E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని ఇరికించిన విశ్వం.. అమూల్య మాటతో విశ్వం కన్నీళ్లు.. ఫన్నీగా ప్రేమ, ధీరజ్ ఫైట్..

Illu  Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని ఇరికించిన విశ్వం.. అమూల్య మాటతో విశ్వం కన్నీళ్లు.. ఫన్నీగా ప్రేమ, ధీరజ్ ఫైట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు అన్న మాటలు తలుచుకొని అమూల్య బాధపడిపోతూ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే మా నాన్న తట్టుకోలేడు అని అనుకుంటుంది.. అలా ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటే ప్రేమ నర్మదతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ వచ్చి అమూల్య దగ్గర కూర్చుంటారు… పెళ్లయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా అని అమూల్యని అడుగుతారు.. అమూల్యమాత్రం అన్నయ్యలా ప్రేమను చూసి మురిసిపోతూ ఉంటుంది.. తను ఎటు తేల్చుకోలేక అయోమయంలో ఉండిపోతుంది.. నీ పెళ్లి కోసం మేమందరం గిఫ్ట్ తీసుకొచ్చాము అని చందు అంటాడు..వల్లిని వెళ్లి ఆ చీరను తీసుకురమ్మని చెప్తాడు. వల్లి మాత్రం సాగర్ మరిది గారు ఏ గిఫ్ట్ తీసుకురాలేదేంటి అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి కామాక్షి వస్తుంది.. మీకు మీ చెల్లి అంటేనే ప్రేమ నేనంటే ప్రేమే లేదు నాకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా అని అడుగుతుంది.. కానీ మీ చెల్లెలికి అన్ని గిఫ్ట్ ఇస్తున్నారు నేనంటే మీకు అసలు ప్రేమ లేదు కదా అని బాధపడిపోతూ ఉంటుంది.. అమూల్య అన్నల ప్రేమ చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అమూల్య నాన్న పరువు ఈ ఉంగరం అని అనడంతో వేదవతి తాను అర్థం చేసుకుంది అని సంబరపడిపోతూ ఉంటుంది.. అన్నల ప్రేమని ఈ ఉంగరంలో చూసుకుంటున్నాను అని అమూల్య అంటుంది.. కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగేనేమో కానీ ఇప్పుడు మాత్రం మీ పరువు తీసేలా ఏ పని చేయను అని అంటుంది.. ఆ మాట వినగానే వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక విశ్వం అమూల్యకు పదేపదే ఫోన్లు చేస్తాడు. కానీ విశ్వం ఫోన్లను అమూల్య చూసి కూడా లిఫ్ట్ చేయదు.. అమూల్య కి ఏమైంది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని శ్రీవల్లికి విశ్వం ఫోన్ చేస్తాడు.. శ్రీవల్లి వెటకారంగా మాట్లాడుతుంది.. చేతిలో మైక్ ఉంది ఇప్పుడు చెప్పమంటావా అని విశ్వం బెదిరిస్తాడు..

Advertisement

అమూల్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు ఎలా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయో ఏంటో అని శ్రీవల్లి అంటుంది. కానీ విశ్వం మాత్రం ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే.. నువ్వు వెళ్లి ముందు ఫోన్ ఇవ్వు అని అంటాడు. ఇక శ్రీవల్లి ఆగు ఇస్తాను అని అంటుంది. అమూల్య దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంటే వేదవతి పిలుస్తుంది.. శ్రీవల్లి ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ స్టవ్ మీద పాలు పెట్టాను వాటిని కాస్త చూడవా అని అంటుంది. ఇప్పుడే ఫోన్ రావడం చూసి ఎవరు ఫోను అని అడుగుతుంది. మా అమ్మ ఏదో అర్జెంటు మేటర్ అనుకుంటా.. మాట్లాడేసి వస్తాను అని అంటుంది.. కానీ వేదవతి మీ అమ్మతోనే కదా అంత రహస్యాలు ఏముంటాయి ఇక్కడే మాట్లాడొచ్చు కదా అని అంటుంది. రామరాజు మాత్రం వెల్లనివ్వు వెళ్లి మాట్లాడిని అని అంటాడు.

అమూల్య దగ్గరికి వెళ్లిన శ్రీవల్లి విశ్వం ఫోన్ చేశాడు అని చెప్పగానే షాక్ అవుతుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే.. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అని అర్థం కదా ఎందుకు మళ్ళీ చేశావు అని అమూల్య సీరియస్ అవుతుంది.. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాన్ని నేను చేసుకుంటాను నువ్వు నాకు ఇంకా ఫోన్ చేయొద్దు అని అంటుంది అమూల్య.. ఆ మాట వినగానే విశ్వం షాక్ అవుతాడు.. ఈరోజు మనం లేచిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. వెంటనే పెళ్లి చేసుకుందామని విశ్వం ఎంత చెప్పినా సరే అమూల్య మాత్రం వినదు.. ఈ విషయాన్ని విశ్వం భద్రతో చెప్తాడు. నేను ఓడిపోయాను అత్త నువ్వు చెప్పిన పనిని చేయలేకపోయాను అని ఫీల్ అవుతాడు.. ఇంతదానికే ఇంత ఫీలవుతున్నావ్ ఏంట్రా ఇంకా చాలా ఉంది ఒకసారి మూసుకుపోతే ఇంకొక దారి ఉంది కదా అటు ట్రై చెయ్ అని భద్ర సలహా ఇస్తుంది.

Advertisement

ఏమంటున్నావ్ నాకు అర్థం కావట్లేదు అత్త.. నువ్వు అలా ట్రై చెయ్యని భద్ర అనగానే విశ్వం ఇప్పుడు నాకు అర్థమైంది అత్తని అస్సలు వదలను అని అంటాడు.. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పెళ్లి పత్రికలను సెలెక్ట్ చేయడానికి అని వెళ్తారు.. అక్కడ ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒక యుద్ధమే చేస్తారు. అక్కడున్న షాప్ అతను ఏంటండీ మీరు పెద్ద యుద్ధం చేశారు. ఇది నా షాప్ అనుకుంటున్నారా డంప్యాడ్ అనుకుంటున్నారా అని అంటాడు.. మొత్తానికి ఒక పెళ్లి పత్రికను అయితే సెలెక్ట్ చేస్తారు. అది చాలా బాగుంది అని అనుకుంటారు.

Also Read :అవనిపై కక్ష్య పెంచుకున్న పల్లవి.. శ్రీయపై పల్లవి రివేంజ్.. ఇంట్లో పెద్ద రచ్చ..

విశ్వం తన మనుషులని ఆనందరావు దగ్గరికి పంపిస్తారు. ఆనంద్ రావు భాగ్యంతో కలిసి డ్యూయెట్ సాంగ్ చేయాలనుకుంటాడు.. ఆకుల పసరు లేకపోయినా ఇలాంటి వ్యవహారాలు మాత్రం బాగానే ఉన్నాయి అని భాగ్యం అంటుంది… ముందు వెళ్లి ఇడ్లీ రవ్వ తీసుకురా అని అనగానే ఆనంద్ రావు షాప్ కి వెళ్తాడు. బయట వెళ్లి చూడగానే అక్కడ బాడీగార్డ్స్ ఉండడంతో ఏంటి ఆ విశ్వం నుంచి కాపాడుకోవడానికి మా అమ్మడు బాడీగార్డ్స్ పెట్టిందా ఏంటి అని అనుకుంటాడు. అయితే ఆనందరావు బిల్డప్పు ఇస్తాడు కానీ చివరికి ఆనందంరావును తీసుకెళ్ళిపోవడంతో భాగ్యం షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×