E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిపై కక్ష్య పెంచుకున్న పల్లవి.. శ్రీయపై పల్లవి రివేంజ్.. ఇంట్లో పెద్ద రచ్చ..

Intinti Ramayanam Today Episode: అవనిపై కక్ష్య పెంచుకున్న పల్లవి.. శ్రీయపై పల్లవి రివేంజ్.. ఇంట్లో పెద్ద రచ్చ..
Advertisement

Intinti Ramayanam Today Episode January 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. డాక్టరు పల్లవిని కూడా చెక్ చేయండి అని అంటుంది అవని. కానీ పల్లవి మాత్రం అస్సలు ఒప్పుకోదు.. బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్న కూడా నాకు బ్లడ్ అంటే భయం అని అంటుంది.. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పల్లవి ఒప్పుకోదు.. పల్లవి నీ చెక్ చేసి డాక్టరు ఈమె ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవిని తిడతారు. మా ఎమోషన్స్ తో ఆడుకుంటావా? కొంచమైనా బుద్ధి ఉందా నీకు అని అందరూ తిడతారు.. ఆఖరికి భానుమతి కూడా నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని తిట్టిపోస్తుంది.. ఇక అవని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్తావని అస్సలు ఊహించలేదు. పల్లవి నేను మా నాన్న కోసం ఇదంతా చేశాను అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవి ఎందుకు చెప్పిందని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ అనడం అయిపోయిందా నేను చెప్పేది వింటారా అని ఆ పల్లవి గట్టిగా అరుస్తుంది.. అవును నేను చెప్పింది అబద్ధమే తల్లి నవ్వుతున్నానని నేను అబద్ధమే చెప్పాను. మీరందరూ శ్రీయాను మహారాణి లాగా చూసుకుంటున్నారు..

నన్ను మాత్రం పనిమనిషి లాగా చూస్తున్నారు అది నాకు నచ్చలేదు అందుకే అబద్ధం చెప్పాను. మీరనుకుంటున్నట్టు నేనెవరిని మోసం చేయలేదు. ఏంటి మా నాన్న కోసం చేశాను అని అన్నారు కదా.. మా నాన్న కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు కదా అని పల్లవి అంటుంది. కమల్ని కూడా తన కన్నీళ్లతో కరిగిపోయేలా చేస్తుంది పల్లవి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి తన కడుపుకు బండారం బయటపెట్టిన అవనిపై కక్ష పెంచుకుంటుంది.. శ్రియకి ఇలాంటి సేవలు చేయడం నాకు నచ్చకే నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఇప్పుడే శ్రీయాని మహారాణి లాగా చూసుకుంటున్నారు.. ఇప్పుడే దాన్ని అలా చూస్తుంటే ఇకముందు బిడ్డ పుడితే నన్ను అసలు పట్టించుకోరు ఒక పురుగులాగా చూసేస్తారు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది.. అవని అక్కడ కనిపించడంతో నా కడుపు గురించి బయటపెట్టిన అవనిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని పల్లవి అనుకుంటుంది. అయితే పల్లవి శ్రీయ కడుపు పోవాలి ఏదో ఒకటి చేయాలని నూనె డబ్బా తెచ్చి శ్రీయ గది ముందర పోస్తుంది.. అప్పుడే గది నుంచి బయటికి వచ్చిన శ్రియ నూనె మీద కాలేసి జారి పడబోతుంది.

అది చూసిన శ్రీకర్ శ్రీయాని పడిపోకుండా పట్టుకుంటాడు.. ఇక అందరూ కూడా చూసుకొని నడవాలి కదా అమ్మ ఇలాంటి టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు.. అయ్యో ఏమైంది అసలు అని అవని కూడా అడుగుతుంది. నూనె మీద కాలు వేసి జారిపడ్డ పోయింది అని అనగానే పల్లవి అయ్యో అలా జారింటే నీ కడుపు పోయేది తెలుసా అని కొత్త నాటకం మొదలు పెడుతుంది.. నా కడుపు గురించి అబద్ధమని చెప్పింది అలాగే శ్రీయ కడుపు పోవాలని నాటకం ఆడుతుంది అని పల్లవి అంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి అని అందరూ అంటారు.. అవును నిజమే అవనీని శ్రేయ కడుపు పోవడానికి కారణమైంది అని అంటుంది..

