E-Paper
Advertisement

Mystery Temple: రాత్రిపూట ఆ గుడికి వెళ్తే రాళ్లుగా మారిపోతారట – ఒళ్ళు గగ్గురుపొడిచే నిజాలు

Mystery Temple: రాత్రిపూట ఆ గుడికి వెళ్తే రాళ్లుగా మారిపోతారట – ఒళ్ళు గగ్గురుపొడిచే నిజాలు
Advertisement

Mystery Temple: రాత్రి పూట ఆ గుడికి వెళితే రాళ్లుగా మారిపోతారట. అవును మీరు చదువుతున్నది నిజమే గుడికి వెళ్లితే రాళ్లుగా మారిపోవడం ఏంటని మీకు డౌటనుమానం రావొచ్చు కానీ ఆ గుడికి చీకటి పడ్డాక వెళ్లిన వాళ్లు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు తిరిగి వచ్చిన దాఖలాలు లేవట. మనుషులను మింగేస్తున్న ఆ గుడి ఎక్కడుంది. ఆ గుడిలో ఉండే దేవుడు ఎవరు…? చీకట్లో గుడిలోకి వెళ్లిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు  అసలు ఆ గుడి కథాకమామీషు ఏంటి…? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా గుడికి వెళ్లితే పుణ్యం మూట కట్టుకుని వస్తారంటారు. వెళ్లే వాళ్లంతా భావిస్తుంది కూడా అదే.. కానీ ఆ గుడికి వెళితే మాత్రం వెళ్లిన వాళ్లు వెళ్లినట్టే మాయం అయిపోతున్నారట. అది కూడా చీకటి పడ్డాక వెళ్లిన వాళ్లే అలా అవుతున్నారట. అసలు వెళ్లిన వాళ్లు ఎక్కడికి మాయం అవుతున్నారని ఆరా తీస్తే అందరూ రాళ్లుగా మారిపోయినట్టు ఆనవాళ్లు కనిపించాట. దీంతో ఇదెక్కడి గుడిరా నాయనా అనుకుంటూ ఆ ఊరి ప్రజలు తలలు పట్టుకున్నారట. గుడి మిస్టరీని ఇప్పటికీ చేధించలేక సైంటిస్టులు తలలు బాదుకుంటున్నారట. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది. అక్కడ చీకటి పడ్డాక జరుగుతున్న తతంగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మర్‌ జిల్లాలోని కిరాడు ఆలయం శిథిలావస్థకు చేరిందట. దాదాపు 9 వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోకే సాయంత్రం తర్వాత అంటే చీకటి పడ్డాక వెళ్లిన మనుషులు ఎవ్వరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదట. వెళ్లిన వారంతా ఏమైపోతున్నారోనని గ్రామస్తులు ఆరా తీయగా వాళ్లంగా రాళ్లుగా మారిపోయినట్టు కనిపెట్టారట. దీంతో సాయంత్రం అయిందంటే చాలు ఆ గుడి ప్రాంగణంలోకి ఎవరైనా వెళ్లాలంటే జడుసుకుంటున్నారట. అయితే ఈ గుడిని మాత్రం రాజస్థాన్‌ ఖజురహో అని పిలుస్తారట. ఈ ఆలయ నిర్మాణ శైలి మొత్తం ఖజురహోను పోలి ఉంటుందట.

స్థల పురాణం:

ఉదయం నుంచి సాయంత్రం వరుక ఈ గుడిలో జరిగే పూజలకు ప్రజలు హాజరవుతారట. కానీ సాయంత్రం అవుతుందంటే చాలు గుడిలో పూజలు చేసే పూజరులతో సహా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారట. సాయంత్రం అయిందంటే చాలు ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దం రాజ్యమేలుతుందట. తెలియక ఎవరైనా అటువైపు వెళ్లే ఇక అంతే వాళ్లకు యూటర్న్‌ అనేది ఉండదట. అయితే స్థల పురాణం ప్రకారం ఇక్కడ బంగార్ లాంటి శక్తులు ఉన్నాయట. ఆ శక్తులే చీకటి పడ్డాక విజృంభించి గుడిలోకి వచ్చిన మనుషులను రాళ్లుగా మారుస్తున్నాయని స్థానికులు చెప్తుంటారట. మరో కథనం ప్రకారం కృష్ణుడి శాపం అనుభవిస్తున్న అశ్వథామ  ఈ గుడిలో ఉంటారని అక్కడి దేవుడిని పూజిస్తుంటారని.. చీకటి పడితే ఎవరైనా అటుగా వెళితే ఆయనే వాళ్లను రాళ్లుగా మారుస్తున్నాడని చెప్తుంటారు.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సైన్స్ నే అబ్బురపరిచే స్త్రీల ఆభరణాలు – అసలు నిజం ఏంటో తెలుసా

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×