E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి ఘోర అవమానం.. అవనికి పల్లవి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Intinti Ramayanam Today Episode: అవనికి ఘోర అవమానం.. అవనికి పల్లవి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..
Advertisement

Intinti Ramayanam Today Episode june 5th : కమల్ ఆవేశంగా బయటకు వెళుతున్నప్పుడు భరత్ అక్కడికి వస్తాడు. భరత్ ని చూసిన పల్లవి తన గురించి తప్పుగా అనుకోకూడదు అని మరో కొత్త డ్రామాలు మొదలు పెడుతుంది. అవని అక్క వల్లే వాళ్ళ అమ్మని అరెస్ట్ చేశారు అని భరత్ కి లేనిపోనివి చెప్పి ఇంకాస్త రెచ్చగొడుతుంది. నాకు మా అమ్మని దూరం చేసినట్లే నీకు కూడా మీ అమ్మని దూరం చేయాలని అనుకుంటుందేమో అని పల్లవి కావాలని రెచ్చగొట్టడంతో భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భరత్ ని ఎప్పటికైనా నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. మీనాక్షి నీ కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన అవని చక్రధర్ అక్షయ్ లు తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని..

తల్లి జైలుకు వెళ్తుందని అవని కన్నీళ్లు..

పోలీస్ స్టేషన్లో ఉన్న మీనాక్షిని కలవడానికి వెళ్లిన అవని తనని చూసి బాధ పడిపోతుంది. ఎందుకమ్మా నాకోసం నువ్వు ఇలా చేశావు అని అడుగుతుంది. నువ్వు ఇలా చేయడం వల్ల ఇప్పుడు కేసు నీ మీద పడింది నువ్వు ఇలా జైల్లో ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అమ్మ బాధగా ఉంది అని అవని అంటుంది. నేను జీవితంలో అన్ని సంతోషాలని బాధలని చూసాను. నా జీవితం ఇక్కడి వరకే అని అనుకున్నాను కాబట్టి నేను పోలీసులకు లొంగిపోయాను అని మీనాక్షి అంటుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి ఎవరి అప్పుడే ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా బయట పడతావని మీనాక్షి ధైర్యం చెబుతుంది. అక్షయ్ అవని చక్రధర్లు పోలీస్ స్టేషన్ బయటకు వచ్చేస్తారు. తన తల్లికి ఇలా అయింది అని బాధ పడిపోతూ ఉంటుంది అవని. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అమ్మకు ఏదైన అయితే నిన్ను వదలను..

Advertisement

భరత్ పోలీస్ స్టేషన్ కి రావడం చూసి అవన్నీ ఎమోషనల్ అవుతుంది. కానీ భరత్ మాత్రం పల్లవి అవని పై చెప్పిన చాడీలు నిజమే అనుకుని నమ్మి చాలా ఆవేశంగా వస్తాడు. భరత్ అనే అవని ప్రేమగా దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించిన సరే ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ మీనాక్షిని చూసిన భరత్ తల్లిని చూసి ఎమోషనల్ అవుతాడు. నీకు కూతురు మీద ఉన్నంత ప్రేమ కొడుకు మీద లేదా అమ్మ. నా గురించి నువ్వు ఆలోచించకుండా నిందని నీ మీద వేసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చావా అని భరత్ అడుగుతాడు. అవని అక్క ఎలాంటిదో ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వు అలాంటి ఆమె కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చావా అని భరత్ అంటాడు. పల్లవి చెప్పిన చెప్పుడు మాటలు విని నువ్వు పూర్తిగా మారిపోయావు రా అవని అక్క ఎంత మంచిదో నీకు తెలియదా అని మీనాక్షి అంటుంది. నిన్ను కాపాడేది పల్లవి సిస్టర్ మాత్రమే. నిన్ను నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తానమ్మా అని భరత్ వెళ్ళిపోతాడు.. బయట భరత్ తో మాట్లాడడానికి అవని ప్రయత్నిస్తే మా అమ్మకి ఇలా జరగడానికి కారణం నువ్వే.. ఏదైనా జరిగితే నిన్ను వదలను నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు.

కన్నీళ్లు పెట్టుకున్న అవని..

నీ కారణంగానే అమ్మ జైలుకు వెళ్ళింది అని భరత్ అన్న మాటల్ని తలుచుకొని అవని బాధ పడిపోతుంది. ఆటో రాజేశ్వరి పిన్ని చనిపోవడం ఇటు తల్లి అరెస్టు ఇవ్వడం తలుచుకుని అవని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అవని బాధపడడం చూసిన చక్రధర్ అక్షయలు అవని దగ్గరికి వచ్చి.. నువ్వు ఏం బాధపడకు అమ్మ దేవుడున్నాడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని అంటారు. ఈ కేస్ అన్నిటికీ కారణం పల్లవిని నేను పల్లవి దగ్గరికి వెళ్లి కేసును వాపస్ తీసుకోమని చెప్తాను అని అవని అంటుంది. పల్లవి దగ్గరికి వెళ్తే తను ఇంకా బాధ పెట్టేలా మాట్లాడుతుంది అని ఎంత చెప్తున్నా సరే అవని మాత్రం నేను వెళ్లి తీరుతాను అని వెళ్తుంది.

పల్లవి మాటతో అవని షాక్..

Advertisement

ఎందుకు పల్లవి ఇలా చేస్తున్నావు నా మీద ఉన్న కోపంతో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అవని చెప్తుంది. నువ్వు ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్న కూడా నీ తల్లి నీకు దూరమైంది అది నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అంటుంది. మా అమ్మ చనిపోవడానికి కారణమైన నిన్ను నేను అస్సలు వదిలిపెట్టను. ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాను అని పల్లవి అంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు అర్థం కావడం లేదు అని పల్లవి తో ఎంతగా నిజం చెప్పాలని ప్రయత్నించిన సరే తను మాత్రం వినదు.. పల్లవి మాటలు విన్న అవని షాక్ అవుతుంది.

కుటుంబం రెండు ముక్కలు అవుతుంది..

ఎందుకు నువ్వు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు. అసలు మీ అమ్మ చనిపోవడానికి నేను కానీ మా అమ్మ కానీ ఎటువంటి కారణం కాదు అని ఎంత చెప్పినా సరే.. పల్లవి మాత్రం నాకల్లారా నేను చూశాను అని అంటుంది. మీ నాన్నకి మీ అమ్మని దగ్గర చేశావు మా అమ్మ వాళ్ళ ఎక్కడ దూరమవుతాడు అని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశావు అని పల్లవి అపార్థం చేసుకుంటుంది. తల్లి లాంటి పిన్ని నేనెందుకు చంపుతానని అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అస్సలు వినదు. నువ్వేం చెప్పినా నేను వినను నీ అంత చూసి అంతవరకు నేను వదిలిపెట్టను అని పల్లవి అవనికి వార్నింగ్ ఇస్తుంది. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూసి పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవని నీ యెంతగా ఓదార్చడానికి ప్రయత్నించిన సరే తాను మాత్రం తన తల్లి దూరమైంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రియాంక స్టోరీ.. నమ్మి మోసపోయాను..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×