BigTV English

Illu Illalu Pillalu Today Episode: వెయిటర్ గా కూతుర్ని చూసి షాకైన సేన.. కోడలి కోసం బుజ్జమ్మ షాకింగ్ నిర్ణయం..?

Illu Illalu Pillalu Today Episode: వెయిటర్ గా కూతుర్ని చూసి షాకైన సేన.. కోడలి కోసం బుజ్జమ్మ షాకింగ్ నిర్ణయం..?

Illu Illalu Pillalu Today Episode March 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. బుజ్జమ్మ తన చిన్న కొడుకు తినలేదని బాధపడుతూ ఉంటుంది. కనీసం వీళ్ళకి పాలైన ఇవ్వాలని అనుకుంటుంది. బుజ్జమ్మ పాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలు తాగడానికి  ఇష్టపడరు. మీరు తినలేదని నేను కూడా తినలేదు అది మీకు ఇష్టమా మీరు తినకుండా ఈ అమ్మాయి ఎలా తింటుందని అంటూ బాధపడతారు. బుజ్జమ్మ ఎంత చెప్పినా నాకు ఈ పాలు వద్దు ఏమీ వద్దు అమ్మ నేను సంపాదించిన రోజే నేను ఇంట్లో తింటాను అనేసి ధీరజ్ అంటాడు.. బుజ్జమ్మ ఒకవైపు తన కొడుకుని ఎంతగా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పడు కనీసం పాలైన కాకపోతే ఈ తల్లి మనసు తల్లిడిల్లి పోతుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కానీ ధీరజ్ ప్రేమ మాత్రం ఇద్దరూ బుజ్జమ్మతో మాట్లాడటానికి ఇష్టపడరు మౌనంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక రెండో కోడలు నర్మదా గురించి నిజం తెలుసుకొని సంతోష పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బుజ్జమ్మ సాగర్ ని పిలిచి మిద్దరేమైనా గొడవ పడుతున్నారా? మీరిద్దరూ ఎందుకు దూరంగా పడుకోవాల్సి వచ్చింది? ఒకే గదిలో ఉంటూ కూడా మీరిద్దరూ దూరంగా ఎందుకు పడుకున్నారు అని బుజ్జమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దానికి సాగర్ మా ఇద్దరి మధ్య దూరం ఏం లేదమ్మా మేము బాగానే ఉన్నామే అని అంటాడు. కానీ ఒట్టు వేయించుకొని సాగర్ తో నిజం చెప్పింస్తుంది. పెద్దోడికి ఇంకా పెళ్లి కాలేదని నాన్న ఫీల్ అవుతున్నారు కదా అందుకే వాడికి పెళ్లయిన తర్వాత మనము పిల్లలకంటే బాగుంటుందని నర్మద నిర్ణయం తీసుకునింది ఆ విషయాన్ని నాకు చెప్పింది అది నాకు మంచిదే అనిపించి ఇద్దరం ఒప్పుకున్నాము అందుకే దూరంగా ఉన్నామని సాగర్ అంటాడు. ఆ మాటలకు బుజ్జమ్మ సంతోషపడుతుంది చిన్నదైనా సరే ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది రా అని సాగర్ తో అంటుంది.

సాగర్ తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న రామరాజు సంతోష్ పడతారు కోడలు తీసుకున్న నిర్ణయంపై గౌరవంగా ఉందని మనసులో ఆనంద పడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని బుజ్జమ్మ బయటపెట్టాలని అనుకుంటుంది. తన కోడలు ఎంత మంచిదో చెప్పాలని రామరాజు దగ్గరికి వెళ్లి చెప్తుంది. నిర్ణయానికి నేను చాలా సంతోషపడుతున్నానండి. ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది పెద్దవాడికి పెళ్లయ్యేంతవరకు వాళ్ళిద్దరు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం చాలా మంచి విషయం అండి మొన్నటి వరకు నేను నా కోడల్ని చూడాలన్నా కూడా ఇష్టపడేదాన్ని కాదు కానీ ఇప్పుడు నా కోడలు మీద గౌరవం పెరిగింది ఇష్టం కూడా పెరిగింది అనేసి బుజ్జమ్మంటుంది.


