BigTV English

Israel-Iran Conflict: వరల్డ్ వార్ 3 మొదలు.. ఇదే ఇరాన్‌కు ఆఖరి రాత్రి

Israel-Iran Conflict: వరల్డ్ వార్ 3 మొదలు.. ఇదే ఇరాన్‌కు ఆఖరి రాత్రి

Israel-Iran Conflict: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణలు మరో లెవెల్‌కు వెళ్తున్నాయి. ఇది ఆగేలా కనిపించడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయ్. క్షిపణులు, డ్రోన్లతో రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు నడుస్తున్నాయ్. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఎటాక్స్ చేస్తోంది. ఇజ్రాయెల్‌ దాడులకు ఇరాన్‌ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. ఇజ్రాయెల్‌పై మిసైల్స్ ప్రయోగిస్తోంది. ఇరాన్‌ జరిపిన దాడుల్లో జెరూసలేంలోని అమెరికా ఎంబసీ స్వల్పంగా దెబ్బతిన్నది. ఇరాన్‌ ప్రయోగించిన మిసైల్ యూఎస్‌ ఎంబసీ సమీపంలో పడింది. దీంతో రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లు.. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి తెలిపారు. దీంతో ఎంబసీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


 ఇరాన్‌ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చిన ఇజ్రాయెల్

నిజానికి న్యూక్లియర్‌ బాంబుకు సంబంధించిన డిజైన్‌ ప్రాసెస్‌కు.. కీలక ప్రయోగం ఇరాన్ చేసిందన్న సమాచారం ఇజ్రాయెల్‌కు చేరింది. దీంతో టెహ్రాన్‌ తలుచుకొంటే కొన్ని వారాల్లో అణుబాంబును రూపొందించగలదని నిర్ధరణకు వచ్చింది. ఇక ఏమాత్రం ఆగినా తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన ఇజ్రాయెల్‌.. ముందస్తు దాడులకు దిగిందని అంటున్నారు. న్యూక్లియర్ వెపన్ ను ప్రయోగించేందుకు వీలుగా.. పరికరాలను అమర్చేందుకు అన్ని అస్త్రాలను ఇరాన్ రెడీగా చేసుకుంటోందని గుర్తించారు. ప్రస్తుతం ఇరాన్‌ వద్ద ఉన్న యురేనియం మరింత శుద్ధి చేస్తే 9 అణుబాంబుల తయారీకి సరిపోతుందని అటామిక్‌ ఎనర్జీ సంస్థ ఇటీవలే రిపోర్ట్ కూడా ఇచ్చింది. అందుకే ఇజ్రాయెల్ అలెర్ట్ అయి దాడులు మొదలు పెట్టిందంటున్నారు. అందుకే ఇజ్రాయెల్‌ తొలిదాడిలోనే అనుభవజ్ఞులైన ఇరాన్‌ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది.


ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తామని పాక్ ప్రకటన

అటు ఇజ్రాయెల్‌ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్‌ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్‌ అటాక్‌ చేస్తుందని ఇరాన్‌కు చెందిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్‌ జనరల్‌ మొహసిన్‌ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై పాకిస్తాన్ తమకు హామీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. టర్కీ, సౌదీ, పాకిస్థాన్‌ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్‌ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్‌ అన్నారు. అయితే ఇరాన్‌ చేసిన ప్రకటనను పాక్‌ ఖండించింది. తాము అలాంటి కమిట్‌మెంట్‌ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్‌ రక్షణ శాఖ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. అణు ఆయుధాలను కేవలం తమ ప్రజలు, తమ దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తామన్నది. అయినప్పటికీ ఇరాన్‌కు తమ సపోర్ట్ ఉంటుందని అతివినయం ప్రదర్శించింది పాకిస్తాన్.

ఇజ్రాయల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం

ఇదిలా ఉంటే.. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం బీభత్సం సృష్టిస్తోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్ 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయిల్‌ ఈ దాడులకు దీటుగా స్పందిస్తూ.. టెహ్రాన్‌లో బాంబులతో దాడి చేసింది. ఏకంగా ఇరాన్ అధికారిక టీపీ భవనం పై బాంబు దాడి చేసింది. దీనికి ముందే ఐఆర్‌ఐబీ ఆఫీస్‌ ఉన్న ప్రాంతంలో పౌరుల ఖాళీ చేయాలని హెచ్చరించింది.

ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించాం -ఇజ్రాయిల్

ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో తాము టెహ్రన్‌ గగన తలంపై పూర్తి నియంత్రణ సాధించామని… మిసైల్ లాంచ్ వ్వవస్థలు నాశనం చేశామని అధకారికంగా ఇజ్రాయల్ ప్రకటించింది. యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిసైల్స్‌ను ధ్వంసం చేస్తామని తెలిపింది.

Also Read: సముద్రంలో మునిగిపోతున్న జపాన్ ఎయిర్ పోర్ట్.. ఇక పూర్తిగా కనుమరుగు

యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిసైల్స్‌ను ధ్వంసం చేస్తాం

తమ దేశంపై ఇజ్రాయిల్ అను బాంబుు ప్రయోగిస్తే పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ పై ఇజ్రాయల్ అణు బాంబు ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాక్ ఇజ్రాయల్ పై అణు బాంబ్ వేస్తుందని తమకు హామీ ఇచ్చినట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ జనరల్ మొహసిన్ రెజాయి అన్నారు. కాని దీన్నీ పాక్ విదేశంగశాఖ మంత్రి ఖండిచారు, తప్పుడు ప్రచారంమన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×