Riyan Parag Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఆరవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దారుణంగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టేడియంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉంటే… వాళ్ల అభిమానులు గ్రౌండ్ లోకి పరిగెడుతారు.
Also Read: SRH VS LSG: ఇవాళ SRH మ్యాచ్.. 300 కొట్టడం ఈసారి గ్యారెంటీ!
రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లను హగ్ చేసుకుని కాళ్ళు మొక్కడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్టార్ ప్లేయర్లు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. అయితే ఇప్పుడు అచ్చం వాళ్ళలాగే రియాన్ పరాగ్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా కన్సిస్టెంట్ గా క్రికెట్ ఆడుతున్న రియాన్ పరాగ్…. ఇటీవల టీమిండియా కు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇటు రాజస్థాన్ రాయల్స్ తరఫున… కీలక పాత్ర పోషిస్తున్నాడు రియాన్ పరాగ్.
స్టేడియంలోకి దూసుకు వచ్చిన అభిమాని
కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders ) నేపథ్యంలో… ఓ అభిమాని గ్రౌండ్ లోకి దూసుకు వచ్చాడు. ఆ సమయంలో రాజస్థాన్ ఫీల్డింగ్ చేస్తోంది. ఇక రియాన్ పరాగ్ దగ్గరకు వచ్చిన ఓ అభిమాని… అతనికి ఒక హగ్ ఇచ్చి… కాళ్లు మొక్కాడు. వెంటనే అక్కడి నుంచి అభిమానిని సెక్యూరిటీ తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే… ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ఈ సంఘటనపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి రియాన్ పరాగ్ ఇలాంటి… చెత్త పనులు చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు.
విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు అయితే… ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి వస్తారు.. కానీ రియాన్ పరాగ్ ( Riyan parag) ఏం సాధించాడని… గ్రౌండ్ లోకి ఫ్యాన్స్ దూసుకు వస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా ఫేక్… అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అభిమానులకు డబ్బులు ఇచ్చి… తన క్రేజ్ పెంచుకునేందుకు రియాన్ పరాగ్ ప్రయత్నాలు చేస్తున్నారని సెటైర్లు పేల్చుతున్నారు నెటిజెన్స్. అయితే మరి కొంత మంది రియాన్ పరాగ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. రియాన్ పరాగ్ మంచి క్రికెటర్ అని… టీమిండియా ఫ్యూచర్ ఆటగాడు అవుతాడని.. అందుకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్… టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !
🚨BREAKING:RIYAN PARAG.
⚡During a live match,a fan of Riyan Parag entered the ground and started touching his feet.However,Riyan Parag showed respect and affection by embracing him like a brother.Thanks Riyan Parag,this is exactly what we expected from you.#RRvsKKR#Riyanparag pic.twitter.com/6cVOGi8IVs— Ashish Chaudhary (@ashishranwa1818) March 27, 2025
🚨BREAKING:RIYAN PARAG.
⚡During a live match,a fan of Riyan Parag entered the ground and started touching his feet.However,Riyan Parag showed respect and affection by embracing him like a brother.Thanks Riyan Parag,this is exactly what we expected from you.#RRvsKKR#Riyanparag pic.twitter.com/6cVOGi8IVs— Ashish Chaudhary (@ashishranwa1818) March 27, 2025