BigTV English

Amaravathi: అమరావతికి రూ.64,721 కోట్లు.. మోదీతో రీలాంఛ్

Amaravathi: అమరావతికి రూ.64,721 కోట్లు.. మోదీతో రీలాంఛ్

ఆటంకాలు దాటుకుని..
అవకాశాలు సృష్టించుకుని..
కాల పరీక్షను తట్టుకుని..
కలల్ని నిజం చేసేలా..
చరిత్ర సృష్టించేలా..
సరికొత్తగా వస్తోంది అమరావతి..

ప్రధాని చేతుల మీదుగా రీలాంఛ్ కు రెడీ అవుతోంది. అవును ఆంధ్రుల కలల రాజధానికి కొత్త రెక్కలు వచ్చేశాయ్. ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవ్. అడ్డంకులు అసలే లేవు. గ్రహణాలన్నీ వీడిపోయాయ్. రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉంది. టార్గెట్ కనిపిస్తూనే ఉంది. అందాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి. చేయాల్సిన పనులు ఖరారయ్యాయ్. కలల్ని సాకారం చేస్తూ అద్భుతమైన, అందమైన రాజధాని అమరావతి సాక్షాత్కారం చేసుకునేందుకు రీస్టార్ట్ అవుతోంది.


రాజధాని ఒక భావోద్వేగం, అంతకు మించి సెంటిమెంట్

రాజధాని అన్నది ఎవరికైనా ఒక సెంటిమెంట్. ఒక భావోద్వేగం. అంతకు మించి అస్తిత్వానికి ప్రతీక. అలాంటిది ఏపీ దగ్గర పదేళ్లు గడిచినా రాజధాని అంటూ ఏదీ లేకపోవడం పెద్ద లోటు. దీన్ని 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం కొంత వరకు ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య జగన్ హయాంలో పూర్తిగా ఆగిపోయింది. ఆర్థిక భారమంటూ చెప్పడం, మూడు రాజధానులంటూ మాట్లాడడంతో అమరావతి పనులు పూర్తిగా అటకెక్కాయి. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రిపీట్ కాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఈసారి కేంద్రం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతుండడంతో నిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తున్నాయ్. పనుల విషయంలో టెండర్లు కూడా ఖరారవుతున్నాయి.

అమరావతికి అన్నీ మంచి శకునాలే

అమరావతికి ఇప్పుడు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. 2028 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అన్ని పనులను మరికొద్ది రోజుల్లోనే ఒకేసారి మొదలు పెట్టి రాజధాని నిర్మాణ పనుల్ని రీలాంఛ్ చేయబోతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనుల్ని అట్టహాసంగా మొదలు పెట్టబోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రుల ఆశల్ని సజీవంగా ఉంచుతూ సరికొత్త రాజధానిని ఆవిష్కరించేందుకు పెద్ద ముందడుగు పడబోతోంది. ఇక ఒక్కసారి పని మొదలైందంటే ఆగేదే లేదు. ఎక్కడా తగ్గేదే లేదు. 2028 దాకా నాన్ స్టాప్, అన్ స్టాపబుల్ అంతే.

అమరావతి పేరుకు ఓ బ్రాండ్, స్టామినా

నిజానికి అమరావతి కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది. గతంలో చేపట్టిన నిర్మాణాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయని టెక్నికల్ కమిటీలు తేల్చాయి. అందుకే వాటి పనుల్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుంది. అటు చంద్రబాబు సర్కార్ కూడా ఈసారి గట్టి సంకల్పమే తీసుకుంది. అటు చూస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పూర్తిగా ఉండడంతో కచ్చితంగా రాజధానిని నిర్మించి నిలబెట్టి జనం ముందు ఉంచేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అమరావతి అంటే తిరుగులేనిది. ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. స్టామినా ఉంది. అంతకు మించి హిస్టరీ ఉంది. ఎవరు వచ్చినా.. ఇంకెవరు పాలించినా.. రాజధానిగా అమరావతి చెరిగిపోని ముద్ర వేయబోతోంది. చరిత్ర సృష్టించబోతోంది. ఎన్ని కాలాలైనా సగర్వంగా చెప్పుకునేలా ఉండబోతోంది.

