E-Paper
Advertisement

Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Advertisement

Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. కోఠి బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అతడిని వెంబడించిన దుండగులు.. కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో రషీద్ కాలికి గాయమైంది. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే వివరాల కోసం స్థానికులను విచారిస్తున్నారు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులు గన్ తో కాల్చి బ్యాగ్ తో పరారైన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Also Read: నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతదేహాల గుర్తింపు, ఘటన వెనుక అసలు కారణం ఇదే

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×