E-Paper
Advertisement

Instagram No Privacy: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై నో ప్రైవెసీ? మీ చాట్స్‌ను చదువుతున్న మెటా.. కొత్త రూల్స్ ఇవే

Instagram No Privacy: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై నో ప్రైవెసీ? మీ చాట్స్‌ను చదువుతున్న మెటా.. కొత్త రూల్స్ ఇవే
Advertisement

Instagram No Privacy| సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌ చాలా పాపులర్. రోజూ కోట్లాది మంది ఇందులో వీడియో రీల్స్ చూడడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మెసేజ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అందుకే చాలా మంది ప్రైవేట్ చాట్‌లను ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మాత‌ృక కంపెనీ మెటా ఈ ప్లాట్‌ఫామ్ నుంచి ఒక ముఖ్యమైన ప్రైవసీ ఫీచర్ తొలగించనుంది. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇకపై ఉండదు. ఈ మార్పు 2026 మే 8 నుంచి అమలవుతుంది. ఆ తర్వాత ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లు అందుబాటులో ఉండవు.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి?

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే రెండు వ్యక్తుల మధ్య మెసేజ్‌లు పూర్తిగా రహస్యంగా ఉంటాయి. పంపినవారు, స్వీకరించినవారు మాత్రమే ఆ మెసేజ్‌లను చదవగలరు. ఇన్‌స్టాగ్రామ్ యజమాన్యం లేదా ఇతరులు ఎవరూ ఆ మెసేజ్‌లను చూడలేరు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ 2023 డిసెంబర్‌లో పరిచయం చేసింది. ప్రైవసీ మెరుగుపరచడమే ఈ ఫీచర్ లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ ఫీచర్‌ని కంపెనీ తొలగిస్తోంది. దీంతో మెసేజ్‌లు ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ల ద్వారా ఎన్‌క్రిప్షన్ లేకుండా పంపబడతాయి. అవసరమైతే మెసేజ్‌లను కంపెనీ చూడవచ్చు లేదా స్కాన్ చేయవచ్చు.

పాత చాట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Advertisement

అందుకే యూజర్లకు మెటా (ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ) ఒక సలహా ఇచ్చింది. ఎన్‌క్రిప్టెడ్ చాట్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పింది. మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోనే ఈ ఆప్షన్ ఇస్తారు. అయితే కొందరు యూజర్లు యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అప్‌డేట్ చేయకపోతే డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపించకపోవచ్చు.

మెటా ఎందుకు ఎన్‌క్రిప్షన్ తొలగిస్తోంది?

ఈ కీలక నిర్ణయం తీసుకునేందుకు మెటా పూర్తి కారణాలు చెప్పలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటరీ ఒత్తిడి ఉందని తెలుస్తోంది. చాలా దేశాల ప్రభుత్వాలు ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌క్రిప్షన్ వల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వాదిస్తున్నాయి. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మెసేజ్‌లను స్కాన్ చేయాలని, నేరాలను అరికట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్‌క్రిప్షన్ లేకుంటే కంపెనీలు మెసేజ్‌లను స్కాన్ చేసి హానికరమైన కంటెంట్ తొలగించగలవు.

ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ మెసేజింగ్‌పై నియంత్రణలు

Advertisement

యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో చాట్ కంట్రోల్ నియంత్రణపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చట్టం ప్రైవేట్ మెసేజ్‌లను స్కాన్ చేయడానికి అనుమతి ఇస్తుంది. యూకేలో ప్రత్యేక చట్టం.. ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ 2023 ఆమోదించబడింది. ఈ చట్ట ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు హానికర కంటెంట్ తొలగించాలి. ఎన్‌క్రిప్షన్ తొలగిస్తే కంపెనీలు సులభంగా కంప్లయింట్ చేయగలవు.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లపై ప్రభావం

ఎన్‌క్రిప్షన్ తొలగిస్తే ప్రైవసీ అంచనాలు మారిపోతాయి. చాలా మంది యూజర్లు తమ వ్యక్తిగత, రహస్య విషయాల కోసం ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లనే ఉపయోగిస్తారు. ఇప్పుడు మెసేజ్‌లను ఇన్‌స్టాగ్రామ్ యజమాన్యం స్కాన్ చేసి సేఫ్టీ మానిటరింగ్ చేయవచ్చు. అయితే దీనివల్ల తమ వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవుతాయని కొందరు యూజర్లు ఆందోళన చెందుతారు. అయితే ఈ మార్పు వల్ల ఆన్‌లైన్ లో సురక్షితమైన వాతవరణం ఉంటుందని మరికొందరి భావన.

ఇతర ప్లాట్‌ఫామ్‌లు కూడా తొలగిస్తున్నాయా?

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో ఇప్పటికీ ఎన్‌క్రిప్షన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే ఈ మార్పు చేస్తోంది. అయితే భవిష్యత్తులో ఇతర యాప్స్ కూడా ఈ మార్పులు చేసే అవకాశం ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×