E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఫైనాన్స్ కోసం వెళ్లిన ధీరజ్.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద..

Illu Illalu Pillalu Today Episode: ఫైనాన్స్ కోసం వెళ్లిన ధీరజ్.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. తర్వాత రోజు ఉదయం శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా ప్లాన్ లా రివర్స్ కొడుతుందని అస్సలు అనుకోలేదు అని బాధపడిపోతూ ఉంటారు.. మళ్లీ వస్తే మన మీద రివెంజ్ తీర్చుకుంటుందేమో అని శ్రీవల్లి కూడా బాధపడిపోతూ ఉంటుంది. కానీ భాగ్యం మాత్రం ఆ నర్మదా సాగర్లంటే మీ అత్తమామలు ఇంకా ఒప్పుకోవడం లేదు.. ఈ రోజులు గవర్నమెంట్ కోడలు అని నెత్తిన పెట్టుకున్న మీ అత్తయ్య ఇప్పుడు కనీసం ఆ నర్మద మొహం కూడా చూడడం లేదు అని అంటుంది.. ఇదే అవకాశాన్ని నువ్వు ఇంకా బాగా ఉపయోగించుకొని ఆ నర్మదని మీ అత్తగారికి ఇంకా దూరం చేయాలి అని అంటుంది..

అయితే అప్పుడే నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ఇలా ఇవ్వండి నేను చేస్తానని ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం అక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయానని మీరు ఇంకా రాను అని బాగా మురిసి పోయినట్లున్నారు వచ్చిన తర్వాత ఫీల్ అవుతున్నట్లు ఉన్నారే అని నర్మదా అడుగుతుంది. ఇక మొత్తానికి భాగ్యం ఆనందరావుని నర్మదా ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలియదు.. నర్మదా సాగర్ బయటకు వచ్చేస్తారు.. ఇక భాగ్యం ఆనందరావు బ్యాగ్సర్దుకుని వెళ్లడం చూసిన రామరాజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు.. మేము మీ ఆరోగ్యం బాగోలేదని వచ్చాము. కూతురును ఇచ్చిన ఇంట్లో ఇన్ని రోజులు ఉండడం మంచిది కాదు అని వాళ్ళు అంటారు.. చందు నేను మిల్లుకు వెళ్తాను అని చెప్పగానే రామరాజు అతని రెడీ చేసి మరీ పంపిస్తాడు. అది చూసిన సాగర్ చాలా ఫీల్ అయిపోతాడు.. ఇక సాగర్ వాళ్ళు బయటికి వెళ్లిపోతారు. నర్మదా మాత్రం వేదవతి తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోతుంది..

ఇక తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కారుని తీసుకోవడానికి డౌన్ పేమెంట్ కట్టాలి కదా.. మనం అక్కడికి వెళ్లాలి అని అనుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి డబ్బుల కోసం అని ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తారు. అక్కడ అతనితో నేను కారు బిజినెస్ చేయబోతున్నాను. లోన్ కోసం వచ్చాను సార్ కార్ డౌన్ పేమెంట్ కట్టి కార్ని తీసుకోవాలి. ఏజెన్సీ కోసం మొదటగా కారు తీసుకోవడానికి నాకు లోన్ కావాలి అందుకే మీ దగ్గరకు వచ్చాను అని అంటాడు.. మీరు షూరిటీగా పెట్టడానికి ఏం తీసుకొచ్చారు అని అతను అడుగుతాడు. నేను షూరిటీ కోసమని నా డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాను సార్ అని ధీరజ్ అంటాడు.

