OTT Movie : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులు కొన్ని డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అందులో టాప్ 5 బెస్ట్ డాక్యుమెంటరీలు, అవి ఏ ఓటీటీలో ఉన్నాయనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
1. కరీ అండ్ సైనైడ్ : ది జోలీ జోసెఫ్ కేస్ (Curry and Cyanide: The Jolly Joseph Case)
2023 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ కేరళలోని కూడతాయి పట్టణంలో 2002-2016 మధ్య 14 సంవత్సరాల వ్యవధిలో ఒకే కుటుంబంలో జరిగిన ఆరు అనుమానాస్పద మరణాల స్టోరీ గురించి తెరకెక్కించారు. ఒక సాధారణ గృహిణిగా కనిపించే మహిళ 47 ఏళ్ల జోలీ జోసెఫ్ ఈ హత్యలలో ప్రధాన నిందితురాలు. ఆమె తన అత్తమ్మ అన్నమ్మ థామస్ (57), మామ టామ్ థామస్ (66), భర్త రాయ్ థామస్ (40), రాయ్ మేనమామ మాథ్యూ మంజయదిల్ (68), రాయ్ బంధువైన షాజు జకారియా రెండేళ్ల కుమార్తె ఆల్ఫైన్, షాజు భార్య సిలీ (41) లను సైనైడ్ ఉపయోగించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా సాగింది అన్నది ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా వివరించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
2. ది హంట్ ఫర్ వీరప్పన్ (The Hunt for Veerappan)
2023 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ 4 ఎపిసోడ్‌లుగా, సుమారు 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉన్న దీంట్లో భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ బందిపోటు, దొంగ, ఎలిఫెంట్ పోచర్ అయిన కూసే మునిసామి వీరప్పన్ (1952-2004) జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
3. లేడీస్ అండ్ జెంటిల్‌వుమెన్ (Ladies and Gentlewomen)
2018 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. మలతి నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ తమిళనాడులోని LGBTQ+ సమాజం, ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల జీవితాలు, ఇది సమాజంలో వారు ఎదుర్కొనే అసమానతలు, వివక్ష, గుర్తింపు కోసం వారు చేసే పోరాటాన్ని చూపించారు.
4. ధూల్‌పేట్ గణేశ (Dhoolpet Ganesha)
2024 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీలో హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ ప్రాంతంలోని ఒక చిన్న, అణగారిన సమాజం గణేశ్ చతుర్థి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటుందో చూపించారు. ఈ డాక్యుమెంటరీ యూట్యూబ్ (Youtube) లో అందుబాటులో ఉంది.
5. ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers)
2022 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. కార్తికి గోన్సాల్వెస్ దర్శకత్వం వహించిన ఈ ఆస్కార్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్, దక్షిణ భారతదేశంలోని ముదుమలై నేషనల్ పార్క్‌లో ఉన్న బొమ్మన్, బెల్లీ అనే గిరిజన దంపతుల కథను చెబుతుంది. ఏ అనాథ ఏనుగు పిల్లతో వారి అనుబంధం ఎలా పెరిగింది అనేది దీని కథ.
Read Also : ఫేమస్ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఇరుక్కునే అమ్మాయి… జైల్లో చేసే టార్చర్ కు దిమాక్ కరాబ్