Historical drama OTT : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆంగ్ల రచయిత షేక్స్పియర్ పేరు వినని వాళ్ళు ఉండరు. ఈయన్ని ఆంగ్ల భాషలో అత్యంత గొప్ప రచయితగా, ఇంగ్లాండ్ జాతీయ కవిగా భావిస్తారు. 1564లోఇంగ్లాండ్‌లో జన్మించారు ఈ మహానుభావుడు. 18 ఏళ్ల వయసులో అన్నే హాత్వేను వివాహం చేసుకున్నారు. వీరికి సుసన్నా, జుడిత్, హామ్నెట్ అనే ముగ్గురు సంతానం. హామ్లెట్, రోమియో అండ్ జూలియట్, ఒథెల్లో, మాక్‌బెత్, కింగ్ లియర్ వంటి అనేక ప్రసిద్ద నవలలను రచించారు. ఈయన రచించిన అన్ని నవలలు దాదాపు సినిమాలుగా వచ్చాయి కూడా. అయితే రీసెంట్ గా షేక్స్పియర్ గురించి తెరకెక్కిన ‘హామ్నెట్’ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇది షేక్స్పియర్ 11 ఏళ్ల కుమారుడు చనిపోయాక జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది ఆస్కార్ అవార్డుల్లో కూడా హల్చల్ చేయనుంది.
క్లోయ్ జావో దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీ పేరు ‘హామ్నెట్’ (Hamnet). ఇందులో జెస్సీ బక్లీ (ఆగ్నెస్ హాత్వే), పాల్ మెస్కల్ (విలియం షేక్స్పియర్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 8 ఆస్కార్ నామినేషన్లను దక్కించుకోవడమే కాకుండా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, సామ్ మెండిస్ తో కలిసి నిర్మించారు. మాక్స్ రిక్టర్ అందించిన సంగీతంతో ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ బాగా పండాయి. ఈ సినిమా 2026 మార్చి 6 నుండి Peacock ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది.
1580ల నాటి కాలంలో షేక్స్‌పియర్ లండన్‌లో తన నాటకాలు రాసుకుంటూ బిజీగా ఉంటే, అతని భార్య ఆగ్నెస్ ఊర్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఆమె ఒక మూలికా వైద్యురాలిగా కూడా ఉంటుంది. ఒకరోజు వాళ్ల 11 ఏళ్ల కొడుకు హామ్నెట్‌కు అకస్మాత్తుగా ప్లేగు వ్యాధి వచ్చి చనిపోతాడు. అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఆ ఫ్యామిలీలో ఈ చావు వాళ్ళ గుండెల్లో నుంచి దింపలేని బాధను ఇస్తుంది. తన కొడుకును కాపాడుకోలేకపోయానని ఆ తల్లి పడే బాధ గుండెల్ని పిండేస్తుంది.
కొడుకు చనిపోయిన బాధలో ఉన్న షేక్స్‌పియర్, ఆ జ్ఞాపకాలతోనే తన కొడుకు పేరు మీద ‘హామ్లెట్’ అనే ఒక ఫేమస్ నాటకం రాస్తాడు. మొదట్లో ఆగ్నెస్ తన భర్తపై కోపంగా ఉన్నా, ఆ నాటకాన్ని చూశాక తన కొడుకును ఎంతగా ప్రేమించే వాడో ఆమెకు అర్థమవుతుంది. ఆ నాటకం ద్వారా చనిపోయిన కొడుకు మళ్ళీ బతికినంత ఫీలింగ్ కలుగుతుంది ఆ తల్లికి. ఈ సినిమా గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక కొడుకు చావు.. ఒక తండ్రికి ఒక గొప్ప నాటకం రాయడానికి ఎలా స్ఫూర్తి ఇచ్చిందో, ఆ తల్లి బాధను ఎలా తగ్గించిందో ఇందులో చూడొచ్చు.
Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న పరేష్ రావల్ వివాదాస్పద కోర్టు రూమ్ డ్రామా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?