WPL 2026 Eliminator scenarios: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 ) చివరి దశకు వచ్చేసింది. మరో మూడు మ్యాచ్ లు ఆడితే టోర్నమెంట్ ఫినిష్ అవుతుంది. మొన్న జనవరి 9వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 5వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఫైనల్ కు చేరింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అటు గుజరాత్ జెయింట్స్ మహిళల జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ కు ఎంపికైంది. మరో జట్టు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కు ఎంపిక కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఈ స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్ జట్టు పైన రేపు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే, ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 qualification scenarios ) నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్జ్ ( Delhi Capitals Women vs Up Warriorz Women) మధ్య రేపు కీలక ఫైట్ జరగనుంది. వడోదర వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ప్రారంభం అవుతుంది. అయితే ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఇందులో గెలిస్తే 8 పాయింట్లు సాధిస్తుంది. అదే జరిగితే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అవుతుంది. ఇంటికి వెళ్లనుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఎలిమినేటర్ మ్యాచ్ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది. అక్కడ గుజరాత్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడాలి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 3వ తేదీన ఉంటుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు, ఫిబ్రవరి 5వ తేదీన బెంగళూరు తో ఫైనల్ ఆడుతుంది. ఒకవేళ రేపు జరిగే చివరి లీగ్ దశ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయి యూపీ గెలిస్తే, రన్ రేట్ ఆధారంగా ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ కు వెళ్తుంది. ఒకవేళ ముంబై ఎలిమినేటర్ కు వచ్చిందంటే నేరుగా ఫైనల్ కు వెళ్లి, టైటిల్ కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది.
ఢిల్లీ వర్సెస్ యూపీ మధ్య మ్యాచ్ ముంబైకి చాలా కీలకంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే ముఖేష్ అంబానీ కొత్త స్కెచ్ లు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై (Mumbai Indians) మ్యాచ్ గెలిస్తే కచ్చితంగా కంపేర్లను కొనుగోలు చేసి గెలిచారనే ట్రోలింగ్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఎంపైర్ల నిర్ణయాలు కూడా ఉంటాయి. అయితే ఢిల్లీ వర్సెస్ యూపీ మధ్య జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయేలా అంబానీ స్కెచ్ లు వేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎంపైర్లను కొనుగోలు చేసి, యూపీని గెలిపించేందుకు అంబానీ సిద్ధమయ్యాడని అంటున్నారు. ఈ మేరకు దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు.
Also Read: Yuvraj Singh: యువరాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోటల్ లో చెప్పులు కూడా !
We are almost out of the season
We don't deserve to qualify with the team we have can't depend on 2-3 players all day. pic.twitter.com/8qYq33zFbj
— Mumbai Indians FC (@MIPaltanFamily) January 30, 2026
🚨 WPL Knockout scenarios :
– RCB qualified for the final
– Gujarat Giants qualified for the EliminatorNow Mumbai Indians is depants on Delhi vs UP game:
If Delhi wins – They will qualify
If UP wins – Mumbai will qualifyWho will qualify? 🧐 #WPL2026pic.twitter.com/sp5wE9P4hR
— Tejash (@Tejashyyyyy) January 30, 2026