Income Tax Officer Arrest: 70 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జీవన్ లాల్ దొరికాడు. హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్‌గా జీవన్ లాల్ పనిచేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది సీబీఐ. ఓ ప్రైవేట్ సంస్ధ అప్పీలను అనుకూలంగా పరిష్కరించడానికి..70 లక్షల డిమాండ్ చేయగా.. స్పాట్‌లో 69 లక్షల దొరికాయి. మధ్యవర్తులతో కలిసి ప్రైవేట్ సంస్ధకు లాభం వచ్చేలా ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్ వ్యవహారించారని ఆరోపణలు ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన మధ్యవర్తి దగ్గర లంచం తీసుకుంటూ జీవన్ లాల్ పట్టుబడ్డాడు. ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 70 లక్షలతో కీలక డాక్యుమెంట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురిని అరెస్ట్ రిమాండ్‌కి తరలించారు సీబీఐ అధికారులు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్కం ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ కమిషనర్ జీవన్‌లాల్‌ను అరెస్ట్ చేసింది సీబీఐ. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుంది. 70లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపి మరో 69లక్షల రూపాయల నగదుతోపాటు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది సీబీఐ.
ఖమ్మం జిల్లా వైరా BRS మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుమారుడే జీవన్‌లాల్. హైదరాబాద్‌లోని ఇన్కం టాక్స్ కార్యాలయంలో ఎక్సెంప్షన్స్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావటంతో సీబీఐ కొంతకాలంగా నిఘా పెట్టింది. శనివారం ముంబైలో 70లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆయన ఇచ్చిన సమాచారంతో శ్రీకాకుళంకు చెందిన సాయిరాం పాలిశెట్టి, విశాఖకు చెందిన వీర నాగశ్రీ రాంగోపాల్, షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ టాక్స్ DGM విరాల్ కాంతాలాల్ మెహతా, ముంబైకి చెందిన సాజీదా మజహర్ హుస్సేన్ షాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఇవాళ ప్రత్యేక కోర్టులో నిందితులను ప్రవేశపెట్టనున్నారు.
Also Read: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం
మధ్యవర్తులను పెట్టుకుని టాక్స్ మినహాయింపు కోసం వచ్చే దరఖాస్తులను ఆమోదించడానికి.. జీవన్‌లాల్ పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకున్నట్టు విచారణలో తేలిందన్నారు సీబీఐ అధికారులు. వేర్వేరు బృందాలుగా విడిపోయి ముంబయి, హైదరాబాద్, ఖమ్మం, విశాఖ, న్యూ ఢిల్లీ సహా 18చోట్ల తనిఖీలు చేశారు. దీంట్లో పలు కీలకమైన డాక్యుమెంట్లతోపాటు 69లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.