BigTV English

Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను అవమానించిన శ్రీవల్లి.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను అవమానించిన శ్రీవల్లి.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Illu Illalu Pillalu Today Episode may 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ నర్మద దగ్గరకొచ్చి సారీ నర్మదా అని చెప్తాడు. నర్మదా సారీ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతుంది. నేను రెస్టారెంట్లో బిల్లు కట్టలేదు కదా అందుకు నువ్వు ఫీల్ అయ్యావ్ ఏమో అని సారీ చెప్పానని అంటాడు. రెస్టారెంట్లు బిల్లు కట్టనందుకు నేను ఫీల్ అవ్వలేదు రెస్టారెంట్ బయట ఒక అనాధ లాగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు చూడు.. అది నాకు బాధగా అనిపించింది అని నర్మద అంటుంది. భార్యను రెస్టారెంట్ కి తీసుకెళ్లాలని తండ్రితో ధైర్యంగా చెప్పలేవు.. ఒక 1000 రూపాయలు కూడా అడిగి తీసుకురాలేవు నువ్వే మనిషివి రేపు కాపురం చేయాలన్నా మీ నాన్నను అడిగే కాపురం చేస్తావని నర్మదా సీరియస్ అవుతుంది. సాగర్ కూడా సీరియస్ అవుతాడు.. నర్మద అన్న విషయాల గురించి సాగర్ బాధపడుతూ ఉంటాడు. నర్మదా అన్న మాటల్లో తప్పులేదు కదా అని సాగర్ ఆలోచిస్తూ బయట ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ ఏమన్నా అన్నయ్య ఇలా కూర్చున్నావని అడుగుతాడు. రెస్టారెంట్లు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు. పెళ్ళైన తర్వాత కనీసం కోరికలనే ఉంటాయి కదా.. శ్రీవల్లి మాత్రం తన భర్త సంపాదన ఇంట్లో అందరూ తింటున్నారని కుళ్లుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి మాత్రం తన భర్త సంపాదన మీదే ఇంట్లో వాళ్ళందరూ బతుకుతున్నారని, భర్త జీతం తెస్తే భార్యకి ఇవ్వాలి కానీ ఇంట్లో వాళ్లకి ఇవ్వడమేంటి అంటూ తెగ కుళ్ళుకుంటుంది. ముందు ఒక లెక్క పెళ్లయిన తర్వాత మరో లెక్క ఇప్పుడు పెళ్ళాం చేతిలోనే జీతం పెట్టాలి కదా బావ ఎందుకు ఇలా చేస్తున్నాడంటూ ఆలోచిస్తుంది.. కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని బావ ఆ చేతిలోనే జీతం మొత్తం పెట్టేలా చేసుకోవాలని ఆలోచిస్తుంది. వేదవతి అందరికీ కాఫీ తెచ్చేస్తుంది. కోడల్ని చూస్తూ ఉంటే నా కళ్ళు చల్లబడి పోతున్నాయి. ఇలా ఏ ఇంట్లో ఉంటారు చెప్పండి ముగ్గురు కోడళ్ళు అన్యోన్యంగా ఉంటారని గొప్పగా పొగిడేస్తుంది.

అయితే ఉదయం అందరూ హాల్లో ఉండగానే చందు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తారు ఇదిగో నాన్న నా జీతం వచ్చింది అని చెప్తాడు. అలాగే చందు కూడా ఇదిగో నా జీతం వచ్చింది నాన్న అని 6000 తెచ్చి ఇస్తాడు. ఈ డబ్బులు నాకు ఎందుకు ఇస్తున్నావ్ రా అని రామరాజు అడుగుతాడు. నాకు నా భార్యను పోషిస్తున్నారు కదా నాన్న అందుకే నేను నీ డబ్బులు ఇస్తున్నానని అంటాడు. ఇద్దరు మనుషులు ఇంట్లో తింటున్నారంటే నెలకు వాళ్లకి ఎంత ఖర్చులు అయితాయి అని సీరియస్ అవుతాడు. ఇంట్లోని వాళ్ళందరూ రామరాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు.. కానీ రామరాజు మాత్రం వినకుండా శ్రీవల్లిని ఇద్దరు మనుషులు ఇంట్లో తింటున్నారంటే ఎంత ఖర్చు అవుతాయి చెప్పమ్మా అని అడుగుతాడు. శ్రీవల్లి ఎనిమిది నుంచి పదివేల వరకు ఖర్చవుతాయని లెక్క వేసి చెప్తుంది.


శ్రీవల్లి చెప్పగానే రామరాజు చూసావా 8 నుంచి 10,000 ఖర్చు అవుతుంది అంటే నువ్వు సంపాదించాల్సింది ఇంకా ఉంది అనేసి ఎద్దేవా చేసి మాట్లాడుతాడు. అది విన్న శ్రీవల్లి నవ్వుకుంటుంది. ఇంకా తర్వాత అయినా మావయ్య గారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అడుగుతుంది.. ఏంటమ్మా అది అంటే ఇంట్లో మా ఆయన ఒక్కడే జాబ్ చేస్తున్నాడు జీతం ఇస్తున్నారు. మిగతా ఇద్దరు కొడుకులు మీకు జీతం ఇయ్యట్లేదు అంటే మా ఆయన ఒక్కడే కదా ఇంటి మొత్తాన్ని పోషిస్తున్నాడని అడిగేస్తుంది.

ఆ మాట వినగానే వేదవతి తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ షాక్ అవుతారు.. ఏంటమ్మా శ్రీవల్లి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని వేదవతి అంటుంది. అవును కదా అత్తయ్య గారు మా ఆయన బోలెడు జీతం ఇస్తున్నారు దాన్ని మావయ్య గారు ఇంట్లో పెడుతున్నారని అంటుంది. ఇక మిగిలిన ఇద్దరు కొడుకులు ఏమో ఎందుకు పనికి రాకుండా పోయారు కదా అని వాళ్ళందరూ బాధపడేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఏమో 6000 ఇచ్చి ఇల్లంతా ఉద్దరిస్తున్నట్లు గొప్పగా చెబుతున్నాడు. తాగరేమో రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు కానీ ఏ జీతము లేకుండా ఫ్రీగానే తింటున్నాడు కదా అని మొహాన్నే అంటుంది..

సాగర్అనడంతో నర్మదా శ్రీవల్లితో గొడవకు దిగుతుంది. అక్క మా ఆయన అంటే నేను అసలు ఊరుకోను. మా ఆయన మిల్లులో పనిచేస్తున్నాడు. మీ ఆయన ఎంత ఇచ్చాడు 50000 మా ఆయన చేస్తున్న దానికి 70 వేలకు పైగా మావయ్య గారు ఇవ్వాలి. మా ఆయన ఎక్కువ జీతం సంపాదిస్తున్నాడు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు అని శ్రీవల్లి గాలి తీసేస్తుంది. ఇక రామరాజుకి అర్థమయ్యేలా నర్మదా చెప్తుంది. మొత్తానికి కొడుకులు మధ్య శ్రీవల్లి చిచ్చు పెట్టేస్తుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×