Illu Illalu Pillalu Today Episode January 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య రెడీ అయిందా? నా చెల్లెల్ని పెళ్లికూతురు గెటప్ లో ఎలా ఉందో చూడాలని అనుకుంటున్నాను.. అని ధీరజ్ ఒకవైపు అడుగుతున్న సరే ప్రేమ మాత్రం మౌనంగా ఉంటుంది.. అమూల్య ఇంట్లో లేదు అని వాళ్లు అంటారు. శ్రీవల్లి భాగ్యమాత్రం అమూల్య ఇంట్లో లేదన్న విషయం తెలిస్తే మనం దొరికిపోతామేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అమూల్య లేదన్న విషయం తెలిసిపోయింది. ఇక నాకు పాడి కట్టేస్తారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏదో టెన్షన్ పడుతూ వెతుకుతున్నట్లు కనిపిస్తారు. అది చూసిన సాగర్ అలాగే ధీరజ్ అమూల్య కనిపించలేదని చెప్తారు.. ఈ విషయాన్ని చెప్పి అందరూ కలిసి విశ్వం అమూల్యని ఏదో చేసి ఉంటాడని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ రచ్చ రచ్చ చేస్తారు. భద్ర మీ చెల్లెలు ఎవరితో లేచిపోయిందో ఎక్కడికి పోయిందో వెతుక్కోండి అని అంటుంది దాంతో భద్రం కొట్టడానికి ముగ్గురు అన్నదమ్ములు ముందుకొస్తారు.. కానీ భద్ర మాత్రం మీ చెల్లెలు ఎక్కడికి పోయిందో ముందు వెతుక్కోండి. ఎవరితో లేచిపోయిందో అది కనుక్కోండి అని అంటుంది.. తిరుపతి వాళ్ళ పెద్దమ్మ కూడా ఇంట్లో విశ్వం లేడు అని చెప్పగానే వాడి సంగతి తేలుస్తామని వెళ్తారు.. ఇక ధీరజ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి రావడంతో ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్య కనిపించలేదా అని అడుగుతారు.. శ్రీవల్లి మాత్రం అమూల్య గురించి తెలిస్తే నా గురించి తెలిసిపోతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి అమూల్యని ఎవరు రెడీ చేస్తున్నారు అని అడుగుతుంది.. ఎవరు మాట్లాడరేంటి? అమూల్య ఎక్కడ ఏం చేస్తుంది అని వేదవతి అడుగుతుంది. కామాక్షి ఈ చీర ఎవరు కట్టుకోవడానికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అటు విశ్వం మాత్రం అమూల్యతో శోభనం చేసుకోవాలని అనుకుంటాడు.. అమూల్య తన తండ్రి మాట కాదన్నానని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.. కామాక్షి అన్న మాటకి షాక్ అవుతుంది.. పెళ్లికూతురుగా అమూల్య ఇంట్లో కనిపించలేదు అని అనగానే ఏమైంది అని రామరాజు అడుగుతాడు.. ఇక రామరాజు టెన్షన్ పడిపోతుంటే అసలు విషయాన్ని చెప్పేస్తారు.. అమూల్యని పెళ్లి చేసుకోవాలని తాళి కట్టబోతాడు విశ్వం..
విశ్వం నన్ను వదిలేసేయ్… నిన్ను ఏమి అనను మా నాన్న పరువు పోతుంది నన్ను వదిలేయ్ వా అని బ్రతిమలాడుతుంది. మీ నాన్న గుండెలు పగిలేలా ఏడ్చాలని నీ మెడలో తాళి కట్టకుండా వదిలేసాను అని విశ్వం అంటాడు.. విశ్వం నిజ స్వరూప అని తెలుసుకొని అమూల్య షాక్ అవుతుంది.. ఇక అప్పుడే వనజ వాళ్ళ కుటుంబం అక్కడికి రావడంతో రామరాజు వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకు ఇక్కడ వున్నారు. మా కోడలు ఎక్కడుంది మరి కాసేపట్లో పెళ్లి జరగబోతుంది కదా ఎలా ఉంది అని వనజ అడుగుతుంది.. చెల్లెమ్మ మీకు ఒక విషయం చెప్పాలి అమ్మ మీరు లోపలికి రండి అని రామరాజు బ్రతిమలాడుతాడు..
