E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ట్విస్ట్ అదిరింది.. నిజం ఒప్పుకున్న చక్రధర్.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: ట్విస్ట్ అదిరింది.. నిజం ఒప్పుకున్న చక్రధర్.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode March 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ అలాగే కమల్ ముగ్గురు కూడా చక్రధర్ ఎక్కడున్నాడో తెలుసుకొని మీనాక్షి అత్తయ్యని కాపాడాలి అని అనుకుంటారు.. చక్రధర్ మాత్రం మీనాక్షిని ఎలాగైనా కాపాడి అవని వాళ్లకి నిజం చెప్పాలని. కానీ చక్రధర్ మీనాక్షి కాపాడడానికి వెళ్తాడు. మీనాక్షి నన్నేం చేయొద్దు నేను నీ గురించి ఎక్కడ నిజం చెప్పను నా పిల్లల కోసమే నేను బతుకుతున్నాను అని ప్రాధేయపడుతుంది. నేనేం చేయను నిన్ను కాపాడడానికే వచ్చాను.

ఇకనుంచి తీసుకొని వెళ్ళిపోయి నిజం చెప్తాను అని అంటున్న సరే మీనాక్షి మాత్రం అస్సలు నమ్మదు. మీనాక్షి కట్లు విప్పుతున్న టైం లో కమల్ అక్షయ్ వాళ్లు చూసి అతన్ని కొట్టేస్తారు. ఇక అవని తన తల్లి కట్లు విప్పేసి హక్కును చేర్చుకుంటుంది.. ఇక చక్రధర్ ని కొట్టి మీనాక్షిని తీసుకుని వెళ్తారు.. అవని ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం చక్రధర్ని చంపేస్తాను అని అంటాడు.. కానీ మొత్తానికి మీనాక్షిని తీసుకుని వెళ్తారు.. చక్రధర్ మళ్లీ రాజన్న ప్రసాద్ ఇంటికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అని నేను మాత్రం ఒక నిజం చెప్పాలని అంటారు.. నిజమెంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నేను ఒక విషయం చెప్పాలి అని చక్రధరం అంటాడు. అవని ఏదో చెప్తాను అంటున్నాడు కదా అత్తయ్య చెప్పనివ్వండి అని అంటుంది. మీనాక్షిని దగ్గరికి తీసుకుని వచ్చి క్షమాపణ చెప్తాడు.. అందరూ ఎందుకు మీనాక్షికి అతను క్షమాపణలు చెప్తున్నాడు అని ఆశ్చర్యపోతారు.. కానీ చక్కగా మాత్రం మీనాక్షిని దగ్గరకు తీసుకొని వస్తాడు.. ఈ మీనాక్షి ఎవరో కాదు నా మొదటి భార్యని కుండ బద్దలు కొట్టే నిజాన్ని బయటపెడతాడు.. అవని, భరత్లో నా కన్న పిల్లలు అని నిజాన్ని ఒప్పుకుంటాడు చక్రధర్.. ఎన్ని రోజులు వాళ్ళిద్దరిని దూరం పెట్టి చాలా బాధ పెట్టాను అని చక్రధర్ బాధపడతాడు.. ఇన్నేళ్లు వీళ్ళని చాలా బాధ పెట్టాను అందుకే ఇప్పుడు ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నాను అని చక్రధర్అంటాడు..

ఏంటి మీరు మాట్లాడేది నిజమా అని పార్వతి అడుగుతుంది.. చక్రధర్ అవునమ్మా నిజమే నాకు ఈమధ్య ఈ విషయం తెలిసింది.. నాన్న కూడా ఈ విషయం ఎప్పుడో తెలుసు.. అందుకే ఆరోజు పార్టీని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అందరితో చెప్పాలని అనుకున్నాడు.. అందుకే ఇలా జరగకుండా ఉంటే కచ్చితంగా అందరితో చెప్పేసేవాడు అని అక్షయ్ అంటాడు. వీళ్ళ ఎమోషన్ చూసిన పల్లవి.. ఏంటి ఇన్ని రోజుల తర్వాత మా డాడీ చేత నిజం చెప్పించామని సంతోష పడుతున్నారా బాగుంది మీ ఫ్యామిలీ డ్రామా అని వెటకారంగా మాట్లాడుతుంది..

Advertisement

ఒకప్పుడు మా డాడీ మధ్యతరగతి కుటుంబంలో ఉండేవాడు.. కానీ ఇప్పుడు కోటీశ్వరుడు కాబట్టి మీరిద్దరూ ప్లాన్ చేసి ఇప్పుడు నిజాన్ని చెప్పించారు అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది. మాట వినగానే అవని రెచ్చిపోతుంది.. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా పల్లవి. కొంచమైన నీకు బుద్ధుందా లేదా అని అడుగుతుంది. నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు.. నా తల్లి నీ కన్నతల్లి లాంటిదే కదా నువ్వు ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు. ఎన్నాళ్లకు మా కన్న తండ్రి ఎవరో అందరి ముందర నిజం తెలిసింది. మీ ఆస్తి కోసం మేము ఏమి నాటకాలు ఆడడం లేదు అని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అవని. ఆ తర్వాత మీనాక్షి కూడా మీ ఆస్తి కోసం మాకేమి అవసరం లేదు..

Also Read :శుక్రవారం ఓటీటీ లవర్స్ కు ఫుల్ మీల్స్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి…

ఇన్నేళ్ల తర్వాత నేను పడ్డ అవమానాలు బాధలకి నాకు విముక్తి కలిగింది అని అంటుంది.. మీ ఆస్తి కోసం నేనెప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నువ్వు నన్ను వేరేలా అనుకోవద్దు అని అంటుంది.. ఇక తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని తను బ్యాగు తెచ్చుకుంటుంది మీనాక్షి. ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతున్నాం ఏంటి. నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అవని ఎంత చెప్తున్నా సరే.. లేదమ్మా నేను భరత్ దగ్గర ఉంటాను అని మీనాక్షి అంటుంది.. ఆ తర్వాత పార్వతి కూడా ఇన్ని రోజులు మీ గురించి తెలియక నానా మాటలు అన్నాము అపార్థం చేసుకున్నాము మీరు ఇక్కడే ఉండండి వదిన గారు.. అని ఎంతగా బ్రతిమలాడినా సరే.. మీనాక్షి మీ కూతురు ఒంటరిగా ఉంటుంది అని అక్కడికే వెళ్లిపోతాను అని అంటుంది. పల్లవి మాత్రం చక్రధర్ తో మాట్లాడాలి అని ఎంతగా అంటున్న సరే అతను మాత్రం తర్వాత మాట్లాడతాను అని వెళ్ళిపోతాడు.. తన తండ్రి ఎవరో తెలుసా అని చాలా సంతోషంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×