పెద్దోడు నడిపేడు మంచోడే కానీ నీ చిన్న కొడుకు మాత్రం వాళ్ళిద్దరిని చెడగొట్టేలా ఇంటి పరువుని తీసేలా చేస్తున్నాడని రామరాజు అంటాడు. వాడు ఏం చేసాడంటే వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళని పెళ్లి చేసుకునేలా చేశాడు వీళ్ళ పెళ్లికి పెద్దగా మారాడు ఇప్పుడేమో వాడు గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారు అనేసి రామ రాజుని తిడతాడు. బుజ్జమ్మ ప్రతి విషయాన్ని వాడితో ముడి పెట్టకండి అని అంటుంది. ఇక నర్మదా ఆఫీస్ నుంచి వస్తుంటే బుజ్జమ్మ స్కూటీ తీసుకుని వెళ్లి ఎదురుగా నిలిచి ఉంటుంది.

బుజ్జమ్మని చూసి నర్మదా షాక్ అవుతుంది. మీరేంటి అత్తయ్య నాకోసం ఇలా బైక్ వేసుకుని వచ్చారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను అంటే అవును నేను కాదు ఇది నా ఆత్మ నేనే నీ ముందర గూర్చి కూర్చున్నాను నీకు హాయ్ అని చెప్పాను అయినా కూడా నీకు నమ్మకం కలగడం లేదా అనేసి బుజ్జమ్మ అంటుంది. అది కాదు మీకు స్కూటీ కూడా నడపడం వచ్చా అని నర్మదా షాక్ అవుతుంది. స్కూటీ ఏంటి కారు ట్రాక్టర్ ప్రతి ఒక్క బండిని మా నాన్నగారు చిన్నప్పటి నుంచే నాకు నేర్పించారు నీకు ఇంకొక విషయం చెప్పనా మన ఇంట్లో ఉన్న ట్రాక్టర్ ని తోలడం కూడా నాకు వచ్చు ఈసారి నేను తీసుకెళ్లడానికి ఆ ట్రాక్టర్ వేసుకొని వస్తా అప్పుడు నువ్వు నమ్ముతావేమో అని బుజ్జమ్మ అంటుంది..

అత్త కోడలు ఇద్దరు కలిసి బండిమీద అలా వెళ్తూ మధ్యలో ఉన్న వాళ్ళని పలకరిస్తారు. నర్మదని ఎప్పుడు బుజ్జమ్మతో చూడని వాళ్ళందరూ ఈ అమ్మాయి ఎవరు అక్క అని అడుగుతారు. నా రెండో కోడలు నర్మద గవర్నమెంట్ జాబ్ చేస్తుంది తెలుసా అని అంటుంది. ఇంత పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఇంతకూడా గర్వం లేదు చాలా మంచి అమ్మాయి అనేసి బుజ్జమ్మ తన కోడలు గురించి గొప్పగా చెప్పుకుంటుంది. ఇక ప్రేమ వల్ల అమ్మ నాన్న అత్త కాఫీ షాప్ కి వెళ్తారు. అక్కడ ప్రేమను వెయిటర్ గా చూసి షాక్ అవుతారు..

వాళ్ళ అమ్మ నువ్వు ఇలాంటి పనిచేయడం ఏంటి నిన్ను ఎలా పెంచుకున్నాం కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రేమ ఇలాంటి పనులు చేయడానికి కారణం అంటుంది. రాత్రి అయిన తర్వాత భద్రాసేన ఇద్దరు ఇంటి బయట ఉంటారు ప్రేమ రాగని రామరాజు కుటుంబాన్ని గట్టిగా అరిచి పిలుస్తారు. నా మేనకోడలు ఎక్కడి నుంచి వస్తుందో అడిగి తెలుసుకోగానే బుజ్జమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావ్ అమ్మ అంటే కాఫీ షాప్ లో వెయిటర్ గా పని చేస్తున్నాను అత్తయ్య అంటుంది. అపురూపంగా పెంచుకున్న నా కోడల్ని మీరు ఇలా ఎంగిలికప్పులెత్తించేలా చేశారు ఇదంతా నువ్వు చేసింది రాంరాజు అని భద్ర సీరియస్ అవుతుంది.

నిన్ను అమెరికాలో ఉంటున్న వాళ్లకి ఇచ్చి ఎంతో గొప్పగా చూసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు ఇలా ఎంగిలికప్పులెత్తేలాగా పనిచేస్తావని అస్సలు అనుకోలేదని ప్రేమ వాళ్ళ నాన్న బాధపడతాడు. ఇంత బతుకు బతికి ఈ చేతకాని వాడిని పెళ్లి చేసుకొని నువ్విలా బతకడం మాకు అస్సలు ఇష్టం లేదు అని భద్ర అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో రామ రాజు మాటలకు ప్రేమ ఎదురు చెబుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×