E-Paper
Advertisement

TGSRTC Goa Tour Package: ఆర్టీసీ బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 3,500కే గోవా టూర్!

TGSRTC Goa Tour Package: ఆర్టీసీ బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 3,500కే గోవా టూర్!
Advertisement

TGSRTC Goa Tour Package February 2026: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను కల్పించడంతో పాటు చక్కటి టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పుణ్యకేత్రాలకు టూర్ ప్లాన్ కొనసాగిస్తున్న ఆర్టీసీ.. తాజాగా గోవా టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది.

తాజాగా మహారాష్ట్ర, కర్నాటక టూర్ ప్రారంభం

ఇప్పటికే జనవరి 24 శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే కారణంగా వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు కూడా ప్రతి వీకెండ్ లో శని, ఆది వారాలు హాలీడేస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చులో లగ్జరీ బస్సులో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టొచ్చే అవకాశం కల్పించింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పుణ్యకేత్రాలకు తీసుకెళ్లింది. కేవలం రూ. 3 వేలకే ఒకరు 1 నైట్, 2 డేస్ పర్యటించేలా ప్లాన్ చేసింది. ఈ టూర్ లో భాగంగా పండరీ పూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. ఈ టూర్ కు సంబంధించిన బస్సు ఇప్పటికే BHEL డిపో నుంచి ప్రారంభం అయ్యింది.

ఫిబ్రవరి 2026లో గోవా టూర్

Advertisement

అటు ఫిబ్రవరి రెండో వారంలోనూ వరుస సెలువులు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ మరో క్రేజీ టూర్ ప్లాన్ ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌ లో గోవా వెళ్లాలనుకునే వారికి అనుగుణంగా ఈ ప్యాకేజీని డిజైన్ చేసింది. కేవలం రూ. 3,500 చెల్లించి లగ్జరీ బస్సులో గోవా వెళ్లి అక్కడి అందాలను చూసి ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తోంది. 3 రాత్రులు, 4 పగళ్ల పాటు కొనసాగే ఈ టూర్, కేవలం గోవాలోని బీచులు మాత్రమే కాకుండా,  చారిత్రక హంపీ నగరాన్ని, తుల్జాపూర్‌ లోని ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

Read Also: మీకు తెలుసా ఓ రైల్లో ఏకంగా ఆలయం ఉంది, గణపతికి ఓ బెర్తు కూడా ఇచ్చేశారు!

గోవా టూర్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?  

Advertisement

ఇక ఈ టూర్ కు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో లేదంటే దగ్గర లోని బస్ డిపోలో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, టికెట్ల బుకింగ్ కోసం ఆసక్తి ఉన్న వాళ్లు 9391072283, 9063401072 నంబర్లను సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇదో బెస్ట్ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ అంతా గోవా వెకేషన్ కు వెళ్లండి, బీచ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చివరగా ఆధ్యాత్మిక టచ్ కూడా ఇచ్చేయండి.

Read Also: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×