Brahmamudi serial today Episode: అప్పు స్నానం చేసి రెడీ అవుతుంటే స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి మనం పట్టుకున్న చార్లెస్ గాడు కడుపునొప్పి అంటున్నాడు మేడం అని చెప్తాడు. దీంతో అప్పు వాడు అలాంటి నాటకాలు ఆడుతుంటాడు. వాణ్ని మాత్రం హాస్పిటల్‌కు తీసుకెళ్లొద్దు అని చెప్తుంది. ఇంతలో కళ్యాణ్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకోగానే కళ్యాణ్‌ను తిడుతుంది. కానిస్టేబుల్ తననేమో అనుకుని ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు అంటాడు. అప్పు ఫోన్ తర్వాత చేస్తానని చెప్తాడు. కళ్యాణ్ ను తిడుతుంది. ఇద్దరూ చిలిపిగా గొడవ పడతారు. అప్పు నవ్వుతూ బయటకు వెళ్లబోతుంటే.. ధాన్యలక్ష్మీ ఎదురుగా వస్తుంది. అప్పు సైలెంట్‌గా వెళ్లిపోతుంది. ఇది నా కొడుకును తన గుప్పిట్లో పెట్టుకోవడానికే ఇదంతా చేస్తుంది. ఇక దీని ఆటలు సాగనివ్వకూడదు అని మనసులో అనుకుంటుంది ధాన్యలక్ష్మీ.
మరోవైపు యామిని, వైదేహి, వాళ్ల డాడీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా రాజ్ వస్తాడు. నవ్వుతూ హాయ్ యామిని అంటూ లోపలికి వెళ్తుంటే.. రాజ్‌ను యామిని ఆపుతుంది. బావ ఒక్క నిమిషం అనగానే రాజ్ ఆగి ఏంటి యామిని అలా చూస్తున్నావు.. అని అడుగుతాడు. ఏం లేదు బావ ఎన్నడూ లేని విధంగా నీ ఫేస్ ఈరోజు మూన్ లైట్ లా వెలిగిపోతుంటే కారణం ఏంటని చూస్తున్నాను. ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా బావ అని అడుగుతుంది. ఏం లేదు యామిని నా ఫ్రెండ్స్‌ను కలిశాను యామిని అని చెప్తాడు. ఫ్రెండ్స్ ను రోజూ కలుస్తూనే ఉన్నావు కదా బావ కానీ ఈరోజు మాత్రమే ఎందుకింత హ్యాపీగా కనిపిస్తున్నావు.. అని యామిని అడగ్గానే.. రాజ్ మనసులో యామిని ఏంటి ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంది.
కొంపదీసి నేను కళావతి గారిని కలిసింది తెలిసిపోయిందా ఏంటి..? అనుకుంటుంటే.. ప్రశ్న వేస్తే ఆన్సర్ ఇవ్వకుండా అలా సైలెంట్‌గా ఉంటావేంటి బావ. నీ ఆనందానికి కారణం ఏంటో చెబితే మేము హ్యాపీగా ఫీలవుతాం కదా బావ అని అడుగుతుంది. దీంతో రాజ్ కన్పీజ్‌గా అంటే యామిని ఈరోజు చాలా ప్రత్యేకమైన ఫ్రెండ్స్‌ను కలిశాను అంటాడు. దీంతో యామిని అంటే బావ నువ్వు నీ ఫ్రెండ్స్ ను కలిసినట్టు లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ తో కలిస్తే బార్ కో రెస్టారెంట్‌కో వెళ్లి ఎంజాయ్ చేస్తారు కదా..? నువ్వేమో అలా కనిపించడం లేదు అంటుంది. ఇంతలో వైదేహి రామ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాము.. కలసి భోజనం చేద్దాం రా అంటుంది.
లేదు ఆంటీ నేను బయట భోజనం చేశాను అని రాజ్ చెప్పగానే.. ఎందుకు రామ్ .. మీకు ఇంకొద్ది రోజుల్లో పెళ్లి ఉంది. కార్డ్స్ కూడా అందరికీ పంచేశాం. ఇలాంటి టైంలో మీరిద్దరు జంట పక్షుల్లా కలిసి ఉండాలి కానీ మీరు అలా ఉండటం లేదు. ఒకరితో ఒకరికి సంబంధ లేన్నట్టుగా ఉంటున్నారు అంటుంది. యామిని వాళ్ల డాడీ కూడా అవును రామ్ పొద్దున్న వెళ్లిపోతున్నారు.. రాత్రికి వస్తున్నారు. పాపం యామిని మీతో కలిసి భోజనం చేయాలని అనుకుంటుంది. కానీ మీరేమో బయట తినేసి వచ్చానని సారీ చెప్తున్నారు అనగానే.. చెప్పు రామ్ మాతో ఏమైనా చెప్పాలా..? అని అడుగుంది. దీంతో రాజ్ అవును ఆంటీ చెప్పాలి. కానీ ఇప్పుడు కాదు. రేపు నాకో క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు చెప్తాను అని వెళ్లిపోతాడు.
ఏంటి బేబీ రామ్ ఏదేదో మాట్లాడుతున్నాడు. రేపు క్లారిటీ రాబోతుంది అంటున్నాడు ఏంటి అని వైదేహి అడగ్గానే.. అవును మమ్మీ రేపు రామ్ ఆ కావ్యకు ప్రపోజ్ చేయబోతున్నాడు అని చెప్తుంది. దీంతో వైదేహి ఆమె భర్త షాక్ అవుతారు. ఈ టైంలో కూడా ఇంత కూల్‌గా ఉన్నావేంటి బేబీ అని అడుగుతుంది. దీంతో యామిని రేపు మీరు హెల్ప్ చేస్తే.. రామ్‌ను మొత్తం మార్చేస్తాను మళ్లీ ఆ కావ్య దగ్గరకు వెళ్లకుండా చేస్తాను అంటుంది యామిని. దీంతో సరే అంటారు వైదేహి వాళ్లు.
తర్వాత ధాన్యలక్ష్మీ, అప్పు గురించి ఆలోచిస్తుంటే.. రుద్రాణి వచ్చి ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా ఆప్పును ఏదైనా చేయాలని అనుకుంటుంది. మరోవైపు అప్పు, స్వప్న ఇద్దరూ కలిసి కావ్య దగ్గరకు వెళ్లి రేపు రాజ్ ప్రపోజ్ చేస్తున్నాడట కదా అంటూ తమ మాటలతో ఆట పట్టిస్తారు. కావ్య సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్, కావ్య గురించి.. కావ్య, రాజ్ గురించి ఆలోచిస్తుంటారు. తర్వాత రాహుల్ రూంలోకి వెళ్లి స్వప్న నెక్లెస్ కొట్టేసి రోల్డ్ గోల్డ్ పెడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?