Illu Illalu Pillalu Today Episode May 16th:కారు ఇంట్లోకి తీసుకొని వెళ్ళగానే బ్యాండ్ మేళం రావడంతో తిరుపతి పని అయి ఉంటుందని అనుకుంటారు.. కానీ వెంటనే భద్రావతి వాళ్ళు కారులో రావడం చూసి అందరూ ఏమై ఉంటుందని షాక్ అయి చూస్తూ ఉంటారు.. విశ్వం కార్ లోంచి బయటికి రావడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. పులి లాగా నువ్వు బయటికి రారా అని భద్రావతి విశ్వం ని బయటకు తీసుకొని వచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్తుంది. వచ్చి రాగానే ధీరజ్ వాళ్లతో గొడవకు దిగుతారు.. అమూల్య మాత్రం విశ్వం వచ్చాడంటే తనకి ఏమైనా చేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది.. ధీరజ్ మాత్రం బెయిల్ మీద వచ్చాడు అది గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది లేదంటే మళ్లీ మీ ముగ్గురు జైలుకు వెళ్లాలని వార్నింగ్ ఇస్తాడు..
ప్రేమ తనని ధీరజ్ కారులో ఎక్కించుకోలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఒంటరిగా బయట కూర్చొని విరహ గీతాలను పెట్టుకొని సాడ్ సాంగ్స్ వింటూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ప్రేమ ఎందుకు ఇలా సాడ్ సాంగ్స్ ని వింటూ ఉంది అని నర్మదా అక్కడికి వస్తుంది.. ఆ ఫోన్లో నీ పాటల్ని ఆపేసి ఏమైంది ఎందుకు ఇలా బాధగా పాటలు వింటున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు అక్క నేను ధీరజ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానో.. కానీ ధీరజ్ మాత్రం నా ఆశలని ఆవిరి చేశాడు అని బాధ పడిపోతూ ఉంటుంది. కారులో ముందుగా నన్న ఎక్కించుకుంటాడని అనుకున్నాను కానీ అలా చేయలేదు. ఆ తర్వాత అయినా నన్ను ఎక్కించుకుంటాడు అనుకుంటే ఇంతవరకు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఆ కారు కొనడానికి నేనే కారణం కానీ నన్ను ఎక్కించుకోలేదు నాకు కన్నీళ్లు వస్తున్నాయి అక్క అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది.
ఒసేయ్ తింగరబుచ్చి ఇక్కడ ఉన్నావా నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను అని ధీరజ్ అంటాడు. ప్రేమ మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. నాకు తలనొప్పిగా ఉంది కొంచెం స్ట్రాంగ్ గా కాఫీ కల్పిస్తావా ప్రేమగా అని అడుగుతాడు. ఇప్పటికైనా తనని కారులో ఎక్కించుకుంటాడు అని అనుకున్నా ప్రేమకు ధీరజ్ అలానే లోపల ఒక్కసారిగా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నేనెందుకు కారు ఉంది కదా కారులో మీ అమ్మ నువ్వు వంటగదిలోకి వెళ్లి కాఫీ పెట్టుకుని తాగండి అని సీరియస్గా ఏదేదో మాట్లాడేస్తుంది. ప్రేమని అలా చూసిన ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఇక లోపలికి వెళ్ళిపోతుంది ప్రేమ..
కారు కొన్న తర్వాత తనని కూడా ఎక్కించుకొని అలా ఒక రౌండ్ వేసి వచ్చి ఉంటే బాగుండేది కదా తను ఎంతగా ఫీల్ అవుతుందో తెలుసా అని నర్మదా అంటుంది.. నాకు మా అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా వదినా.. మా అమ్మ నాన్నల తర్వాత ఎవరైనా సరే అని ధీరజ్ అనగానే ప్రేమ మళ్ళీ వచ్చి అవును మీ అమ్మ నాన్నల తర్వాతే ఎవరైనా నేను మాత్రం నీకు ఏమీ కాను అని వెళ్ళిపోతుంది.. ప్రేమని ఇప్పుడు బయటికి తీసుకెళ్లాలని అనుకున్నాను కానీ ఇది ఇప్పుడు ఇలా చేస్తుంది అని ధీరజ్ ప్రేమని బ్రతిమలాడడానికి వెనకాలే వెళ్ళిపోతాడు.
ప్రేమ కోసం గదిలోకి వెళ్లిన ధీరజ్ కి ప్రేమ షాక్ ఇస్తుంది.. తనని గదిలోంచి బయటికి తోసేసి ప్రేమ లోపల గడి పెట్టుకుని ఉంటుంది.. నువ్వు ఇప్పుడు బయటకు వస్తున్నావా రావట్లేదా మనిద్దరం బయటికి వెళ్లాలి అనుకున్నాం కదా నువ్వు వస్తున్నావా అని అనగానే ధీరజ్ రెడీ అయ్యి ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రేమ ముద్దమందారం లాగా పసుపు పచ్చని చీరలో చాలా అందంగా రెడీ అయ్యి తలుపు తెరుస్తుంది. ప్రేమని అలా చూసిన ఫ్లాట్ అయిపోతాడు. నా తింగరబుచ్చి ఇంతగా రెడీ అయింది ఏంటబ్బా అని అనుకుంటాడు. నేనేమీ నీ కారులో ఎక్కడానికి రెడీ అవ్వలేదు మా ఫ్రెండ్ బర్త్డే కేక్ కటింగ్ కోసం వెళ్తున్నాను అని వెటకారంగా మాట్లాడుతుంది. ప్రేమ ఆ మాట అనగానే ధీరజ్ నీ ఫ్రెండ్ బర్త్డే కోసం వెళ్తున్నావా? సరే వెళ్ళు అని ప్రేమను మళ్ళీ వెనక్కి వచ్చి ఎత్తుకొని వెళ్లి కార్లో కూర్చోబెడతాడు..
ప్రేమ ధీరజ్ ఎక్కడకి తీసుకువెళ్తున్నాడో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ధీరజ్ కారుని ఆపి ప్రేమను బయటకు తీసుకుని వస్తాడు. అయితే అక్కడ లైటింగ్ తో వేసిన సెటప్ ని చూసి ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఇదంతా నువ్వు నాకోసం చేసావా అని అనుకుని సంతోష పడిపోతుంది. నాకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చావురా అని ప్రేమ దీరస్తూ అనగానే ఇదంతా నీ కోసమే నేను చేశాను అని ధీరజ్అం టాడు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ సీన్.. ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా రొమాంటిక్ నైట్ ని ఎంజాయ్ చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :వర్షిణి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..