E-Paper
Advertisement

ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ప్రియుడి ఎంట్రీతో బుర్రపాడు షాక్

ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ప్రియుడి ఎంట్రీతో బుర్రపాడు షాక్

Romantic Drama on OTT : లవ్ స్టోరీలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి. ఓ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరో పెళ్లి చేసుకోవాల్సి వస్తే ? తీరా పెళ్లయ్యాక ప్రియుడు ఆమె లైఫ్ లోకి వస్తే… ఆ ప్రేమికురాలు జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీనే 2018లో విడుదలైన బాలీవుడ్ సినిమా ‘మన్మర్జియాన్’ (Manmarziyaan 2018) హార్ట్ టచింగ్ లవ్ ట్రయాంగిల్ డ్రామా. అభిషేక్ బచ్చన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం పంజాబ్ నేపథ్యంలో సాగుతుంది.

స్టోరీలోకి వెళ్తే ?

రూమీ (తాప్సీ పన్ను) అనే యువతి చాలా ధైర్యవంతురాలు, స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆమె విక్కీ (విక్కీ కౌశల్)ని గాఢంగా ప్రేమిస్తుంది. విక్కీ లోకల్ క్రికెటర్, ఎంతో ఎనర్జీతో ఉంటాడు. ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు. కానీ విక్కీ జీవితంలో ఇంకా స్థిరపడలేదు. దీంతో రూమీ కుటుంబం వారి ప్రేమను ఆమోదించదు. వారు రూమీకి రాబీ (అభిషేక్ బచ్చన్)తో పెళ్లి నిశ్చయిస్తారు. రాబీ బ్యాంక్ మేనేజర్, స్థిరమైన ఉద్యోగం, మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రూమీ మొదట్లో రాబీని ఇష్టపడదు. కానీ రాబీ ఆమెతో స్నేహం పెంచుకుంటూ, ఆమె మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

Also Read : 1984లో ఎగిరి 2019లో కూలే విమానం… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

అతని మెచ్యూరిటీ, ప్రేమ, ధైర్యం రూమీ మనసులో మార్పు తెస్తాయి. ఇక్కడి నుంచి రూమీ జీవితం పూర్తిగా గందరగోళంగా మారిపోతుంది. ఒకవైపు తన ఫస్ట్ లవ్ విక్కీ, మరోవైపు రాబీ మధ్య ఆమె తీవ్రమైన మానసిక సంఘర్షణలో పడుతుంది. కుటుంబ ఒత్తిడి, సమాజం, హృదయం కోరుకునే వ్యక్తి.. మూడింటి మధ్య ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది సినిమా ముఖ్యాంశం.

ఎక్కడ చూడవచ్చు ?

ఈ సినిమా ప్రయాణం సమయంలో జరిగే చిన్న చిన్న సన్నివేశాలు, డైలాగులు చాలా రియల్‌గా ఉంటాయి. ప్రేమ అంటే ఏమిటో, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో బాగా చూపించారు. తాప్సీ పన్ను – రూమీగా, విక్కీ కౌశల్ – విక్కీగా, అభిషేక్ బచ్చన్ – రాబీగా నటించారు. అమిత్ త్రివేది సంగీతం ఇంకా మెరుగు పెట్టింది.‘మన్మర్జియాన్’ సినిమాలో ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎంత మారుతామో, కుటుంబ ఒత్తిడి ఎంత ఉంటుందో, సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో చూడవచ్చు. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఈ తరం యువతరం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ మూవీని Zee5 ఓటీటీలో చూడవచ్చు.

Also Read : ఆటో డ్రైవర్ కు దొరికే 5 కోట్ల విలువైన పురాతన విగ్రహం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Tags

Related News

OTT Movies : వీకెండ్ ఓటీటీలో వినోదమే.. తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

హాలీవుడ్ స్టైల్ తమిళ మర్డర్ మిస్టరీ… మైండ్ బ్లాంకయ్యే క్లైమాక్స్

పోలీస్ అధికారి లోడెడ్ గన్ మిస్సింగ్… ఈ మలయాళం మూవీలో ఒక్కో ట్విస్టు మెంటల్ మాస్

ఆటో డ్రైవర్ కు దొరికే 5 కోట్ల విలువైన పురాతన విగ్రహం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

1984లో ఎగిరి 2019లో కూలే విమానం… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

కడుపుతో ఉన్న కూతురిపై కసాయి తండ్రి క్రూరత్వం… రక్తాన్ని మరిగించే రివేంజ్ థ్రిల్లర్ సిరీస్

అమ్మాయి చస్తే ఇవేం సైకో పనులు భయ్యా… 8 ఎపిసోడ్ల మెంటల్ మాస్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×