BigTV English

Illu Illalu Pillalu Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న నర్మద.. రామరాజు, సాగర్ మధ్య గొడవ..

Illu Illalu Pillalu Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న నర్మద.. రామరాజు, సాగర్ మధ్య గొడవ..

Illu Illalu Pillalu Today Episode june 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. పుట్టింటి నుంచి వెళ్తున్న శ్రీవల్లి నర్మదా ప్రేమలను చూసి ఆగుతుంది. వీరిద్దరూ ఏంటి ఒకచోట ముచ్చట పెట్టారు అది కూడా ఇక్కడ ఉన్నారేంటి అని ఆలోచిస్తుంది. అయితే ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దని మామయ్య అన్న కూడా ఈ ప్రేమ ఇక్కడికి వచ్చి డ్యాన్సింగ్ క్లాసులు నేర్పిస్తుందా? ఈ ప్రేమ విషయాని కచ్చితంగా మావయ్య ముందు చెప్పాల్సిందే.. మా హనీమూన్ ని వీళ్లిద్దరు చెడగొట్టారుగా.. ఇప్పుడు వీరిద్దరిని మావయ్య ముందర ఎలా ఇరికిస్తాను అని శ్రీవల్లి మనసులో అనుకుని ఇంటికి వెళ్తుంది.. అనుకున్నట్లే ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ డ్యాన్స్ క్లాసుల గురించి శ్రీవల్లి నర్మదా, ప్రేమను అడ్డంగా ఇరికిస్తుంది. నర్మద మాత్రం ఈరోజుల్లో కాలేజీలు జాబులు అంటూ అమ్మాయిలు ముందుకు వెళ్తున్నారు మామయ్య అని నర్మద అంటుంది. ఈ ప్రేమ ఇలా డాన్స్ క్లాసులకు వెళ్లి డాన్సులు చెప్పడానికి కారణం ఈ నర్మదనే. ప్రేమకి అంత ధైర్యం లేదు మొత్తం ఈ నర్మదనే చేసింది అంటూ రామరాజు సీరియస్ అవుతాడు.. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ మొదలవుతుంది. ఈ అమ్మాయి వల్లే ఇంట్లో ప్రతి ఒక్క గొడవలు అనర్ధాలు జరుగుతున్నాయి. మీ సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఆడవాళ్ళు ఎప్పుడు ఎదిగారు అంటూ చులకనగా మాట్లాడుతాడు రామరాజు. శ్రీవల్లి వాళ్ళిద్దరిని రామరాజు తిడుతుంటే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.. నర్మద ఎంత చెప్పినా కూడా రామరాజు వినకపోవడంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది..

గదిలోకి వెళ్ళిన వేదవతి రామరాజుతో గొడవ పెట్టుకుంటుంది. మీరన్నది ఏమైనా బాగుందా అని వేదవతి రామరాజు పై సీరియస్ అవుతుంది. నేను అన్న దాంట్లో తప్పేముంది అని రామరాజు అంటాడు. నర్మద వల్లే గొడవలు జరుగుతున్నాయంటే బాధపడదా అని అన్న కూడా రామరాజు వినకుండా నేను చేసింది కరెక్టే అని వెళ్ళిపోతాడు. అటు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ధీరజ్ చెప్పిన వినకుండా బాధపడుతుంది. నువ్వేం బాధ పడాల్సిన అవసరం లేదు అని ధీరజ్ సపోర్ట్ చేస్తాడు. నర్మదా ఫీలవుతూ ఉంటుంది. శ్రీవల్లి మాత్రం నర్మదని ఇరికించాను ప్రేమను ఇరికించెను ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది.


మిల్లుకు వెళ్లిన సాగర్ ను రామరాజు అరుస్తాడు. అక్కడ నర్మదా చేసింది తప్పే కాదు అని సాగరు అనడంతో రామరాజు నేను చేసింది తప్ప అని గొడవపడతాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు గురించి వాళ్ళ ఆలోచించుకుంటున్నారు కానీ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని సాగర్ అంటాడు. దానికి రెచ్చిపోయిన రామరాజు సాగర్ ని దారుణంగా తిడతాడు. అయితే మధ్యలో తిరుపతి కలుగజేసుకొని ఆ గొడవ చేస్తాడు. అయితే ఇంట్లో ప్రేమ, నర్మదను వేదవతి ఒక ఆట ఆడుకుంటుంది. నర్మదా కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదవతి కరిగిపోతుంది. ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నేనే కారణమా అని ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Mahesh Babu -Sandra: ఘనంగా బుల్లితెర నటుడు మహేష్ బాబు నిశ్చితార్థం..ఫోటో వైరల్!

Anasuya: వారందరికీ శాపాలు పెట్టిన అనసూయా.. చాలా బాధగా ఉందంటూ?

Sreemukhi: శ్రీముఖికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బాలు.. నిజంగానే ప్రేమలో పడ్డాడా ఏంటీ?

Big Tv Kissik talks: ప్రాణ స్నేహితుడితో ఢీ డాన్సర్ పండుకి గొడవలు.. లైవ్ లోనే ఎమోషనల్.!

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. అడ్డంగా బుక్కయిన చక్రధర్.. వ్రతం ఆపేందుకు ప్లాన్..

GudiGantalu Today episode: బాలు తప్పులేదని తెలుసుకున్న మీనా.. గుణకు చుక్కలే.. షాక్ లో ప్రభావతి..

Big Stories

×