Advertisement

ప్రేమ కూడా నా సర్టిఫికెట్ కూడా తీసుకోరా నీకు లోన్ వస్తే ఇంకా మంచిది కదా అనేసి ప్రేమ అంటుంది.. ఇన్ని సర్టిఫికెట్లు పెడితే నీకు ఉద్యోగం రాదు కదా అందుకే ఇప్పుడు ఆ సర్టిఫికెట్ల గురించి ఎందుకు అవసరం లేదు అని ధీరజ్ అంటాడు. కానీ అతను మాత్రం మీరిద్దరూ గొడవ పడడం ఆపేస్తే నేను మీతో మాట్లాడొచ్చా అని అంటాడు.. సర్టిఫికెట్లు పెడితే లోన్ ఇవ్వడం కుదరదు ఇదేమీ ఎడ్యుకేషనల్ లోన్ కాదు.. కచ్చితంగా మీరు ఏదో ఒక షూరిటీగా ప్రాపర్టీనో లేకపోతే ఎవరో ఒకరు పలుకుబడి ఉన్న వ్యక్తితోనో సంతకం పెంచుకు రావాలి అని అతను అంటాడు. నాన్న రైస్ మిల్లు రామరాజు ఆయన చేత సంతకం పెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి ప్రేమ అంటుంది.. అతని చేత సంతకం పెట్టించుకు రండి అని అతను అంటాడు..

ధీరజ్ ఆ మాట వినగానే మా నాన్నతో అవసరం లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను.. ఈ డబ్బులు చాలా అవసరం.. మీరు ఎలాగైనా సరే డబ్బులు ఇవ్వండి సార్ అని ఎంత బ్రతిమలాడినా సరే అతను మాత్రం ఇవ్వడం కుదరదు అని పంపించేస్తాడు.. ఓనర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆనందారావు.. అయితే భాగ్యం నీ అకౌంటెంట్ పోస్టులో కూర్చోవచ్చని అడుగుతాడు.. మొత్తానికి భాగ్యం చివాట్లతో అక్కడ ఆనందరావు సెటిలైపోతాడు.. రామరాజు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండడం చూసిన వేదవతి. ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉంటుంది. భోజనం పెట్టమంటారా అని పదేపదే ఏదో ఒకటి అడగడంతో రామరాజు ఏంటి బుజ్జమ్మ నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు..

మీరు ఉండడం కాదండి మీరు ఎలా దిగులుగా కూర్చుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే మీతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను అని అంటుంది.. ఇంట్లోనే ఉంటే ఇలా దిగులుగా కూర్చుంటారు అంటే అన్నాను అంటారు ఎవరి పిల్లలు తప్పులు చేయకుండా ఉన్నారు చెప్పండి అని అడుగుతుంది. ఈ ఆ తర్వాత మీరు ఇలానే కూర్చుంటే మీరు బాధ పడిపోతూ ఉంటారు. రైస్ మిల్లుకు వెళ్లి కాసేపు అలా తిరిగేసి రండి అనేసి వేదవతి బలవంతంగా రామరాజుని రైస్ మిల్లు కి పంపిస్తుంది.. మావయ్య గారు రైస్ మిల్కెళ్తే మా ప్లాన్ అంతా చెడిపోతుంది. రైస్ మిల్లు తాళాలు వచ్చినట్టే వచ్చే మళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి అని శ్రీవల్లి ఎలాగైనా సరే ఈ విధ్వంసాన్ని ఆపాలి అని భోజనం తీసుకుని వెళుతుంది..

Also Read :ట్విస్ట్ అదిరింది.. నిజం ఒప్పుకున్న చక్రధర్.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి..

ఆ తర్వాత నర్మదని ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయన లంచం ఇచ్చి ఉద్యోగం కొన్నాడు అని హేళన చేస్తూ అవమానిస్తారు. వాళ్ల మాటలు విన్న నర్మదా బాధ పడిపోతుంది.. అయితే నర్మదతో పాటు పనిచేస్తున్న మరొక ఆవిడ అక్కడికి వచ్చి నర్మద గురించి మనకు తెలియదా ఎందుకు మీరు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంది.. ఏరోజైనా లంచాలు తీసుకొని తప్పు చేసిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కొంచెం బుద్ధుండాలి అని ఆమె ఇద్దరిని కడిగి పడేస్తుంది. నర్మదా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది.. ధీరజ్ డబ్బుల కోసం టెన్షన్ పడుతున్నాడు అని ప్రేమ బాధ పడిపోతుంది.. ఎలాగైనా సరే వాడిని ఈ మూడు నుంచి బయటికి తీసుకురావాలని ఐస్క్రీం కొనివ్వమని బ్రతిమలాడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

Big Stories

Advertisement
×