతుంది.. నాకెందుకు టెన్షన్ ప్రేమ వల్ల వాళ్లు మళ్లీ ఇంట్లో ఎంత పెద్ద గొడవలు చేస్తారు అని నాకు టెన్షన్ అంతే ఇంకేమీ లేదు అని అంటుంది.

Advertisement

శ్రీవల్లి ఈ ప్రేమ ఏం చేస్తుందో నా పేరు ఎక్కడ బయట పడుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. విశ్వ ఇంట్లోకి వెళుతూ ఉంటే ప్రేమ రేయ్ విశ్వ ఆగు అని అంటుంది.. ఏంటి అమూల్య ముందు నేను ప్రేమించిందా? నువ్వు లేకుంటే చచ్చిపోతాను అందా? అంత తప్పు అమూల్యదేనా అని ప్రేమ అడుగుతుంది.. నిన్ననే చెప్పాను కదా అమూల్యదే తప్పు అని మళ్ళీ అడుగుతున్నావ్ ఏంటి అని విశ్వా అంటాడు.. ఎందుకురా అబద్దాలు చెప్పావు అమూల్య నిజం మొత్తం చెప్పేసింది.. నువ్వెందుకు ఇలా చేశావు అమూల్య జీవితంతో ఎందుకు ఆడుకోవాలని చూసావు నీకు కొంచమైనా సిగ్గుందా అని ప్రేమ విశ్వంను కడిగిపడిస్తుంది..

ఒకవైపు సేన ప్రేమ ఏంటి వాడితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంటాడు.. కూతురిని ఎలా పెంచాలో అని నువ్వు నేర్పిస్తున్నావా ఆగు నీతో కూడా నేను మాట్లాడతాను అని అంటుంది ప్రేమ.. ప్రేమ చేస్తున్నదంతా చూసిన నర్మదా ఇంట్లోని వాళ్ళందరిని పిలువు శ్రీవల్లి అక్క అని అంటుంది.. శ్రీవల్లి ఇంట్లోని వాళ్ళ అందరిని పిలుస్తుంది. ప్రేమ విశ్వం ని బయటికి తీసుకొచ్చి తను అడగాలనుకున్న విషయాలన్నిటినీ కడిగి పడేస్తుంది. మా అత్తయ్య మామయ్యల పెంపకం గురించి మీరు మాట్లాడారు వాళ్ల పెంపకం ఏంటో ఇప్పుడు అర్థమైందా అని ప్రేమ తన పుట్టింటి వాళ్లపై సీరియస్ అవుతుంది..

Also Read : పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కోటిలింగం కన్నీళ్లు.. క్లాస్ పీకిన అక్షయ్..

ఇదంతా చేసింది నువ్వే కదా అత్త నేను ధీరజ్ ని వదిలేసి నీ ఇంటికి వస్తానని నువ్వు కలగనకు అని ప్రేమ అంటుంది. ధీరజ్ నా ప్రాణం వాడిని వదిలేసి ఎప్పుడూ నీ దగ్గరికి రాను ఒకవేళ అలా రావాలి అనుకుంటే నా శవమే బయటకు వస్తుంది అని ధీరజ్ పై తనకున్న ప్రేమను ప్రేమ బయటపెడుతుంది. ఇక ఇంట్లోనే వాళ్ళందరూ కూడా నిజం తెలుసుకుంటారు. ఇంట్లోకి వెళ్లిన ప్రేమ రామరాజుకి నాదే తప్పు మావయ్య మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటే నిజమే అని నమ్మాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది . రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×