E-Paper
Advertisement

Sony LinkBuds Clip: చెవిలో పెట్టుకోకుండానే మ్యూజిక్, కాలింగ్.. ఓపెన్‌ ఇయర్ డిజైన్‌తో లింక్‌బడ్స్ లాంచ్ చేసిన సోనీ

Sony LinkBuds Clip: చెవిలో పెట్టుకోకుండానే మ్యూజిక్, కాలింగ్.. ఓపెన్‌ ఇయర్ డిజైన్‌తో లింక్‌బడ్స్ లాంచ్ చేసిన సోనీ
Advertisement

Sony LinkBuds Clip| Sony తన కొత్త ఓపెన్-ఇయర్ ట్రూ వైర్‌లెస్ ఎయిర్‌బడ్స్ సోనీ లింక్‌బడ్స్ క్లిప్ (Sony LinkBuds Clip)ని లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్.. Sony ఓపెన్-ఇయర్ ఆడియో లైనప్‌లో కొత్త క్లిప్-ఆన్ డిజైన్‌తో తీసుకొచ్చాయి. చుట్టూ ఉన్న శబ్దాలు అడ్డుకోకుండా మ్యూజిక్, కాల్స్ వినాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కంఫర్ట్, అవేర్‌నెస్, క్లియర్ కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టారు.
రోజువారీ ప్రయాణం చేసేవారు , అవుట్‌డోర్ యూజర్లు, యాక్టివ్‌గా ఉండే వారికి ఈ ఇయిర్‌బడ్స్ సరిపోతాయి. చుట్టూ ఉన్న పర్యావరణంతో కనెక్టెడ్‌గా ఉంటూనే ఆడియో ఆనందించవచ్చు.

Sony LinkBuds Clip ధరలు, కలర్ ఆప్షన్లు

సోనీ లింక్‌బడ్స్ క్లిప్.. బ్లాక్, గ్రే, గ్రీన్, లవెండర్ కలర్స్‌లో లభిస్తాయి. అమెరికాలో వీటి ధర $229.99 (భారత కరెన్సీలో సుమారు రూ.21,000). ఆప్షనల్ కేస్ కవర్లు, ఫిట్టింగ్ కుషన్లు $24.99కి దొరుకుతాయి. ఇండియన్ మార్కెట్ ధర, అందుబాటు వివరాలను సోనీ ఇంకా ప్రకటించలేదు.

ఓపెన్-ఇయర్ క్లిప్-ఆన్ డిజైన్ వివరణ

Advertisement

సోనీ లింక్‌బడ్స్ క్లిప్.. ఇన్-ఇయర్ ఫిట్టింగ్ బదులు ఓపెన్-ఇయర్ క్లిప్-ఆన్ డిజైన్‌ను ఉపయోగిస్తాయి. ఇయర్ కెనాల్‌లోకి వెళ్లకుండా బయటి వైపు అటాచ్ అవుతాయి. ట్రాఫిక్, అనౌన్స్‌మెంట్స్, సంభాషణలు స్పష్టంగా వినవచ్చు. పాత రింగ్-స్టైల్ ఓపెన్-ఇయర్ డిజైన్‌కు బదులు C-షేప్డ్ క్లిప్ డిజైన్ ఇచ్చారు. వివిధ ఇయర్ షేప్స్‌కు స్టెబుల్‌గా ఉంటాయి. దీర్ఘకాలం వినడంలో అసౌకర్యం తగ్గుతుందని Sony చెబుతోంది. ప్రతి ఎయిర్‌బడ్ బరువు సుమారు 6.4 గ్రాములు మాత్రమే.

ఆడియో పర్‌ఫామెన్స్, కనెక్టివిటీ ఫీచర్లు

సోనీ లింక్‌బడ్స్ క్లిప్‌లో 10mm డైనమిక్ డ్రైవర్ ఉంది. ఓపెన్-ఇయర్ డిజైన్ వల్ల ఐసోలేషన్ తక్కువే కానీ బ్యాలెన్స్‌డ్ సౌండ్ క్లారిటీ ఇస్తుంది. నేచురల్ ఆడియోపై దృష్టి పెట్టారు. Bluetooth 5.3తో స్టేబుల్ వైర్‌లెస్ కనెక్షన్ ఉంటుంది. మల్టీపాయింట్ కనెక్టివిటీతో రెండు డివైస్‌లకు ఒకేసారి కనెక్ట్ అవుతాయి. ఫోన్, ల్యాప్‌టాప్ మధ్య సులభంగా స్విచ్ చేయవచ్చు. SBC, AAC ఆడియో కోడెక్స్‌లు సపోర్ట్ చేస్తాయి. హై-రిజల్యూషన్ కోడెక్స్ LDAC లేదు.

స్మార్ట్ లిజనింగ్ మోడ్స్, కాల్ క్వాలిటీ

Advertisement

ఈ కొత్త డిజైన్ ఇయర్‌బడ్స్‌లో Sony కొత్త లిజెనింగ్ మోడ్స్ జోడించింది. Voice Boost మోడ్ సంభాషణలు, అనౌన్స్‌మెంట్స్‌లో వాయిస్‌ను క్లియర్‌గా చేస్తుంది. నాయిసీ ఎన్విరాన్‌మెంట్‌లో కూడా వాయిస్ స్పష్టంగా వినవచ్చు. ఇందులోని సౌండ్ లీకేజీ రిడక్షన్ ఫీచర్ ఆడియో లీకేజ్‌ను తగ్గిస్తుంది. కాల్స్ కోసం AI-బేస్డ్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఉంది. బోన్ కండక్షన్ సెన్సార్లు వాయిస్ పికప్‌ను మెరుగుపరుస్తాయి.

బ్యాటరీ లైఫ్, చార్జింగ్ కెపాసిటీ

ఒక్క చార్జ్‌తో 9 గంటల వరకు ప్లేబ్యాక్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‌తో మొత్తం 37 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీర్ఘకాలం ప్రయాణం, రోజువారీ వినియోగానికి ఇవి సరిపోతాయి. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
3 నిమిషాల చార్జ్‌తో 1 గంట ప్లేబ్యాక్ దొరుకుతుంది. ఎయిర్‌బడ్స్ IPX4 రేటింగ్‌తో వాటర్, స్వెట్ రెసిస్టెంట్.

Also Read: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసే గూగుల్ ఫొటోస్.. ఎలా పనిచేస్తుందంటే

యాప్ సపోర్ట్, అదనపు ఫీచర్లు

సోనీ సౌండ్ కనెక్ట్ యాప్ ద్వారా ఇయిర్‌బడ్స్ కంట్రోల్ చేయవచ్చు. 10-బ్యాండ్ ఈక్వలైజర్‌తో సౌండ్ కస్టమైజ్ చేయవచ్చు. 360 Reality Audio సపోర్ట్‌తో ఇమ్మర్సివ్ లిసనింగ్ అనుభవం ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్, కస్టమైజబుల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. యూజర్లు తమ ప్రాధాన్యతల ప్రకారం ఆడియో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×