Advertisement

ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి కొంచమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అవని సీరియస్ అవుతుంది. అక్షయ్ కూడా ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు అని అంటాడు. మా డాడీ ని కూడా మోసం చేశారు ఇలా మోసం చేయడం అవని అక్షయ్ బావలకు అలవాటే అని పల్లవి అంటుంది.. మీ డాడీని రిలీజ్ చేయకుండా చేశామని కక్ష పెంచుకొని నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా అని అవని పల్లవిని అడుగుతుంది.. మీ డాడీని స్వాతంత్రం కోసం పోరాడి వెళ్లలేదు కుట్రలు కుతంత్రాలు మోసాలు చేసి జైలుకు వెళ్ళాడు.. నువ్వేం తక్కువ చేసావా అప్పుడు ఎలాంటి పనులు చేసావో కాబట్టి అత్తయ్య నిన్ను ఇంట్లోంచి గెంటేసింది..

మళ్లీ నువ్వు తప్పు చేయలేదని ఇంట్లోకి అడుగు పెట్టావు. నువ్వు మాట్లాడుతున్నావా అని అవని పై పల్లవి రెచ్చిపోతుంది.. నువ్వేంటో నీ తండ్రి ఎవరో నీ బతుకు ఏంటో కూడా తెలియదు నువ్వు నన్ను అంటున్నావా అని పల్లవి అనగానే రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావా అని అరుస్తాడు. నేను చెప్పినవి ఏది నమ్మని వాళ్ళ దగ్గర నేను ఉండలేను అని పల్లవి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. నువ్వు జాగ్రత్త నీ బిడ్డ జాగ్రత్త శ్రీయాని పల్లవి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది.. అమలు వచ్చి పల్లవిని ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే మా డాడీ లేడు కాబట్టే నన్ను చీప్ గా చూస్తున్నారు అని అంటుంది.

పల్లవి ఎవరేం చెప్పినా వినకుండా బ్యాగ్స్ సర్దుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది.. నేను చేస్తున్న ఈ రచ్చ తోని నిన్ను విడిపించే ప్రయత్నం చేస్తాను డాడీ అని పల్లవి అనుకుంటుంది. ఇంట్లోని వాళ్ళందరూ ఎంతగా ఆపాలని ప్రయత్నించినా పల్లవి మాత్రం మా డాడీ చచ్చిపోయాడు. మావయ్య నువ్వు మా డాడీకి పూలదండ వేసేయండి అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. మీకు ఎవ్వరికీ మా డాడీ అంటే ఇష్టం లేదు. అందుకే జైలు నుంచి విడిపించడం లేదు. మా డాడీ ని నేను కూడా చనిపోయాడు అని అనుకుంటున్నాను అని అంటుంది. పార్వతి పల్లవి పై సీరియస్ అవుతుంది.. బ్రతికున్న మనిషికి దండ దయమంటున్నావా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అసలు అని అరుస్తుంది.

Also Read:ప్రభావతిని అనుమానించిన సత్యం.. రెచ్చిపోయిన ప్రభా.. బుక్కయిన రోహిణి..

పల్లవి మా డాడీ ని జైల్లో నీచంగా చూస్తూ అవమానిస్తున్నారు. మీరందరూ కూడా అలానే చూస్తున్నారు అందుకే మా డాడీ చచ్చిపోతేనే బాగుంటుంది అని పల్లవి అంటుంది. మీరు ఇలాంటి అవమానాలు చేస్తున్నారు కాబట్టే మా డాడీ కచ్చితంగా చచ్చిపోతారు అని పల్లవి ఎమోషనల్ అవుతుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం పల్లవి ఆలోచించి మాట్లాడు అని అంటాడు. అక్షయ్ మాత్రం నువ్వు ఈ సెంటిమెంటల్ డ్రామా ని ప్లే చేస్తున్నావని నాకు అర్థమైంది ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు అని అంటాడు. రాజేంద్రప్రసాద్ మాత్రం నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×