E-Paper
Advertisement

Crime: గుడ్డు కూరపై గొడవ.. భర్త నాలుక కొరికేసిన భార్య, ఎక్కడంటే?

Crime: గుడ్డు కూరపై గొడవ.. భర్త నాలుక కొరికేసిన భార్య, ఎక్కడంటే?
Advertisement

Uttar Pradesh Crime: భార్యాభర్తలు అన్నాక సవా లక్ష సమస్యలు ఉంటాయి. కొందరు అప్పటికప్పుడే వాటిని పరిష్కరించుకుంటారు. మరికొందరు వాటినే తవ్వుకుంటారు.  ఆ దంపతుల మధ్య ఏదో సమస్య వెంటాడింది. కూర విషయంలో గొడవ కారణంగా పట్టరాని కోపంతో భార్య.. తన భర్త నాలుక కొరికివేసింది. సంచలనం రేపిన ఈ ఘటన ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

దంపతుల మధ్య కర్రీ చిచ్చు

Advertisement

యూపీలోని ఘజియాబాద్‌లో ఊహించని ఘటన జరిగింది. మోదీ నగర్ ప్రాంతంలోని సంజయ్ నగర్ కాలనీలో విపిన్-ఇషా దంపతులు ఉంటున్నారు. విపిన్‌కు 27 ఏళ్లు కాగా, ఇషాకు 22 ఏళ్లు ఉంటాయి. మంగళవారం రాత్రి ఇషా ఎగ్ కర్రీ వండింది. అది అతడికి నచ్చలేదు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య నోటి మాటలు తారాస్థాయికి చేరాయి. వీరిని అదుపు చేయడం ఇరుగుపొరుగు వారి వల్ల కాలేదు.

పట్టరాని తన భర్త నాలుకను కొరికింది. ఈ ఘటన తర్వాత విపిన్ అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఇషాని కొట్టి బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Advertisement

భర్త నాలుక కొరికిన భార్య, ఆసుపత్రిలో బాధితుడు

ఘటనకు సంబంధించిన కారణాలపై ఆమెని విచారిస్తున్నారు. విపిన్ తల్లి గీత వెర్షన్ మరోలా ఉంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇషా తన కొడుకు నాలుక ముందు భాగాన్ని కత్తితో కత్తిరించిందని ఆరోపించారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దీనివెనుక అసలు కారణాలు వేరేగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇషా.. ఓ యువకుడ్ని ప్రేమించిందని అతడ్ని వివాహం చేసుకోవాలని కోరుకుందట. కానీ కుటుంబం ఆమెకు బలవంతంగా విపిన్‌తో వివాహం జరిపించారని అంటున్నారు. దీని కారణంగా ఇద్దరి మధ్య చిటీకి మాటికీ వివాదాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. గతేడాది ఆ తరహా ఘటన జరిగిందని అంటున్నారు స్థానికులు

ALSO READ:  రీల్స్ పిచ్చితో దారుణం..  డెలివరీ బాయ్‌పై కత్తులతో దాడి

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×