అప్పుడే అక్కడికి వచ్చిన భద్ర దేని గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు కూతురు లేచిపోయిన విషయాన్ని దాచిపెట్టి ఇంట్లో వాళ్లకి చెప్పాలనుకుంటున్నావా అని అంటుంది.. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అన్నయ్యగారు అమూల్య ఇంట్లో లేదా అని వనజ అడుగుతుంది. ఈ విషయం గురించి మీతో మాట్లాడాలి మీరు ఒకసారి లోపలికి రండి అని రామరాజు అంటాడు.. భద్ర రామరాజుని అవమానించేలా మాట్లాడుతుంది.. మీ కూతురు లేచిపోయిందని చెవిలో చెప్పడమేంటి గొప్పగా చెప్పుకోవచ్చు కదా అని భద్ర అంటుంది.. అన్నయ్య ఏంటి ఆవిడ అలా మాట్లాడుతుంది అమూల్య ఇంట్లో లేదా ఉందా అని వనజ అడుగుతుంది..
కూతురు లేచిపోయిన కాబట్టే లోపల ఉండాల్సిన వాళ్ళందరూ కూడా బయట ఏడుస్తున్నారు ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదా అని సేనా అంటాడు. నా కూతురు లేచిపోయిందంటే అసలు నేను ఒప్పుకోను చంపేస్తాను అని రామరాజు.. కూతురు లేచిపోయింది అనంటే నీకు ఎందుకంత కోపం వస్తుంది మరి నీ కొంపలో ఉందా ఏంటి అని భద్ర అడుగుతుంది. ఆ తర్వాత కూతురు కనబడడం లేదని బాధలో ఉంటే ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు భద్ర అని వాళ్ళ పెద్దమ్మ అరుస్తుంది..
నా చెల్లెల్ని వాడు తీసుకెళ్లినప్పుడు, నా మేనకోడల్ని వాడు తీసుకెళ్లినప్పుడు నేను ఎంత భయపడ్డానో కంగారుపడ్డాను నీకు తెలియదా అని అంటుంది. వాడిది ఒక్కడిదే నా బాధ మాది కాదా బాధ అని భద్ర అంటుంది.. ఇక తర్వాత నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు అని వేదవతి అంటుంది.. ఏంటి వదిన గారు ఏం మాట్లాడుతున్నారు. మీ కూతురు లేచిపోయింది అని అంటున్నారు కదా ఏం సమాధానం చెప్పడం లేదంటే నీ మనసే అడుగుతుంది. నువ్వు ఇంత చిన్న అమాయకురాల్లాగా ఉన్నావేంటి? చిన్న పాప తప్పిపోతే తప్పిపోయింది అంటారు. అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని వనజ అడుగుతుంది. భద్ర పై రామరాజు మాత్రం సీరియస్ అవుతాడు.. అని వనజ మీ కూతురు ఎక్కడుంది చెప్పండి అని అడుగుతుంది..
రామరాజు ఏదో జరిగింది చెల్లెమ్మా ఈ విషయం గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అంటాడు. కూతురు కళ్ళ ముందే లేచిపోయిందని కనిపిస్తుంటే ఆ విషయాన్ని దాచి మమ్మల్ని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారా..? మీ అంతటి మీరు వచ్చి సంబంధం కలుపుకోవాలి అనుకున్నారు.. అబ్బాయి ఇష్టపడడంతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాము. కానీ మీ అమ్మాయి ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు పెళ్లికి ముందు లేచిపోయింది కాబట్టి మా పరువు అంతా ఇంతో మిగిలింది. కానీ పెళ్లి తర్వాత లేచిపోతే మా పరువంకను అని వనజ అంటుంది.
Also Read :కోటికి గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది.. రాజేంద్రకు పల్లవి వార్నింగ్.. పల్లవి ప్లాన్ సక్సెస్..
అయితే ఆ తర్వాత విశ్వం కారులో ఎంట్రీ ఇస్తాడు.. అమూల్యతో రాత్రంతా నేను గడిపాను అని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. మా చెల్లెలు గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని అంటాడు అమూల్య అన్నలు. కానీ అమూల్య కార్ల నుంచి దిగి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. రామరాజు నా పరువు అంతా తీసేసింది అని బాధపడిపోతూ ఉంటాడు. రాత్రంతా నాతో గడిపింది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..