E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ అరెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ అరెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june5th : వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా రీల్స్ చేస్తూ ఉంటారు.. అయితే వల్లి డాన్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉండాలని చూస్తున్నా నర్మదా నిజంగానే కడుపుతో ఉందా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని నేరుగా వల్లి దగ్గరికి వెళ్లి కనుకోవాలని అనగానే శ్రీవల్లి అయ్యో అడ్డంగా దొరికిపోయానే అని ఫీల్ అవుతుంది. ప్రేమ ఇంటికి రాలేదు ఏమైంది అని నర్మదా కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే ప్రేమకు ఫోన్ చేయగానే ప్రేమ ధీరజ్ అరెస్టు అయిన విషయాన్ని చెప్పగానే నర్మదా షాక్ అవుతుంది.. నర్మద టెన్షన్ పడుతూ రామరాజుకి ఈ విషయాన్ని చెప్పబోతోంది.

రామరాజు షాక్.. 

నర్మదా ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని సాగర్ అడుగుతాడు… మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు అంటే ఏదో జరిగింది ఏం జరిగింది నర్మదా అని సాగర్ అడుగుతాడు.. ధీరజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారట మావయ్య అని నర్మదా చెప్పగానే రామరాజు తో పాటు వేదవతి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటమ్మా ఏం చెప్తున్నావు నువ్వు అని రామరాజు అడుగుతాడు. కార్లో అవేవో దొరికాయని పోలీసులు అరెస్ట్ చేశారట అని నర్మద చెప్పగానే సాగర్ చూశారా అతని చూసి నేను నేర్చుకోవాలట అని వెటకారంగా మాట్లాడతాడు.. ఆ మాట వినగానే వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

వేదవతి ఎమోషనల్ డైలాగులు..

Advertisement

పోలీస్ స్టేషన్ కి వెళ్లిన రామరాజు వేదవతి నర్మదలు అక్కడ ప్రేమను చూసి ఏమైంది అని అడుగుతారు.. ఏమైంది ప్రేమ ఎందుకు ధీరజ్ని అరెస్ట్ చేశారు అని అడుగుతారు. ధీరజ్ని జైల్లో చూసిన వేదవతి కన్నీళ్ళతో తన కొడుకు కోసం బాధపడుతుంది.. ధీరజ్ నీలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినందుకు నా గుండె తరుక్కుపోతుంది అని కంటతడి పెట్టి అందరిని ఏడిపించేస్తుంది. తన తల్లిని చూసిన ధీరజ్ నువ్వేమీ బాధపడకమ్మా అని ఎంతగా చెబుతున్నా సరే.. వేదవతి నా కొడుకుని కొట్టడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది రా నిన్ను ఇలా కొడితే నాకు బాధ కాక ఏమొస్తుంది. చిన్న ముల్లు గుచ్చుకుంటేనే నేను విలవిన్లాడి పోతాను అలాంటిది నేను ఎలా కొడితే నేను ఎలా తట్టుకుంటాను రా అని వేదవతి అంటుంది..

నేను ఏ తప్పు చెయ్యలేదు.. 

అమ్మ నువ్వేం బాధపడకు అమ్మ. మామిడికాయలు అని చెప్తే నేను వాణ్ని కారులోకి ఎక్కించుకున్నాను.. కానీ వాడు అక్కడి నుంచి నన్ను ఇరికించి పారిపోతాడని అస్సలు అనుకోలేదు అని దీనజంటాడు.. నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని ధీరజ్ రామరాజుకి చెప్పి ఎమోషనల్ అవుతాడు.. నువ్వు నా కొడుకువి రా ఏ తప్పు చేయవని నాకు బాగా తెలుసు అని రామరాజు అంటాడు.. నువ్వేం బాధపడకు నేను వెళ్లి లాయర్ తో మాట్లాడతాను అని రామరాజు అంటారు. అయితే అప్పుడే పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఎస్ఐ వాళ్ళందరితో కఠినంగా మాట్లాడుతాడు.

నువ్వేమి పోటుగాడివి కాదు..

Advertisement

ఎస్ఐ గారు మీరు మా అబ్బాయిని పొరపాటున అరెస్టు చేశారు. వాడెవడు మామిడికాయలు అని చెప్పి ఎక్కాడట వాడిని మీరు పట్టుకోకుండా నా కొడుకుని అరెస్ట్ చేశారు అని రామరాజు ఎంత చెప్తున్నా సరే.. ఆ ఎస్ ఐ మాత్రం మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండినట్లు తెలుస్తుంది. మీకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని అతను అనగానే రామరాజు షాక్ అవుతాడు. నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు నిజాయితీకి మారుపేరు గాని ధర్మాన్ని నమ్ముకుని ఉన్నాను అని రామరాజు ఎంత చెప్తున్నా సరే ఆ ఎస్ ఐ మాత్రం అస్సలు వినడు. నువ్వేమీ పోటుగాడివి కాదుగా ఏదైనా ఉంటే స్టేషన్ బయట చూసుకోండి ముందు ఖాళీ చేయండి అని వార్నింగ్ ఇస్తాడు.

ధీరజ్ ఇక జైల్లోనే..

రామరాజు లాయర్ ని పిలిపిస్తాడు.. అయితే ఆ లాయర్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్సై కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని అడిగినా కూడా అతను ఇవ్వనని చెప్తాడు. కోర్టులో సబ్మిట్ చేస్తాను అక్కడ మీరు ఏమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోండి అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వేం కంగారు పడకు ధీరజ్ మనం కోర్టులో తేల్చుకుందామని లాయర్ చెప్తాడు. బయటకొచ్చిన లాయర్ ఎవరో ధీరజ్ నీకు కావాలని ఇరికించేలా ప్రయత్నం చేశారు. ఆ ఎస్సై కూడా చెప్పిన మాట వినకుండా ధీరజ్ పై మాత్రమే ఫోకస్ పెట్టాడు అంటే కచ్చితంగా కావాలనే ఎవరో తెలిసిన వాళ్ళు చేశారు అని అనగానే రామరాజు వాళ్ళు షాక్ అయిపోతారు. నీ ప్రేమ మాత్రం కచ్చితంగా తన పుట్టింటి వల్లే చేశారని అనుకుంటుంది.

శ్రీవల్లి పెర్ఫార్మన్స్ అదుర్స్..

శ్రీవల్లి ధీరజ్ అరెస్ట్ అయిన విషయాన్ని భాగ్యంతో చెబుతుంది.. భాగ్యం ఆనందరావు అలాగే సుకన్య ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఉంటారు.. ధీర ఇరుక్కున్నాడు కాబట్టి నీ కడుపు సంగతి బయటపడే అవకాశం లేదు అని అనుకుంటారు.. అంతేకాదు ధీరజ్ అరెస్ట్ అయిన తర్వాత రామరాజు కుటుంబం ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా నటించి చూపిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి ఘోర అవమానం.. అవనికి పల్లవి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×