BigTV English

HMDA: మహానగరం హైదరాబాద్ పరిధి పెంపు.. పేరు మారుస్తున్నారా? ధరల మాటేంటి?

HMDA: మహానగరం హైదరాబాద్ పరిధి పెంపు.. పేరు మారుస్తున్నారా? ధరల మాటేంటి?

HMDA:  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ- HMDA పరిధిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్‌ఎండీఏ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పరిధిలోకి 4 జిల్లాల్లోని 16 మండలాలు చేరాయి. వాటిలో మహబూబ్‌నగర్‌, వికారాబాద్, నాగర్ ‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లో 16 మండలాలను తీసుకొచ్చింది.


హెచ్ఎండీఏ పరిధి పెరిగింది

కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి హెచ్‌ఎండీఏ పరిధి మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో కొత్తగా 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చేసింది. ఈ మేరకు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తామని ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 జిల్లాల వరకు ఉన్న ఈ పరిధిలోకి తాజాగా 4 జిల్లాలు చేరాయి. ఇప్పుడు ఆ సంఖ్య 11 జిల్లాలకు చేరుకుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏను విస్తరించారు.

హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు అమల్లో ఉంది. దీనిని మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో మిగతా ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ అభివృద్ధి ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనుంది.

ALSO READ: చూస్తూ కూర్చుంటారా? ఎమ్మల్యేలకు సీఎం వార్నింగ్

పేరు మార్చే అవకాశం

ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ స్థానంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌-HMR పేరును తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం. భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

భూముల ధరలు అమాంతంగా

హెచ్‌ఎండీఏ పరిధిలో రంగారెడ్డి జిల్లా అంతా ఉంది. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా 36 రెవెన్యూ గ్రామాలను హెచ్‌ఎంఆర్‌ నుంచి అధికారులు మినహాయించారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అతి తక్కువగా నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి కేవలం మూడు మాత్రమే ఉన్నాయి.

ప్రభుత్వ నిర్ణయంతో నగర శివారుల్లోని భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో చేరిన 16 మండలాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు మళ్లీ పుంజుకోనుంది.

ఇకపై రెండు కార్పొరేషన్లు ?

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహా నగర కార్పొరేషన్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకే కార్పొరేషన్‌ ఉంటే సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రెండు కార్పొరేషన్ల ఏర్పాటు వైపు మొగ్గు చూపినట్టు ప్రభుత్వ వర్గాల మాట. దీంతో హైదరాబాద్ రెండుగా చీలనుంది.

ముంబై సిటీ రెండు కార్పొరేషన్లుగా ఉండటం వల్లే అభివృద్ధి సాధ్యమైందని భావిస్తోంది. హైదరాబాద్‌ ఆ స్థాయి అభివృద్ధి జరగాలంటే రెండు కార్పొరేషన్లు ఉండాలన్నది ఆలోచన. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్-GHMC, గ్రేటర్‌ సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-GSMCగా విభజించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×