E-Paper
Advertisement

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి, ఆ పార్టీల నుంచి ఎవరంటే

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి, ఆ పార్టీల నుంచి ఎవరంటే
Advertisement

Amaravati: ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందా? ఖాళీ అయిన నాలుగు సీట్లలో టీడీపీ మూడు, జనసేన ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యాయా? గతంలో బీజేపీకి ఒకటి కేటాయించడంతో ఈసారి నాలుగు సీట్లు టీడీపీ-జనసేన పంచుకోనున్నాయా? ఈ సీట్ల కోసం ఇరు పార్టీల నుంచి అధిక సంఖ్యలో నేతలు పడుతున్నారు.

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి

Advertisement

రాజ్యసభ సీట్ల నామినేషన్లకు గడువు దగ్గరపడుతుండడంతో ఏపీలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు.

నేతలంతా దాదాపు వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. గతంలో బీజేపీకి ఒకటి కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఈసారి సీట్లలో టీడీపీ మూడు, జనసేన ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఈ విషయాన్ని సూచనప్రాయంగా ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Advertisement

జనసేన నుంచి లింగమనేని.. టీడీపీ నుంచి అరడజను మంది రేసులో

2024–29 మధ్య రాజ్యసభ స్థానాల్లో జనసేనకు మూడు ఇచ్చేలా మొదట్లో కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. దాని ప్రకారం జనసేనకు ఈ దఫాలో ఒకటి కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. అప్పటి ఎన్నికల సమయంలో సర్దుబాటుల్లో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్‌సభ స్థానాలను త్యాగం చేసింది.

ఆ క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఈ దఫా ఎన్నికల్లో జనసేనకు ఒకటి దక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సన్నిహితుడైన లింగమనేని రమేష్‌ పేరు బలంగా వినిపిస్తోంది.  తొలుత నాగబాబుకు ఈ సీటు ఇవ్వాలని భావించారు. ఎమ్మెల్సీ సీటు ఆయనకు కేటాయించిన విషయం తెల్సిందే.

ALSO READ: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

టీడీపీ నుంచి స్పీకర్ అయ్యన్న  కొడుకు, మరో సీనియర్ యనమల, మరో నలుగురు రేసులో ఉన్నారు. ఓ పారిశ్రామికవేత్త ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వారిలో పారిశ్రామిక వేత్త రామకృష్ణ, గల్లా జయదేవ్, రెడెప్పగారి శ్రీనివాసరెడ్డి, సానా సతీష్, కంభంపాటి రామ్మోహనరావుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  ఈ సీట్లకు సంబంధించి నేడు లేకుంటే రేపు గానీ ప్రకటన రావచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×