E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: ఒక్కటైన ప్రేమ ధీరజ్.. అమూల్య పెళ్లిపనుల హడావిడి.. శ్రీవల్లిపై అనుమానం..

Illu  Illalu Pillalu Today Episode: ఒక్కటైన ప్రేమ ధీరజ్.. అమూల్య పెళ్లిపనుల హడావిడి.. శ్రీవల్లిపై అనుమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం తన మనుషులని ఆనందరావు దగ్గరికి పంపిస్తారు. ఆనంద్ రావు భాగ్యంతో కలిసి డ్యూయెట్ సాంగ్ చేయాలనుకుంటాడు.. ఆకుల పసరు లేకపోయినా ఇలాంటి వ్యవహారాలు మాత్రం బాగానే ఉన్నాయి అని భాగ్యం అంటుంది… ముందు వెళ్లి ఇడ్లీ రవ్వ తీసుకురా అని అనగానే ఆనంద్ రావు షాప్ కి వెళ్తాడు. బయట వెళ్లి చూడగానే అక్కడ బాడీగార్డ్స్ ఉండడంతో ఏంటి ఆ విశ్వం నుంచి కాపాడుకోవడానికి మా అమ్మడు బాడీగార్డ్స్ పెట్టిందా ఏంటి అని అనుకుంటాడు.

అయితే ఆనందరావు బిల్డప్పు ఇస్తాడు. కానీ చివరికి ఆనందంరావును తీసుకెళ్ళిపోవడంతో భాగ్యం షాక్ అవుతుంది.. ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా పెళ్లి పత్రికను సెలెక్ట్ చేస్తారు.. మొత్తానికి పూర్తయ్యాయని ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు..ఇద్దరు కలిసి చాలా సంతోషంగా బయటికి వస్తారు.. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే నాకు అమూల్య దక్కుతుంది అని అంటాడు.. ఇంటి నుంచి పెళ్లికూతుర్ని తీసుకుని రావడం మామూలు విషయం కాదు.. శ్రీవల్లికి చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోదు.. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ వాళ్ళ ప్రేమని తెలుపుకుంటారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇదే హైలెట్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. నర్మదా చెప్పిన మాటని ధీరజ్ ఆలోచిస్తాడు.. ప్రేమ దగ్గరికి వెళ్తాడు.. కాఫీ తాగలేదా ఏంటి అలా ఉన్నావు అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అటు ఇటు చూస్తుంది. ధీరజ్ మాత్రం నిన్నే అడుగుతున్నాను. వెర్రీ దాని లాగా ఆ చుట్టుపక్కల చూస్తావ్ ఏంటి కాఫీ తాగలేదా అని అడిగితే సమాధానం చెప్పవేంటి..? నువ్వు ఎందుకు తాగలేదు అని అడిగితే ప్రేమ మనసు బాగోలేదు అని అంటుంది. ప్రేమ ధీరజ్ నుంచి వెళ్ళిపోతుంది.. కానీ ధీరజ్ మాత్రం ఈ పెళ్లి చాలా సంతోషంగా జరగాలని ప్రేమతో అంటాడు.

నువ్వు నా మాటలకి చాలా ఫీలయ్యావు అందుకే సారీ అని ధీరజ్ అంటాడు. ఏంట్రా నువ్వు నా దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నావు అని ప్రేమ అడుగుతుంది. ఇప్పుడు సారీ చెప్తావు రేపు మనసు బాధ పెట్టేలా మాటలు అంటావు అని ప్రేమ అనగానే ధీరజ్ ఫీల్ అవుతాడు. అలాంటిదేమీ లేదు ప్రేమ ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనను. నువ్వు హ్యాపీగా ఉండు ఇది మా ఇంటి శుభకార్యం అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు అని అంటాడు. మన సంతోషంగా అమూల్యల పెళ్లి చేస్తే తాను సంతోషంగా అత్తవారింటికి వెళ్తుంది అని ధీరజ్ అనగానే ప్రేమ ఒప్పుకుంటుంది.. నువ్వు వెళ్లి రెడీ అయిన పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా అని ప్రేమను పంపిస్తాడు ధీరజ్.

Advertisement

ఇక రామరాజు ఇంట్లో అమూల్య పెళ్లి సందడి మొదలైపోయింది. పసుపు దంచుడు కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలు పెట్టేసారు.. వేదవతి పసుపు దంచడానికి రెడీ అవుతుంది. రోకలి బండకి కామాక్షి పసుపు కొమ్ము కడుతూ ఇంట్లో ఒక పెద్ద కూతురు ఉందే.. దానికి ఒక రవ్వల నెక్లెస్ కూడా చేయించాలని లేదా అని అంటుంది. రోకలి బండకు పసుపు కొమ్ము కంటే రవ్వల నెక్లెస్ కావాలా ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడు చూసినా నీకు ఇదేం పిచ్చే అని వేదవతి క్లాస్ పీకుతుంది. అప్పుడే అక్కడికి నర్మదా ప్రేమలో వస్తారు.

వీళ్ళు ఎలాగో ఆడపడుచుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం నువ్వు కూడా ఇవ్వవా అమ్మ అనేసి కామాక్షి ప్రేమ నర్మదలను అవమానించేలా మాట్లాడుతుంది. కానీ వేదవతి మాత్రం నోరు మూసుకోవే ఏం మాట్లాడుతున్నావ్ కూడా అర్థం కావట్లేదు నీకు అని అంటుంది. మనమందరం ఇక్కడే ఉన్నాము బల్లి అక్క ఎక్కడుంది కనిపించలేదు అని అనుకుంటారు వేదవతి అడగడంతో మళ్ళీ ఎక్కడుందని వెతుకుతారు నర్మదాప్రేమ. వల్లి మాత్రం అందరూ సంతోషంగా ఉన్నారు నేను మాత్రం మా నాన్నకు ఏమవుతుందని టెన్షన్ పడిపోతున్నాను అని అనుకుంటుంది. అప్పుడే అక్కడ పిలవడంతో వెళుతుంది వల్లి. పసుపు దంచే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.

Also Read : ‘వారణాసి’ లో ఆ గెటప్ లో మహేష్.. జక్కన్న పై ఫ్యాన్స్ ఆగ్రహం..!

మంగళ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు.. అమ్ములేని చూసి రామరాజు ఎమోషనల్ అవుతాడు. నాకు ఇంకా నువ్వు నా చేతుల్లో పెరిగిన పసిబిడ్డ లాగే కనిపిస్తున్నావు. అప్పుడే పెళ్లి వయసు వచ్చింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటాడు.. అమూల్య మంగళ స్నానాలని అన్నదమ్ములు వదినలు చాలా సన్నగా పూర్తి చేస్తారు. విశ్వం మాత్రం అమూల్యను ఎలాగైనా సరే లేపుకొచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో అమూల్యని విశ్వం పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి..

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×