BigTV English

Illu Illalu Pillalu Today Episode: రామరాజును ఇరికించిన భాగ్యం.. అన్న ఎంగేజ్మెంట్ కు వచ్చిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజును ఇరికించిన భాగ్యం.. అన్న ఎంగేజ్మెంట్ కు వచ్చిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode March 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. సేన చందుగాడు జైలుకెళ్లకపోయిన పర్లేదు వాడికి పెళ్లయితే క్యాన్సిల్ అయింది కదా అది మన సంతోషంగా ఫీల్ అవుదామని అంటారు. అప్పుడే భాగ్యం శ్రీవల్లిని తీసుకొని రామ రాజు ఇంటికి వెళ్తుంది. ఏమైంది చెల్లెమ్మ ఏం జరిగింది అని అడిగితే మా అమ్మాయి మీ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదంట. మీ అబ్బాయి మంచితనము తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద మా అమ్మాయికి బాగా నచ్చేసాయి అంట చేసుకుంటే జీవితంలో అతనే చేసుకుంటానని అంటుంది మీరే న్యాయం చెప్పండి అన్నగారు ఏం చేయాలో అని భాగ్యం అంటుంది.


అది కావాలనే వాళ్ళు పెట్టారు అన్న కేసు తప్ప మా వాడు నిజంగానే తప్పు చేయలేదమ్మా అని అనగానే భాగ్యం మీ కూతురు లాగా నా కూతుర్ని ఆలోచించి చెప్పండి అని అంటే నా కొడుకు చాలా మంచివాడు పెద్దలంటే గౌరవం ఉన్నవాడు నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు అని చెప్పగానే భాగ్యం మీరు ఇంతగా చెప్తున్నారు కదా మరి ఈ పెళ్లి నాకు ఓకే రేపు నిశ్చితార్థం పెట్టేసుకుందామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు ఎంగేజ్మెంట్ కోసం అందరూ రెడీ అవుతారు.. ధీరజ్ ని చూసిన రామరాజు మాత్రం వీడు పెళ్లికి రావడానికి వీల్లేదు బుజమ్మ అనేసి అంటాడు. మొన్న రెండుసార్లు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అది వాడివల్లే ఒకసారి ఏమో మీ అబ్బాయి ఎదురింటి అమ్మాయి నగలు తీసుకొని వెళ్ళిపోయాడు కదా అని అడిగింది నిన్న అవన్నీ జైల్లో పడేలా చేసాడు ఇక ఇప్పుడు నిశ్చితార్థం పెళ్లి ఆగిపోయే పరిస్థితి కూడా రావచ్చు అందుకే వాన్ని రావద్దని చెప్పు అనేసి అంటారు. నీకు అది అర్థం చేసుకున్న ధీరజ్ నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అన్నయ్య నేను ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకునే వాడిని అనేసి మీరందరూ వెళ్లే అంటాడు . ఆ తర్వాత భాగ్యం వాళ్ళు గుడిలో ఉంటారు శ్రీవల్లి గుడిలో ఎంగేజ్మెంట్ అంటే క్యాన్సల్ అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. రామరాజు భాగ్యం కి ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు చెల్లెమ్మ ఫంక్షన్ హాల్ ఎక్కడైనా అందరూ అడుగుతున్నారు అంటే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసేయండి అన్నయ్య అని అంటుంది.


ఫంక్షన్ హాల్ ఎక్కడో చెప్పమంటే గుడికి రమ్మంటుంది ఏంటి అని అందరూ గుడికి వెళ్తారు అక్కడికి వచ్చి ఫోన్ చేయగానే మీరు గుడిలోకి రండి అన్నయ్యగారు అనేసి భాగ్యం అంటుంది. ఇక అందరూ గుళ్లోకి రమ్మంటుంది ఏంటి ఫంక్షన్ హాల్ అడ్రస్ చెప్తే సరిపోతుంది కదా.. అడ్రస్ చెప్పడానికి ఆవిడకి ఏంటి ప్రాబ్లం అసలు ఇప్పుడు మనం ఇదంతా తిరగడం ఎందుకు డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా అని నర్మదా అంటుంది. అదేనమ్మ నాకర్థం కావట్లేదని రామరాజు అంటాడు. రామరాజుకు కొడుకు నిశ్చితార్థం కోసం అందరూ ఎక్కడ ఫంక్షన్ హాల్ అని అడుగుతారు.

భాగ్యం రమ్మనట్లుగానే గుడి లోపలికి వెళ్లిపోతారు. అక్కడ సెటప్ ని చూసి రామరాజు ఫ్యామిలీ షాక్ అవుతారు ఫంక్షన్ హాల్ లో గ్రాండ్గా చేయాలని అనుకున్నాం కదా అమ్మ. ఇప్పుడేంటి ఇలా అంటే మీ అబ్బాయి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఫంక్షన్ హాల్ కెళ్ళి అందరిని పిలిచి మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటే మా పరువేమి అవుతుంది అన్నయ్యగారు ఒకసారి మీరు ఆలోచించండి అని భాగ్యం అంటుంది. అడ్వాన్స్ ఇచ్చేసాము గ్రాండ్గా చేయాలని అనుకున్నాం ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుంది కదా మా పరువు కన్నా మీ గొప్పతనం కావాలంటే అక్కడికి వెళ్దాం ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాను కదా వెళ్లి ఫంక్షన్ హాల్ లోనే నిశ్చితార్థం చేసుకుందామని అంటుంది.

కానీ రామ రాజు మాత్రం ఆలోచించి ఇక్కడే చేద్దాం లేమ్మా అందరికీ మంచిదే కదా అని ఒప్పుకుంటాడు. భాగ్యం ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక తాంబూలాలు మార్చుకొని నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారు. వధూవరులను బట్టలు మార్చుకు రమ్మని చెప్తే వాళ్ళు వెళ్తారు. ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ పక్కకు వెళ్ళిపోతుంది. బుజ్జమ్మ కూడా తన చిన్న కొడుకు అన్న నిశ్చితార్థానికి లేడని బాధపడుతూ పక్కకు వెళుతుంది. అక్కడ కొడుకు నిచ్చితర్థమవుతుంటే నువ్వు ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్ ఏంటి అని వేదవతిని రామరాజు అడుగుతాడు.

సొంత అన్నకి నిశ్చితార్థం జరుగుతుంటే తమ్ముడు రాకపోవడని ఏమంటారు అండి. వాళ్ళ అన్న అంటే వాడికి ఎంత ఇష్టమో మనకు తెలుసు కానీ మీరు ఆ మాట అనగానే నాకు మనసు విరిగి పోయిందండి అని వేదవతి అంటుంది. వాడి వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోతుందేమో అని భయంతోనే నేను రావద్దు అని చెప్పాను అంతేతప్ప వాణ్ని ఎందుకు రావద్దు అన్నానని నా మనసు బాధపడుతుంది అని రామరాజు అంటాడు. అటు ప్రేమ కూడా ధీరజ్ బాధపడుతూ ఉంటుంది ఇక నర్మద వెళ్లి నువ్వు ధీరజ్ ని ప్రేమిస్తున్నావు కదా అనేసి అంటుంది.

చందు తన తమ్ముడి లేడని బాధపడుతూ ఉంటాడు. ధీరజ్ వాటర్ క్యాన్స్ తీసుకొని గుడికి వస్తాడు. తన అన్న ఎంగేజ్మెంట్ ను చూసి సంతోష పడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ భాగ్యం నీ గుద్దుకుంటాడు. భాగ్యం ఏమంటుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×