Bollywood:ఈమధ్య కాలంలో సౌత్ – నార్త్ అనే తేడా లేకుండా అక్కడి వాళ్ళు ఇక్కడ.. ఇక్కడి వాళ్ళు అక్కడ సినిమాలలో నటిస్తూ తమ మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా కథ బాగుంటే ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అందుకే ఈమధ్య హీరోలు కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా తమ స్టేటస్ ను మరింత విస్తృతం చేసుకోవడానికి అన్ని భాషలలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సౌత్ స్టార్ హీరో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. మరి ఈసారైనా ఆయన సక్సెస్ అవుతాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరు? 12 ఏళ్ల గ్యాప్ రావడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఏ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ అయినట్టేనా?
ఆయన ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ పై రోజుకో వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. మరోవైపు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ విషయంలో కన్ఫర్మేషన్ ఉన్నా.. రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ లిస్టులో సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga), త్రివిక్రమ్ (Trivikram ) వంటి డైరెక్టర్స్ ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బాలీవుడ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.
ముఖ్యంగా రామ్ చరణ్ – డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి అల్లు అర్జున్ (Allu Arjun) తో త్రివిక్రమ్ చేయాల్సిన మైథాలజికల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ (NTR)చేతిలోకి వెళ్ళింది అని అటు నిర్మాత నాగ వంశీ (Naga Vamshi) ఇచ్చిన కన్ఫర్మేషన్ తో ఇప్పుడు రామ్ చరణ్ – త్రివిక్రమ్ సినిమాపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. దీనికి తోడు అటు త్రివిక్రమ్ చేతిలో విక్టరీ వెంకటేష్(Venkatesh), ఎన్టీఆర్ (NTR) ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని కూడా నాగ వంశీ తెలిపారు. అందుకే ఇప్పటివరకు హల్చల్ చేసిన త్రివిక్రమ్ – రామ్ చరణ్ ప్రాజెక్టు కేవలం గాసిప్ గానే మిగిలిపోయింది.
12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..
దీంతో బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరో కాదు నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh bhutt). బాలీవుడ్ లో ‘కిల్’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తీసిన ఈయన.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేసినట్లు.. ఇక కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ త్వరలోనే ఓకే అవుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.
రీ ఎంట్రీ వర్కౌట్ అవుతుందా?
ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ – రామ్ చరణ్ తో సినిమా చేయడం లేదని కన్ఫర్మేషన్ రావడంతో రామ్ చరణ్ – నిఖిల్ నగేష్ ప్రాజెక్టు మరొకసారి తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ 12 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పాలి. గతంలో ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈయన .. ఈ సినిమాతో డిజాస్టర్ ను చూశాడు. దాంతో మళ్ళీ బాలీవుడ్లో సినిమా చేయలేదు. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ అంటే ఇప్పుడైనా సక్సెస్ అవుతాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Fathima Sana Shaikh: ఛీ.. ఛీ.. మరీ ఇంతలా దిగజారాలా.. స్టేజ్ పైనే దంగల్ బ్యూటీ అసభ్యకర ప్రవర్తన!