Yograj Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు జట్లు ఎలిమినేట్ కాగా.. మరికొన్ని జట్లు కూడా ఇంటి దారి పట్టనున్నాయి. అటు నిన్న లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) ప్లే ఆఫ్స్ ( Playoffs) ఛాన్సులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. అయితే ఇలాంటి క్రమంలో మహేంద్రసింగ్ ధోని (MS Dhoni) ఆడడం పైన యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ( Yograj Singh ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని జిత్తులమారి నక్క అంటూ ఫైర్ అయ్యారు. అవకాశవాది అంటూ మండిపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరితేనే ధోని ఆడతాడని.. లేకపోతే ఇంటికి వెళ్తాడని పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరితే వెంటనే జట్టులోకి చేరి.. క్రెడిట్ మొత్తం దొబ్బేస్తాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఒకటే విషయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మహేంద్ర సింగ్ ధోని ఆడితే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సీజన్ దాదాపు 80 శాతం పూర్తయినా కూడా మహేంద్ర సింగ్ ధోని… ఎల్లో జెర్సీలో బరిలోకి దిగలేదు. మళ్లీ దిగుతాడనే నమ్మకం కూడా కనిపించడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే, ఇంటి దారి పట్టాల్సిందే. ఇలాంటి క్రమంలో యువరాజు సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని అవకాశవాదని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళితేనే అతడు ఆడతాడని బాంబు పేల్చారు.
ఒకవేళ ఇంటిదారి పడితే, సైలెంట్ గా ఉండిపోతాడని పేర్కొన్నారు. చెన్నై ప్లే ఆఫ్స్ బరిలో ఉంటే మాత్రం కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని ఆడతాడని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటాడని చెప్పుకొచ్చారు. గతంలో వన్డే వరల్డ్ కప్ 2011 సమయంలో కూడా ఇలాగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. గాయం పేరుతో నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు యోగ్‌రాజ్ సింగ్. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం యువ క్రికెటర్లతో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకు వెళ్తోంది. ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోని జట్టులోకి రావడం అనవసరము అని మరికొంతమంది భావిస్తున్నారు. ధోని వస్తే, సర్ఫరాజ్ లాంటి యువ క్రికెటర్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ధోని ఆడడం లేదని అంటున్నారు.