BigTV English

Indo-Pak War: ఛాన్స్ ఎందుకు మిస్సయ్యింది? పీఓకేని ఎందుకు వదిలేశారు?

Indo-Pak War: ఛాన్స్ ఎందుకు మిస్సయ్యింది? పీఓకేని ఎందుకు వదిలేశారు?

Indo-Pak War: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్‌ను నాలుగు రోజులకే చావు దెబ్బ కొట్టింది భారత్. పాక్‌లోని వైమానిక స్థావరాలు డ్యామేజ్ అయ్యాయి. ఆదేశ వైమానిక రక్షణ శ్రేణి వ్యవస్థను నాశనం చేసింది భారత్ సైన్యం. మరో రోజుల్లో దాయాది దేశం చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చేసింది. ఇన్నాళ్లు పీఓకేపై మాట్లాడిన బీజేపీ పెద్దలు, దాన్ని ఆక్రమించుకునే ఛాన్స్ వచ్చినా ఎందుకు వదిలేశారు? ఒక్కసారిగా కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు? ఇవే ప్రశ్నలు మోదీ సర్కార్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


నాలుగు రోజుల్లో పాక్‌కు చావుదెబ్బ

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ హడలెత్తించింది భారత్. రాత్రి ఎనిమిది ధాటితే చాలు  జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాకులు, మిస్సైళ్ల చప్పుళ్లు. దాయాది దేశానికి చెందిన ఎనిమిది సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ సైన్యం. పరిస్థితి గమనించిన దాయాది దేశం సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఇరుదేశాలు పరస్పర అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది పుల్‌స్టాప్ కాదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.


ఒక్కరోజు లేదా రెండు రోజుల్లో అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ వశమయ్యేది అంటున్నారు. ఈ ఛాన్స్‌ను మోదీ సర్కార్ ఎందుకు వదిలేసింది అంటున్నారు.  పీవోకేను మన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఉగ్రవాదుల సమస్యకు కొంతైనా పరిష్కారం లభించేదని అంటున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని భారత్ నిజంగానే వదులుకుందా? అవుననే అంటున్నారు రాజకీయ నాయకులు.

భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చాలా రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు ఇదొక అడుగుగా వర్ణించారు సీపీఐ నారాయణ. యుద్ధం అనేది ఎప్పుడైనా ప్రమాదకమే అయినా, టెర్రరిస్టులు అంతకంటే డేంజర్ అని అంటున్నారు. వారిని అంతం చేయాల్సిందేనని అంటున్నారు.

ALSO READ: పాక్‌తో యుద్ధం.. భారత్ రోజుకు ఖర్చు ఎంత?

కేంద్రానికి  విపక్షాల నుంచి ఒత్తిడి?

పహల్‌గామ్ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని వెనక్కి రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. గతంలో ముంబై దాడుల్లో కీలకవ్యక్తి రాణాను ఎలాగైతే భారత్‌కి తీసుకొచ్చారో అదే పద్దతిలో దాడి చేసినవారిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యుద్ధం వల్ల ఏం సాధించామో.. ఏం కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.

కొద్దిరోజుల కిందట తాను మాట్లాడిన మాటలపై కొందరు నేతలు ఎదురుదాడిని చేసిన వైనాన్ని గుర్తు చేశారు. శాంతి చర్చల కోసం ఇప్పుడు ప్రధాని మోదీని పాక్‌కు పంపిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఏయే అంశాలు ప్రస్తావనకు రాకుండా ముందే  కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు? పీఓకేను ఆక్రమించకుండా ఎందుకు వదిలేశారని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. భారత్‌ని అడ్డంపెట్టుకుని కొన్నిదేశాలు వ్యాపారాలు చేస్తున్నాయని అన్నారు.

ఇరుదేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరగనున్నాయి. ఆ చర్చల సారాంశం ఏంటి? భారత్ ఏయే అంశాల మీద దాయాది దేశంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది?  అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి సోమవారం సాయంత్రానికి చర్చల సారాంశం ఓ కొలిక్కిరానుందన్నమాట.

 

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×