BigTV English

Pamban Rail Bridge: భారతీయ రైల్వేలో మరో కలికితురాయి, పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!

Pamban Rail Bridge: భారతీయ రైల్వేలో మరో కలికితురాయి, పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!

Pamban Vertical Lift Sea Bridge: భారతీయ రైల్వే సంస్థ దేశ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తోది. లేటెస్ట్ టెక్నాలజీని అందింపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయగా, ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా రూపొందిన ఫస్ట్ వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి రెడీ అవుతున్నది. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఈ వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 6న ప్రారంభించబోతున్నారు. రామ నవమి సందర్భంగా ప్రధాని తమిళనాడులో రామేశ్వరంలోని శ్రీ అరుళ్మిగు రామనాథస్వామి ఆలయంలో పూజలు చేయడానికి వెళ్తున్నారు. అదే సమయంలో పంబన్ రైల్వే వంతెనను ప్రారంభిస్తారు. ద్వైపాక్షిక సమావేశాల కోసం ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయ్ లాండ్ వెళ్తారు. 5న శ్రీలంకలో పర్యటిస్తారు. తిరుగు ప్రయాణంలో తమిళనాడుకు వెళ్లి పంబన్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేస్తారు.


వేగవంతమైన రైళ్ల నిర్వహణ

కొత్తగా అందుబాటులోకి రానున్న రైల్వే బ్రిడ్జి భవిష్యత్ రైళ్ల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా  వేగవంతమైన రైళ్ల నిర్వహణకు, పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా దీనిని రూపొందించారు. రామేశ్వరం, దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచుతుంది. పంబన్ రైల్వే బ్రిడ్జిని 1914లో బ్రిటిషర్లు నిర్మించారు. 100 ఏండ్లు దాటడంతో తుప్పుపట్టింది. ఈ నేపథ్యంలో రైల్వే సేవలు నిలిపివేశారు. 2019 మార్చిలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ. 535 కోట్ల వ్యయంతో 2.08 కి. మీ పొడవున్న వంతెనను నిర్మించింది.  బ్రిటీషర్లు నిర్మించిన వంతెనకు సమాంతరంగా దీనిని నిర్మించారు. సముద్ర రవాణాకు అనుకూలంగా వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ను నిర్మించారు.


ఓడల ప్రయాణానికి వర్టికల్‌ లిఫ్ట్‌  

పంబన్ రైల్వే బ్రిడ్జి మధ్య భాగంలో వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ మార్గంలో ఓడలు, పడవలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆ సమయంలో ఈ బ్రిడ్జి నిటారుగా పైకి లిఫ్ట్ అవుతుంది. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రైల్వే బ్రిడ్జి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ వంతెన రైలు ప్రయాణానికి అనుకూలంగా మారడంతో పాటు పర్యాటకులను బాగా ఆకర్షించనుంది. భారతీయ ఇంజినీరింగ్ అద్భుతాలో ఒకటైన ఈ వంతెన.. ఇండియన్ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ బ్రిడ్జితో భారత్ మరోసారి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.

Read Also: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు.. మొదటి రైలు అక్కడి నుంచే!

ఈ వంతెన వర్టికల్ గా ఎలా లిఫ్ట్ అవుతుంది?

రామేశ్వారాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు నిర్మించిన ఈ వంతెన, సరికొత్త టెక్నాలజీతో రూపొందింది. ఈ వంతెన మధ్యలో నుంచి పడవలు, ఓడలు వెళ్లేలా వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని రూపొందించారు. ఓడలు, పడవలు వెళ్లే సమయంలో ఈ బ్రిడ్జి నిలువుగా పైకి లిఫ్ట్ అవుతుంది. పడవలు, ఓడలు వెళ్లాలక మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.

Read Also: కశ్మీర్‌‌ను ఇక రైల్లో చుట్టేయొచ్చు.. ఏయే ప్రాంతాలను చూడొచ్చు అంటే?

Tags

Related News

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

Big Stories

×