58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు

రాజధాని ఈ ప్రాంతంలోనే ఏర్పాటవుతుందని చెప్పడమే తరువాయి. 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగం వృధాగా పోలేదు. వారి పోరాటాలు వృధా అవలేదు. రాజధాని నిర్మాణం కోసం 64 వేల కోట్లు అవసరమవుతున్నాయ్. ఈ నిధులతో ఒక అడగు ముందుకు పడితే మిగితా పనులన్నీ వెంట వెంటనే జరగడం ఖాయమే. ఇది సస్టైనబుల్ ప్రాజెక్ట్. రాజధాని అన్నది అవకాశాలను సృష్టిస్తుంది. ఉపాధిని పెంచుతుంది. సౌకర్యాలు తీసుకొస్తుంది. సంపదను సృష్టిస్తుంది. అంటే పెట్టిన ఖర్చు తీరడమే కాదు.. అంతకు మించి ఎవరూ ఊహించని ప్రయోజనాలను రాజధాని అందించబోతోంది.

అసలు వచ్చే నిధుల లెక్క ఏంటి?

ఏపీ అడగడమే తరువాయి.. కేంద్రం అన్నీ సమకూరుస్తోంది. మధ్యలో ఉండి రుణాలు ఇప్పిస్తోంది. రాజధాని కోసం చేసే అప్పుల్ని FRBM నుంచి తప్పిస్తోంది. రుణాలు వస్తున్నాయ్.. టెండర్లు ఖరారవుతున్నాయ్. అటు అమరావతి స్పెషాలిటీస్, అభివృద్ధి, క్యాపిటల్ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లనూ నియమిస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ లో ఆమోద ముద్ర పడడం, పనులు మొదలవడమే తరువాయి. అసలు వచ్చే నిధుల లెక్క ఏంటి? ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది?

నెక్ట్స్ జెనరేషన్ క్యాపిటల్ సిటీ అమరావతి

పీపుల్స్ క్యాపిటల్ అని రాజధాని అమరావతికి క్యాప్షన్ ఇచ్చారు. అంటే అందరినీ అక్కున చేర్చుకునేలా ఉపాధి అవకాశాలు పెంచేలా, ప్రపంచ‌ంలోనే టాప్-5 నగరాల్లో ఒకటిగా ఉండేలా డిజైన్‌ చేశారు. మోస్ట్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో పాటు మెరుగైన మౌలిక వసతులు రాబోతున్నాయి. నెక్ట్ జెనరేషన్ క్యాపిటల్ సిటీ ఎలా ఉంటుందో అమరావతి పూర్తయ్యాక చూస్తే తెలుస్తుంది. నిజానికి రాజధాని నిర్మాణం ఎవరికీ రాని, చాలా అరుదైన అవకాశం. దీన్ని సీఎం చంద్రబాబు సంపూర్ణంగా పూర్తి చేసేలా బాధ్యత భుజానికెత్తుకున్నారు. కలల రాజధానిని సాకారం చేసి చూపిస్తామన్నారు.

రూ. 40వేలకోట్ల నిర్మాణ పనులకు అనుమతి

అమరావతిలో 40 వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన CRDA సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తికాగానే రాజధానిలో పనులు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. 73 పనులకు సీఆర్‌డీఏ నుంచి అనుమతి వచ్చింది. 63 పనులకు టెండర్లు పూర్తి చేశారు. వాటి విలువ 39,678 కోట్లుగా ఉంది. అమరావతిలో గ‌వ‌ర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భ‌వ‌న నిర్మాణాలు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసం మొత్తంగా 64 వేల 721 కోట్లు అవసరం కానున్నాయి. వివిధ రకాల ఆదాయ మార్గాల ద్వారా అమరావతి పనులు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసి పెట్టుకుంది.

వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు రూ.13,400 కోట్ల రుణం

అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు క‌లిపి 13 వేల 400 కోట్ల రూపాయల రుణం ఇస్తుండగా, KFW బ్యాంక్ 5 వేల కోట్ల రూపాయల రుణం ఇస్తోంది. అటు హ‌డ్కో 11 వేల కోట్లు అప్పుగా ఇవ్వబోతోంది. అయితే ఈ అప్పులను frbm పరిధిలోకి తీసుకురాబోమని కేంద్రం తాజాగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.

ప్రత్యేక గ్రాంట్ కింద కేంద్రం రూ.1500 కోట్లు

అటు 1,500 కోట్లను ప్రత్యేక సాయంగా.. గ్రాంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు కౌంటర్‌ పార్ట్‌ ఫండింగ్ సమకూర్చాలని కేంద్రం డిసైడ్ అయింది. ఇవి కాకుండా మార్ట్ గేజ్‌, లీజుల ద్వారా వివిధ సంస్థల నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించనుంది ఏపీ. రెండేళ్లలో మెయిన్‌ రోడ్లు, మూడేళ్లలో ఇంటర్నల్ రోడ్లు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. అసెంబ్లీ, హైకోర్టు మూడేళ్లలో పూర్తి చేయబోతున్నారు. స‌గానికి పైగా నిర్మాణం జ‌రిగిన అధికారుల భ‌వ‌నాలు ఏడాదిన్నర‌లో పూర్తిచేయనున్నారు.

2014-19లో 131 సంస్థలకు 1,277 ఎకరాలు

2014-19లో 131 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థలకు 1,277 ఎకరాలు ఇచ్చారు. అయితే గత ఐదేళ్లు రాజధాని నిర్మాణం జరగకపోవడంతో ఆ సంస్థల్లో కొన్ని వెనక్కు వెళ్లాయి. భవనాలు నిర్మించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపలేకపోయాయి. ఇందులో ఆర్బీఐ, బిట్స్ పిలానీ సహా కీలక సంస్థలెన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కదలిక వస్తోంది. తాజాగా 31 సంస్థలకు 629 ఎకరాలు భూమి ఇచ్చారు. గత ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌లో 50 వేల మందికి ఒక సెంటు భూమి అమరావతిలో ఇచ్చింది. అయితే వారికి వేరేచోట భూమి కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం అంటోంది.

ఏప్రిల్ నుంచి అమరావతిలో 20 వేల మందికి పని

కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లో సమస్యలు పరిష్కరించి టెండర్లు ఆహ్వానించిన పరిస్థితి ఉంది. దీన్ని ప్రయారిటీగా తీసుకోవడంతోనే ఇదంతా జరుగుతోంది. ఈనెల 17న జరిగే కేబినెట్‌లో వీటన్నింటికీ ఆమోదం పొంది వెంటనే పనులు ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్‌ నెల నుంచి అమరావతి అభివృద్ధి పనుల్లో 20 వేల మంది పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం, ఐకానిక్‌ బిడ్జ్‌ సహా ఇంకెన్నో రాబోతున్నాయి. ఈ పనులన్నిటికీ ప్రధాని మోడీ రీలాంఛ్ చేయడం ద్వారా నాన్ స్టాప్ గా జరగబోతున్నాయి. అటు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగిస్తారు.

అమరావతి పూర్తయితే పెరగనున్న భూముల వాల్యూ

అంతే కాదు.. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇక్కడి భూముల వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. అప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూములకూ విలువ భారీగా పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరాలు పెరుగుతాయి. లాండ్ అవసరం ఉంటుంది. వాటికి భూముల్ని విక్రయించడం ద్వారా ఆదాయన్ని పెంచుకోవడం, లోటు పూడ్చుకోవడం, రుణాల తిరిగి చెల్లింపు చేయడం ఇవన్నీ సాధ్యం చేసుకునేలా ప్రభుత్వం పకడ్బందీ ఆలోచనతో ఉంది. సో ప్లాన్ రెడీగా ఉంది. నిధులు రెడీ అవుతున్నాయి. అమరావతి 2.0 సాకారమవడమే మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అంటోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×