E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి కొత్త డ్రామా.. తెలివిగా ఇరికించిన అవని.. పల్లవి ప్రగ్నెంట్ కాదని తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి కొత్త డ్రామా.. తెలివిగా ఇరికించిన అవని.. పల్లవి ప్రగ్నెంట్ కాదని తెలిసిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అవనిని అవమానించేలా మాట్లాడుతుందని తట్టుకోలేకపోయిన మీనాక్షి ఎలాగైనా సరే ఈ గొడవలకి ముగింపు పలకాలని అనుకుంటుంది. మీనాక్షి చక్రధర్ ని కలవడానికి జైలుకు వెళుతుంది.. ఇక్కడ చక్రధర్ మీనాక్షిని చూసి షాక్ అవుతాడు. నీలాంటి వాన్ని నమ్మి నేను మోసపోయాను ఇప్పటికీ నువ్వు మారవా అని అంటుంది. కానీ చక్రధర్ మాత్రం నేను బయటకు వస్తే నిన్ను నీ అల్లుడిని కూతుర్ని అసలు వదలను అని అంటాడు.. పల్లవికి మేము ఎవరో తెలిస్తే ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడదని నేను అనుకుంటున్నాను అని మీనాక్షి అంటుంది. తను మమ్మల్ని కావాలనే అవమానిస్తుంది అవనిని ఎన్ని మాటలు అంటున్నావ్ నాకు చాలా బాధగా ఉంది అని మీనాక్షి చక్రధర్ తో అంటుంది..

ఇదంతా కాదు నువ్వు ఎవరో తెలిస్తే ఇలాంటి అవమానాలు ఉండవు కదా అప్పుడు నేను నిన్ను జైలు నుంచి రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని మీనాక్షి అంటుంది. చక్రధర్ ఈ జైల్లో ఉండలేకపోతున్నాను. నువ్వు నా భార్యవని కానీ నీ మీద మోజుతో లేదు.. ఈ జైలు జీవితం నుంచి బయటపడడానికైనా నేను చెప్తాను అని మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని శ్రియకున్న లక్షణాలు నీకు ఏమీ లేవు కదా అని పల్లవిని అడుగుతుంది. నువ్వు కొంచెం తిన్న వాంతులు చేసుకుంటున్నావు  కాళ్లు వాపులు వస్తున్నాయి. మరి పల్లవికి ఎందుకు అలా లేదు బాగానే తింటుంది కదా.. హోటల్ లో ఉన్న మెనూన్ అంత ఆర్డర్ చేస్తుంది అని అవని అంటుంది.. చూసావా బావ నా తిని మీరు అందరు పడుతున్నారని పల్లవి అంటుంది. నేను తినడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదనుకుంటాను. అందరూ నా తిండి మీద పడే ఏడుస్తున్నారు.. చూసావా బావ అని పల్లవి ఎమోషనల్ అవడంతో శ్రీకర్ అందులో తప్పేముంది పల్లవి అడగడం కూడా తప్పేనా అని అంటాడు.. ఇక భానుమతి ఒక్కొక్కరే ఒళ్ళు తీరుబట్టి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు మీరేమీ ఇదొకండి అని అంటుంది..

ఇక పల్లవికి చక్రధర్ కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు.. మీ ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతుందని అడుగుతాడు.. మీనాక్షి వచ్చిన విషయాన్ని పల్లవికి చెప్పడంతో పల్లవి ఇంత ప్లాన్ చేస్తున్నారా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. అదేవిధంగా నువ్వు కూడా అవన్నీ తో జాగ్రత్తగా ఉండమ్మా అనేసి అంటారు.. ఆ తర్వాత పల్లవి మీనాక్షి అవని కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్లిప్పుడు ఇంత ప్లాన్ చేశారు అని ఆలోచిస్తూ ఉండగా రాజేంద్రప్రసాద్ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు..

Advertisement

బిడ్డ పుట్టబోతుందని ఆలోచిస్తున్నావా అని పార్వతి అడుగుతుంది.. భానుమతి మా ఆయనే నా మనవరాలు కడుపున పుడతాడు అని అంటుంది.. లేకుంటే ఇద్దరు కవలలు పుట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు అని భానుమతి అంటుంది.. అప్పుడే ఇంట్లోకి డాక్టర్ వస్తుంది.. డాక్టర్వచ్చారంటే ఎవరు పిలిచారు అని భానుమతి అడుగుతుంది. అప్పుడే అవని నేను పిలిచాను అని అనగానే పల్లవి షాక్ అవుతుంది. ఏంటి నేను ఇప్పుడు ఏం చెక్ చేయించుకోను నాకోసం ఆల్రెడీ కమల్ బావ ఒక డాక్టర్ని పెట్టాడు.. మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి అని పల్లవి అంటుంది..

అవని మాత్రం ముందుగా శ్రియాని పిలుస్తుంది.. తనకి వాపులు వస్తున్నాయి నీరసంగా ఉందని చెప్పింది కదా అందుకు ముందు తనని చెక్ చేపిద్దామని అంటుంది. డాక్టర్ శ్రీయాను చెక్ చేసి టాబ్లెట్స్ ఇస్తుంది.. ఇక డాక్టరు పల్లవిని కూడా చెక్ చేయండి అని అంటుంది అవని. కానీ పల్లవి మాత్రం అస్సలు ఒప్పుకోదు.. బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్న కూడా నాకు బ్లడ్ అంటే భయం అని అంటుంది.. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పల్లవి ఒప్పుకోదు.. పల్లవి నీ చెక్ చేసి డాక్టరు ఈమె ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ చేస్తుంది.

Also Read:రోహిణి రెండో ప్రగ్నెన్సీ.. షాక్ లో మీనా.. అడ్డంగా ఇరుక్కున్న మనోజ్..

ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవిని తిడతారు. మా ఎమోషన్స్ తో ఆడుకుంటావా? కొంచమైనా బుద్ధి ఉందా నీకు అని అందరూ తిడతారు.. ఆఖరికి భానుమతి కూడా నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని తిట్టిపోస్తుంది.. ఇక అవని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్తావని అస్సలు ఊహించలేదు. పల్లవి నేను మా నాన్న కోసం ఇదంతా చేశాను అని అనగానే అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×