Illu Illalu Pillalu Today Episode july 25th: కేక్ కటింగ్ కోసం అని అందరూ ఒక చోటికి రాగానే సేన మాత్రం మనం తెచ్చిన కేక్ ని అమ్మ కట్ చేయాలి. పుట్టినరోజు వేడుకల్ని ఎలా ఇంట్లో చేస్తున్నారు కదా ఇప్పుడు కేక అయినా మనది కట్ చేయాలి అని అంటాడు. ఆ మాట వినగానే సాగర్ కోపంతో రగిలిపోతాడు.. అదేదో అంతగా కట్ చేయించుకోవాలి అనుకుంటే మీ అమ్మని మీ ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకోమని చెప్పొచ్చు కదా అని అంటాడు.. ఇక ధీరజ్ కూడా సాగర్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆ కేక్ ని అక్కడి కట్ చేయించుకోవచ్చు కదా అని మాట్లాడితే శారదాంబ నా పుట్టినరోజులు నాడు గొడవలు వద్దు అని అంటుంది.. అయితే కేక్ కట్ చేసిన తర్వాత భద్ర వాళ్ళ అమ్మకి కేక్ పెడుతుండగా సేన ఆపుతాడు.. కేకులు ఏదో కలిపారు అంటూ ధీరజ్ అనడంతో ప్రేమతో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఆ కేకు మీద నాకు డౌట్ గా ఉంది అని ధీరజ్ అంటాడు. మీరు ఇంట్లో ఫంక్షన్ చేయడమే నాకు డౌట్ గా ఉంది. అలాంటిది ఇప్పుడు కేకు కూడా మీరే తెచ్చి పెడుతున్నారు. అందులో మేమే ముందు తినాలి అని అంటున్నారు కదా..నాకు ఇంకాస్త డౌటు పెరిగిపోతుంది అని ధీరజ్ అంటాడు.. ప్రేమ ఏంట్రా మా వాళ్ళు ఒక మెట్టు ది ఎంత దూరం మన ఇంటికి వస్తే ఇప్పుడు నువ్వు ఎందుకురా ఇంత ఘోరంగా అవమానిస్తున్నావు అని ప్రేమ అంటుంది.. అసలు ఎందుకురా నీకు అంత అనుమానం ఏం జరిగింది రా నీరజ్ అన్ని ప్రేమ అడుగుతూ ఉండగా ప్రేమ నువ్వు ఆగు అని భద్రవతి అంటుంది.. ఏంటి ఇప్పుడు ఈ కేకులో మీ మీద కలిపామని నువ్వు అనుమాన పడుతున్నావ్ అంతేనా అని భద్రావతి అడుగుతుంది. నీకు అంత అనుమానం ఉంటే ఈ కేకు నేను తింటాను అని కేకు తిని నాకేం కాలేదు కదా మేమెందుకు కలుపుతాము. మా అమ్మ కోసమే మేము ఇక్కడికి వచ్చాము అది గుర్తుపెట్టుకుంటే మంచిది అని భద్రావతి ధీరజ్ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది.. ఇక రామరాజు ఈ వేడుక అయిపోయేంతవరకు ఎవరిని ఏం మాట్లాడొద్దని చెప్పాను కదా రా మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నోరు మూసుకొని ఉండు అని అంటాడు..
ఇక ఈ మాటలు అనవసరం మనమందరం సరదాగా ఉంటున్నాం కాబట్టి సరదాగా ఒక ఫోటో తీసుకోవాలి అని శారదాంబ అడుగుతుంది.. ఆమె కోరిక మేరకు తిరుపతి అమ్మ ఫోటోగ్రాఫర్ సెటప్ అంత రెడీగా ఉంది మీరు గెటప్ చేంజ్ అంటూ అంటాడు. రెండు ఫ్యామిలీలు కలిసి దిగిన ఫోటో ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. నిజంగానే ఈ ఫోటో చాలా బాగా వచ్చింది అంటూ తిరుపతి ఆనందంగా ఉంటాడు. మన రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు మన రెండు కుటుంబాలు కలుస్తున్నాయి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని తిరుపతి అంటాడు.. ఇక ఈ ఫ్యామిలీ పార్టీలో ఫ్యామిలీ పిక్ ఎపిసోడ్లో హైలెట్గా నిలవడంతో పాటుగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. తిరుపతికి తీసిన ఫోటోలను చూసి వేదవతి అలాగే భద్రావతి ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు.. ఈ ఫ్యామిలీ పార్టీ సరదాగా గడుస్తుంది.. వీళ్ళని ఇంత సంతోషంగా చూసిన శ్రీవల్లి మాత్రం ఈ సరదాలు సరసాలు కాసేపటి వరకే ఆ తర్వాత రణరంగం మొదలు కాబోతుంది అని మనసులో అనుకుంటుంది..
ఇప్పుడు ఫోటో అయిపోయింది కదా ఇక మనం ఈ సంతోష సమయంలో డాన్సులు వేస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు.. ముందుగా నర్మదా సాగర్ ఇద్దరు కూడా తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు.. ప్రేమ ధీరజ్ అలాగే సుకన్య తిరుపతి కూడా డాన్సులు వేసి అందరిని మెప్పిస్తారు.. ఇక వీళ్లందరిని సరదాగా చూసిన శ్రీవల్లి మాత్రం మనసులో తిట్టుకుంటూ ఉంటుంది.. ఎలాగైనా సరే ఈ సంతోషాన్ని వేలకు దూరం చేయాలి అని అనుకుంటుంది.. భద్రావతి వేదవతి ఇద్దరూ కూడా అదిరిపోయే పాటకు డాన్సులు వేస్తారు.. అక్క నువ్వెక్కడ అంటూ ఒకరినొకరు ఎంత ఆప్యాయంగా డాన్స్ వేయడం చూసి అందరూ సంతోషంగా ఉంటారు.. ఈ ఎపిసోడ్ కి వీళ్లిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ కాస్త హైలైట్ గాని నిలుస్తుంది..
ప్రేమ నా జీవితం నాశనం అవ్వడానికి కారణమైంది. దానికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని శ్రీవల్లి అనుకుంటుంది.. నా జీవితంలోనూ నా కాపురంలోనే నిప్పులు పోసిన ప్రేమనే నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను.. భద్రావతి సేనాలు ప్రేమను తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకుంటుంది వల్లి. నా కాపురం పోయినా సరే పక్కనున్న వాళ్లు సంతోషంగా ఉంటారు అసలు సాధించలేము కదా అని వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ముహూర్తం పెట్టిస్తాను అని మనసులో అనుకుంటుంది. నర్మదా ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ బుల్లెట్ బండి లాగా తీసుకొస్తూ వాళ్ళని గుద్దేసుకుంటుంది.. ఎందుకే ఉదయం లేచినప్పటి నుంచి ఇలా ఆటో లాగా పరిగెత్తు ఉన్నావు అని ధీరజ్ అంటాడు.. మా వాళ్ల కోసం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందిరా అని ప్రేమ అనడంతో ధీరజ్ నీ సంతోషం తగలెయ్య పొద్దున్నుంచి పరిగెత్తుతూనే ఉన్నావే అని అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..