E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: మరో అమ్మాయితో విశ్వక్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. అమూల్య సీక్రెట్ బయటపడుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: మరో అమ్మాయితో విశ్వక్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. అమూల్య సీక్రెట్ బయటపడుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ఆనందరావు రైస్ మిల్ కి వెళ్లడానికి అని రెడీ అయ్యి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రావడం చూసిన ఆ ఏజెంట్ ఎలాగైనా సరే వీళ్ళని గుర్తుపట్టేశాను డబ్బులు రాబట్టాలి ఉద్యోగం ఇవ్వాలి అని అనుకుంటాడు.. మిమ్మల్ని గుర్తుపట్టేసాను మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అతను భాగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏంటి వీడు.. మనం ఏ గెటప్ లో ఉన్న గుర్తుపట్టేస్తున్నాడు అని ఆనందరావు కంగారు పడిపోతూ ఉంటాడు.

వీరి నుంచి ఎలా అయినా సరే మనం బయటపడాలి అని భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి హోలీరంగుల్లో కలిసిపోతారు. ఇక ఏజెంట్ వీళ్లిద్దరు మళ్ళీ తప్పించుకున్నారు ఈసారి ఎలాగైనా సరే పట్టుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. హోలీ ఆడుతున్న వాళ్లలో విశ్వం ఒక అమ్మాయితో కనిపించడంతో షాక్ అయిపోతారు భాగ్యం ఆనందరావు.. ప్రకృతి వైపరీత్యం అంటే ఇదేనేమో ఏంటి వైపరీత్యము అనుకుంటూ ఉంటారు.. శ్రీవల్లి అక్కడ అందరూ వీళ్ళని చూసి ఏమైందని కనుక్కోవాలి అయితే అమూల్య తాళి మెడలో వేసుకోవడం వెనకాల ఎవరున్నారని సంగతి ఇవాల్టితో బయట పడిపోతుంది అని అనుకుంటుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. ప్రేమ పుట్టిన రోజు కావడంతో రేవతి తన కూతుర్ని తలుచుకొని బాధ పడిపోతూ ఉంటుంది.. పుట్టినరోజు నాడు కూడా నా కూతురికి పిరికిడు అన్నం తినిపించలేకపోతున్నాను అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అమూల్య ఎంతగా ఓదారుస్తున్నా సరే నా కూతురికి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. భద్రావతి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది కానీ రేవతి మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అయితే అమూల్య ప్రేమ వదిన పుట్టినరోజు కదా పెద్దమ్మ అందుకని బాధ పడిపోతుంది అని జరిగిన విషయాన్ని చెప్తుంది. వాడి ప్లేస్ లో నేనున్నా కూడా అదే చేస్తాను అని అంటుంది భద్ర. నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని భద్ర రేవతిని అడుగుతుంది. ఇవాళ మీ మేనకోడలు పుట్టినరోజు అని మీరు మర్చిపోయారేమో కన్నతల్లిగా నాకు గుర్తుంది అని రేవతి బాధపడిపోతుంది.

నా మేనకోడలు పుట్టినరోజుని నేనెలా మర్చిపోతాను కానీ నువ్వైనా.. పెంచింది నేనే కదా.. నేను మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు అని భద్ర అంటుంది.. మీ గొడవల వల్ల నా కూతురుతో కూడా నేను ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నాను. నా కూతుర్ని చూడాలనిపిస్తుంది నా చేత్తో నాలుగు ముద్దలు తినిపించాలని అనిపిస్తుంది. మీకు చెప్పిన నా బాధ మాత్రం అర్థం కాదు అని రేవతి భద్రత అంటుంది. మాకు మాత్రం మా మేనకోడల్ని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోవాలని ఉండదా.. ఏమా ఇంకొన్ని రోజుల్లోనే శాశ్వతంగా ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు నువ్వు చాలా సంతోషంగా నీ కూతురికి గోరుముద్దలు తినిపించుకొని భద్ర అంటుంది..

Advertisement

శ్రీవల్లి మాత్రం అటు ఇటు తిరుగుతూ ఈ గొడవ ఎప్పుడు జరుగుతుందని గోతి కాడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది… ధీరజ్ ప్రేమ విశ్వం ని పట్టుకొని తీసుకొని రావడం చూసినా శ్రీవల్లి ఇవాళ పెద్ద గొడవ జరిగేలా ఉంది. కచ్చితంగా మనం దీన్ని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంది.. శ్రీవల్లి వెంటనే మాయ గారు అత్తయ్య గారు అంటూ కేకలు పెడుతూ అందరిని బయటకు పిలుస్తుంది. ఏమైంది ఏమైందమ్మా ఎందుకలా అరుస్తున్నావు అని అందరూ అడుగుతారు. నోటితో నేను ఎలా చెప్పగలను మీరే ఒకసారి అలా వచ్చి చూడండి అని అంటారు. వెంటనే వచ్చిన వాళ్ళందరూ కూడా బయట ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు.

Also Read :జబర్దస్త్ రహస్యాలను బయయపెట్టిన అప్పారావు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

విశ్వాన్ని ధీరజ్ లాక్కొని వచ్చి వాళ్ళ ఇంటిదగ్గర పడేస్తాడు. ఏమైంది ఏం జరిగింది? ఎందుకు మా వాడిని తీసుకొని వస్తున్నావు అని భద్ర సేన ఇద్దరు అడుగుతారు. ఇక తర్వాత ఏమైందిరా వచ్చిన తర్వాత కూడా అడిగితే.. వీడు అమూల్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ బయట మరో అమ్మాయితో కనిపించాడు అని అనగానే అందరూ షాక్ అవుతారు. మావాడు అంత అంత చీప్ గా బిహేవ్ చేయడం ఏం మాట్లాడుతున్నావ్ అని సేన అడుగుతాడు. నేను చెప్పడం కాదు ఒకసారి వాడిని వాడి నోట వెంటనే నిజం చెప్పేస్తాను అని అంటాడు. అవునురా ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఏంటి నీకు అని విశ్వ అంటాడు. చూస్తుంటే వీళ్ళిద్దరి గొడవ పెద్ద రచ్చ జరిగేలా ఉంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి అమూల్య తన మెడలో తాళి వేసుకున్న నిజాన్ని బయట పెడుతుందా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×