Bandi Controversy: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ కేంద్ర మంత్రి బండిసంజయ్ గా రాజకీయానికి శ్రీకారం చుట్టింది. ఆయనపైపక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఒకవైపు మీడియా ముందు, మరోవైపు నిరసనలు చేపడుతుంది. బండి భగీరథ్ అంశంగా మీడియా, మహిళాసంఘాలు, బీఆర్ఎస్ పార్టీ, కులసంఘాలతో విమర్శలు ఇలాచతుర్ముఖ ప్రణాళికలతో దూకుడు పెంచింది. కేటీఆర్ పై బండి సంజయ్ చేసినవ్యాఖ్యలే ఆయన రాజకీయ భవిష్యత్ దెబ్బతినడానికి కారణమైందనే ప్రచారం సాగుతుంది. మహిళల అంశంను తెరపైకి తేవడం.. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ తో ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ వెళ్తుంది. విమర్శలు తీవ్రస్థాయిలో గుప్పిస్తుంది.
కరీంనగర్ లో కేంద్రంమంత్రి సంజయ్ మీడియా సమావేశంలో కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.‘నువ్వుమనిషిపుట్టుక పుడితే.. నిజంగా నువ్వు కేసీఆర్ కొడుకువు అయితే..మనిషి పుట్టుకపుడితే ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలతో కరీంనగర్ రాజకీయాలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా హీటెక్కాయి. నిన్నటివరకు ఒక లెక్క.. ఇప్పటివరకు ఒక లెక్క అన్నట్లుగా సాగుతోంది. నాటి నుంచి ఆయనపై విమర్శలకు పదును పెడుతుంది.
ఈ తరుణంలోనే పార్టీ ఉమ్మడికరీంనగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం బండికి సవాల్ చేయడంతో.. బండి అనుచరులు సైతం గంగుల, కౌశిక్ రెడ్డి కార్యాలయాలపై దాడిచేశారు. ఇది జరుగుతుండగానే బండి భగీరథ్ అంశం తెరమీదకు రావడంతో బీఆర్ఎస్ ఆయుధంగా మల్చుకుంది. అందివచ్చిన అంశాన్ని చేజారకుండా విమర్శలకు పదునుపెట్టింది. బండి దూకుడుకు కళ్లెం వేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. అధిష్టానం ఆదేశాలతో గులాబీ దళం సంజయ్‌ను నలువైపులా ఉచ్చు బిగిస్తోంది.
Also read: బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో
నోటిదురుసుతో ప్రమాదంలో కెరియర్?
మొదటి నుంచి దూకుడు స్వభావం గల బండి సంజయ్, ఇటీవల కరీంనగర్ వేదికగా కేటీఆర్ పై చేసిన కొన్ని వ్యక్తిగత, ఘాటు వ్యాఖ్యలు శృతిమించాయనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ విమర్శల వరకు ఓకే కానీ, వ్యక్తిగత దూషణలకు దిగడంపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కి సంబంధించిన వివాదాస్పద అంశం తెరమీదకు రావడంతో ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తుంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ తో గత వారం రోజులుగా నిరసనలు, ధర్నాలు, వినతులు ఇస్తూ ఒత్తిడి పెంచుతుంది. భగీరథ్ కనిపించడం లేదని.. ఆచూకీ తెలపాలని మెట్రో రైల్ లో సైతం బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో బండి సంజయ్ తప్పిదాలను ఎత్తిచూపుతుంది. గతంలో ఆయన మహిళలకు అనుగుణంగా చేసిన వ్యాఖ్యలను, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను పోస్టు చేస్తున్నారు. బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వరుస పరిణామాలు, సంజయ్ నోటిదురుసు వ్యాఖ్యలు చివరకు ఆయన రాజకీయ కెరియర్‌కే ప్రమాదకరంగా మారుతాయా? అనే చర్చరాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆయనను రాజకీయంగా ఇరుకున పెట్టడమే లక్ష్యంగా విస్తృత ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మీడియా ముందు సైతం బండిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులకు వినతులు అందజేస్తున్నారు. మహిళా, కుల సంఘాలతో సైతం సమావేశాలు నిర్వహిస్తూ బదితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భగీరథ్ ను అరెస్టు చేయాలని కోరుతూనే ప్రభుత్వ తీరును సైతం తప్పుబడుతున్నారు.
క్షేత్రస్థాయిలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా బీఆర్ఎస్ విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తోంది. సంజయ్ పాత వీడియోలు, భగీరథ్ అంశాలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లలో ఆయనపై వ్యతిరేకత తెచ్చేలా ట్రోలింగ్, క్యాంపెయిన్లను ముమ్మరం చేసింది. ఒకప్పుడు కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్‌పై విరుచుకుపడిన బండి సంజయ్, ఇప్పుడు అదే కరీంనగర్ కోటలో గులాబీ పార్టీ పన్నిన వ్యూహాత్మక చక్రవ్యూహంలో చిక్కుకున్నట్ల కనిపిస్తోంది. మొత్తానికి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్‌కు చుట్టుముట్టాయి. ఈ రాజకీయ యుద్ధం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Also read: థియేటర్లలో పాటు ఓటీటీలను షేక్ చేసిన దమ్మున్న సినిమాలు… వీటి క్లైమాక్స్ తో పూనకాలు పక్కా