E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ఘోర అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ప్రేమ ఎమోషనల్..

Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ఘోర అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ప్రేమ ఎమోషనల్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 7th : నా కొడుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.. జీవితంలో పైకి రావాలని ఆశ పడుతున్నాడు.. వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వాడి జీవితాన్ని మొగ్గలోనే తుంచేయకండి.. వాడికి చాలా భవిష్యత్తు ఉంది.. మీ పగ నా మీదే కదా నన్ను ఏదైనా చేయండి అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ సీన్అందరిని కంటతడి పెట్టిస్తుంది. తన కొడుకు కోసం రామరాజు పడుతున్న బాధను చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను ఏదైనా చేయండి మీ కాళ్లు పట్టుకుంటాను నా కొడుకుని వదిలేయండి అని రామరాజు బ్రతిమలాడుతాడు. కానీ సేన భద్రావతి రామరాజు అంటే పౌరుషానికి పేరు కదా.. అలాంటిది మా కాళ్లు పట్టుకుంటానని అంటావా చూసావా అక్క రామరాజు ఎంతకు దిగజారాడు అని సేన అంటాడు.. మొత్తానికి ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి యుద్ధం నడుస్తుంది..

భద్ర పగ చల్లారిందా..?

ఏ తప్పు చేయని ధీరజ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తింటూ ఉండడం చూసినా రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. శత్రువులైన సేన భద్రాలను మీ కాళ్లు పట్టుకుంటాను నా కొడుకు నువ్వు వదిలేయండి అని ఎంతగా బతిమిలాడిన కూడా.. ఆ ఇద్దరూ రాక్షసత్వంతో ఉంటూ రామరాజని ఘోరంగా అవమానిస్తూ ఉంటారు. ప్రేమ ధీరజ్ లు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నంగా ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రేమ చాలా కృంగిపోతుంది.. కానీ ధీరజ్ ని అరెస్ట్ చేసి జైలు నుంచి రిలీజ్ కాకుండా చేయడమే భద్ర ప్లాన్.. మొత్తానికి అలా చేసి తన పగని కొంతవరకు చల్లార్చుకుంది..

కొడుకు కోసం వేదవతి కన్నీళ్లు..

Advertisement

తన కొడుకు జైలుకు వెళ్లడానికి తనే కారణం అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వేదవతి.. నా మేనకోడలు జీవితాన్ని కాపాడాలి అని నా కొడుకు ఎంత పెద్ద త్యాగం చేశాడు.. కానీ ఇప్పుడు అదే వాడికి శాపంగా మారింది అని బాధ పడిపోతూ ఉంటుంది వేదవతి. ధీరజ్ ని అనవసరంగా నేనే ఇబ్బందుల్లో పడేసానేమో అని కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు కోసం గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది. తన కొడుకు తన మాట విని తాళి కట్టిన సందర్భాన్ని గుర్తుచేసుకొని ఇంకాస్త బాధ పడిపోతూ ఒంటరిగా గా ఏడుస్తూ కూర్చుంటుంది..

వేదవతిని ఓదార్చిన నర్మదా..

అత్తయ్య మీరు ఇలా బాధపడుతూ ఉంటే ధీరజ్ బయటకు వస్తారా చెప్పండి. రేపు సాయంత్రం లోపు ధీరజ్ ఇంట్లో ఉంటాడు మీరు ఏమి బాధపడకండి అని వేదవతిని నర్మదా ఎంతగా ఓదార్చిన సరే తను మాత్రం అసలు వినకుండా బాధపడిపోతూ ఉంటుంది. చూసావా నర్మదా చిన్నోడికి ఎలాంటి కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాడికి ఇలాంటి కష్టం రావడానికి కారణం నేనే.. నా పుట్టింటి వాళ్ళని బ్రతికించాలన్న ఒకే ఒక ఆశ నా కొడుకుని ఇప్పుడు జైలు పాలు చేస్తుంది అని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది వేదవతి. నర్మదా ఎంతగా బ్రతిమలాడుతున్న కూడా వేదవతి మాత్రం నాదే తప్పు నేనే నా మేనకోడలు మెడలో తాళికట్టమని చెప్పాను అని బాధపడిపోతూ ఉంటుంది. తన అత్త బాగానే చూసిన ప్రేమ తట్టుకోలేక పోతుంది..

భద్ర కండిషన కు ప్రేమ ఒప్పుకుంటే..

Advertisement

ధీరజ్ నీ ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని భద్ర వార్నింగ్ ఇస్తుంది. నా మేనల్లుడిని జైలుకు పంపిస్తాడా అలాంటి వాడి మీద పగ తీర్చుకున్నాను అని భద్ర అంటుంది. ధీరజ్ గాడు జైలు నుంచి బయటకు రావాలంటే ఒకటే మార్గం ఉంది.. నా మేనకోడలు వాడి కట్టిన తాళిని వాడి మొహానికి మళ్లీ నా ఇంట్లోకి అడుగు పెట్టాలి. అప్పుడే వాడిని రిలీజ్ చేస్తాను అని భద్ర అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతుంది.. మరి ధీరజ్ని రిలీజ్ చేయించేందుకు దూరం అవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.

ధీరజ్ కోసం బాక్స్ తీసుకొని వెళ్లిన ప్రేమ..

ధీరజ్ పై ప్రేమను పెంచుకున్న ప్రేమ తన కోసం ఏదైనా చేయాలి అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తనకోసం ఇంత చేసిన ధీరజ్ ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని నిర్ణయించుకుంటుంది.. కానీ ధీరజ్ ఉదయం నుంచి ఏమీ తినలేదని అతని కోసం పోలీస్ స్టేషన్ కి భోజనం తీసుకుని వెళుతుంది ప్రేమ.. ధీరజ్ నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి.. నిన్ను ఎవరు రమ్మన్నారు ప్రేమ ఇంత దూరం నువ్వు ఒక్కదానివే వచ్చావని అడుగుతాడు.. నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదు కదరా ఇది భోజనం చేయాలి అని ప్రేమ అనగానే వీరేశ్ ఎమోషనల్ అయిపోతాడు. వీరిద్దరి ఎమోషనల్ సీన్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అంతమాట అన్నావేంటి బ్రో..

Related News

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Big Stories

Advertisement
×