BigTV English

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో మరో బాంబ్ పేల్చిన శ్రీవల్లి.. సాగర్, నర్మదలను ఇరికించిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో మరో బాంబ్ పేల్చిన శ్రీవల్లి.. సాగర్, నర్మదలను ఇరికించిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode may 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ట్యూషన్ విషయాన్ని రామారాజుకు చెప్పిందని తెలుసుకున్న ధీరజ్ కోపంగా వెళ్లి శ్రీవల్లిని అడుగుతాడు. వదిన మీరు ప్రేమ గురించి నాన్నకు చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు ఇంట్లో పుల్లలు పెట్టాలని అనుకుంటున్నారా అన్న విధంగా మాట్లాడుతాడు.  శ్రీవల్లి అడ్డంగా దొరికిపోవడంతో నాటకాలు మొదలు పెడుతుంది. ఇంకొకసారి ప్రేమ గురించి ఏ విషయాన్ని నాన్నగారి ముందర చెప్పద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మీ ఆవిడ కోసం నువ్వు వస్తే నేను మా ఆయనకు చెప్పలేనా అని శ్రీవల్లి వెళ్లి చందు కి చెప్తుంది. అటు నర్మదా వెయిట్ చేస్తున్న కూడా నాన్న చెప్పిన మాట కోసం సాగర్ వెయిట్ చేసి రూమ్ కి వస్తాడు. నర్మదా సాగర్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. లేటుగా వచ్చిన సాగర్ ను చూసిన నర్మదా కన్నీళ్లు పెట్టుకొని సీరియస్ అవుతుంది. ఎందుకింత కోపంగా ఉన్నావ్ నేను పని మీదే కదా బయటకు వెళ్ళింది అని సాగర్ అంటాడు. సాగర్ ఇంకా భార్యను బ్రతిమలాడుకుంటాడు. అది కోపమంటావా నీకోసం ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా అరేంజ్ చేశాను అంటే నేనొక పిచ్చిదానా అనేసి అంటుంది నర్మదా.. ఆ తర్వాత నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను. మా నాన్న ఫోన్ చేసిన కూడా నేను తీయను ఈ ఉన్న ఒక్కరోజు నీతోనే గడుపుతాను అని సాగరు ఒట్టేసి చెప్తాడు. ఆ తర్వాత కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పడంతో నర్మదా కూలవుతుంది.. ఇద్దరు దగ్గరవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ నాన్నకు దొరక్కుండా నాతోపాటు రెస్టారెంట్లో తిరగడం ఇదంతా నాకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ నర్మదా ఫీలవుతుంది. నువ్వు మాట్లాడటానికి కూడా మీ నాన్న పర్మిషన్ తీసుకుంటావు అలాంటిది ఇంత దూరం ట్రైనింగ్ కోసం నాకు దగ్గరకు రావడం.. నాతో పటే రెండు రోజులు ఉండటం నాకు ఏదో మిరాకిల్ లాగే అనిపిస్తుంది. రెస్టారెంట్ కి తీసుకెళ్లాలన్నా మీ నాన్న పర్మిషన్ ఉండాలి అని అంటావు. డబ్బులు కూడా మీ నాన్న ఇవ్వాలని అంటావు. ఏది ఏమైనా కూడా ఈ మెమోరీస్ ని నేను అస్సలు మర్చిపోలేను అని సాగర్ అంటాడు.

మనం దిగిన ఫోటోలు చాలా అద్భుతంగా వచ్చాయి కదా అని సాగర్ అంటాడు. అయితే సాగరు వాళ్ళ నాన్న ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటాడు.. ఏంటి ఆలోచిస్తున్నావ్ అని సాగర్ ని అడుగుతుంది. కాదు నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నా అని సాగర్ అంటాడు. మొత్తానికి ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తమ ఫోటోలు నీ ప్రేమకు చూపించాలని అంటుంది కానీ సాగర్ మాత్రం టెన్షన్ పడతాడు. ఈ ఫోటోలు అమ్మ చూస్తే పర్లేదు కానీ నాన్న చూస్తేనే నాకు తడిసిపోతుందని టెన్షన్ పడతాడు.


అయితే ప్రేమ సంతోషంగా వేదవతిని వెతుక్కుంటూ వస్తుంది. అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ అరెస్టు వస్తుంది ఏంటమ్మా కోడలు పిల్ల అని అడిగితే ఈ జంటను చూస్తే మీరు ఇలాంటి జంట మరెక్కడ దొరకదు అద్భుతం అని అంటారని ఆ ఫోటోలను చూపిస్తుంది. అయితే ప్రేమ వేదవతి ఇద్దరూ మాట్లాడుకుంటుండగా శ్రీవల్లి అక్కడికి వస్తుంది. శ్రీవల్లి రావడం చూసి వీళ్ళిద్దరూ మాట మారుస్తారు. రెండు మూడుసార్లు ఇద్దరు మాట మార్చడంతో శ్రీవల్లి నాటికాన్ని మొదలుపెడుతుంది. అత్తయ్య గారు మీకు మీ ఇద్దరు కోడలు అంటేనే ఇష్టం నేనంటే మీకు ఇష్టం లేదు కదా.. అందుకే నాకు ఏది చెప్పట్లేదు మీరు మాట మారుస్తున్నారు కదా అని నాటకం మొదలు పెడుతుంది.

మరేం లేదమ్మా నర్మదా సాగర్లు ఫోటోలు పంపించారు వాటి గురించే మాట్లాడుకుంటున్నామని అంటుంది. ఆ ఫోటోలను చూసి చాలా బాగుంది చాలా బాగున్నారు ఈ జంట అనేసి శ్రీవల్లి అంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే మావయ్యకి చెప్పాలని అనుకుంటుంది. సాగరు నర్మదా ట్రైనింగు కాదు వెళ్ళింది ఎంగేజ్ డానికి వెళ్లారన్న మాట.. కచ్చితంగా రామరాజు మావయ్య గారికి ఈ విషయాన్ని చెప్పాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. రాత్రి భోజనం పెట్టేటప్పుడు రామరాజు ఫోన్ పట్టుకొని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ టెన్షన్ పడుతూ సీరియస్ గా ఉంటాడు. ఎవరికోసం మావయ్య గారు టెన్షన్ పడుతున్నారంటే మీ పెద్ద కొడుకుకి కొంచెం కూడా బుద్ధి లేదు. వాడికి అప్పగించిన ముఖ్యమైన పనిని పక్కన పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడని రామరాజు దారుణంగా తిట్టేస్తాడు.

ఇదే కరెక్ట్ టైం అని శ్రీవల్లి సాగర్ నర్మదలను అడ్డంగా ఇరికిస్తుంది. నర్మదా నీకు ఫోన్ చేయలేదని వేదవతిని రామరాజు అడుగుతాడు. నాకు ఫోన్ చేయలేదండి అని అంటుంది. శ్రీవల్లి ఫోన్ చేయలేదు గాని మామయ్య ప్రేమకి నర్మదా మెసేజ్ చేసింది ఫోటోలు మెసేజ్ చేసింది అని చెప్తుంది. ట్యాంక్ బండ్ దగ్గర ఇద్దరు జంటగా తీసుకున్న ఫోటోలు నువ్వు పంపించింది మీరు కూడా చూడండి ఏంటి ప్రేమా అలా చూస్తున్నావ్ మామయ్యకు కూడా చూపించు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×