Illu Illalu Pillalu Today Episode May 29th:వేదవతి ఏడుస్తూ గదిలోకి వెళ్లడంతో రామరాజు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు నేనెందుకు సంతోషంగా ఉంటాను అని వేదవతి అంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నీ కొడుకు బాగానే గడ్డి పెట్టాడు కదా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని రామరాజు అంటాడు.. మన ప్రేమ వాడికి అర్థం కావడం లేదు బుజ్జమ్మ నువ్వు ఏమీ బాధపడకు అని రామరాజు ఎంతగా ఓదారుస్తున్న సరే తన కన్నతల్లి ప్రేమ అడ్డు వచ్చి వేదవది అంతకు ముందు బాధపడుతూ ఉంటుంది. వేదవతి కొడుకు కోసం పెట్టుకునే కన్నీళ్లు సీను ఎపిసోడ్కి హైలైట్ గా తెలుస్తుంది..
ప్రేమ బట్టలుతుకుతుండగా ధీరజ్ అక్కడికి వెళ్తాడు.. ప్రేమ దగ్గరికి వెళ్లి సాయం చేస్తానని చెప్పి తాను చేసే సాయం కాస్త రొమాన్స్గా మారిపోతుంది. ఇద్దరు కలిసి కాస్త రొమాంటిక్గా ఉండడంతో పాటుగా బట్టల్ని కూడా రొమాంటిక్గా ఉతుకుతారు.. అరేయ్ నువ్వు బట్టలు ఉతకడానికి హెల్ప్ చేయడానికి వచ్చావా రొమాన్స్ చేయడానికి వచ్చావా అని ప్రేమ అడుగుతుంది.. బట్టలు ఉతకడానికి హెల్ప్ చేయడానికి వచ్చాను అని ధీరజ్.. పైకి కనిపించడానికి స్వాతిముత్యం లాగా ఉంటావు కానీ లోపల మాత్రం అన్ని ఇలాంటి ఎదవ అలవాట్లే అని ప్రేమ ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది.
సాగరు నర్మదా నేను బయటకు వెళ్తున్నాను అని అంటాడు.. సాగర్ ఏంటి బయటికి వెళ్లి పోతున్నావు. బట్టలు ఎవరు ఉతుకుతారు అని నర్మదా అడుగుతుంది.. అదేంటి నేను ఎందుకు ఉతుకుతాను నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలుసా అని సాగర్ అంటాడు.. నేను బయటకు వచ్చేసి మన వాటాలో ముగ్గులు పెట్టేసాను కూడా.. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది ఈ బట్టలు నువ్వు ఉతికితే నేను ఆఫీస్ కి వెళ్తాను. లేదంటే నేను జాబ్ మానేసి ఈ పనులను చేసుకుంటాను అని సాగర్ ని అడుగుతుంది నర్మదా.. దాంతో సాగర్ నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు ఆఫీస్ కి వెళ్లి నేను బట్టలు ఉతుకుతాను అని అంటాడు.. సాగర్ బట్టలు ఉతకడానికి అక్కడికి వెళ్తే ఒక ఆట ఆడుకుంటాడు.
ధీరజ్ ప్రేమ అప్పటికే అక్కడ బట్టలు ఉతకడానికి రెడీగా ఉంటారు.. అయితే సాగర్ కూడా అక్కడికి రావడంతో ఏంటి వేరే కాపురం పెట్టిన అన్నయ్య బట్టలు ఉతకడానికి వచ్చావా..? వస్తావని నాకు తెలుసు రా అందుకే నీకోసం ఖాళీగా ఉంచాను అని ధీరజ్అంటాడు.. వేరే కాపురం పెట్టావు కదరా ఇప్పుడు ఆ బాధలు ఏంటో అర్థం అవుతున్నాయా? ఎందుకురా నీకు ఈ బాధలు అన్నయ్య అంటూ ధీరజ్ వెటకారంగా మాట్లాడుతాడు.. సాగర్ నా గురించి మర్యాదగా మాట్లాడు.. వేరేలా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అటు సాగర్ కూడా మాటకు మాట సమాధానం చెప్తాడు. ఇంకెన్ని రోజులులే ధీరజ్ మామయ్య గారి కాళ్లు పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. ఆ మాట విన్న సాగర్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు..
సాగర్ ఇంట్లో టిఫిన్ చేయడం లేదు అని వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేయాలని అనుకుంటాడు. అయితే ప్రసాద్ రావు అలాగే ఆయన భార్య అల్లుడికి కొసరి కొసరి టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా అక్కడ చేయలేదని ఇక్కడికి వచ్చారా..? కొంచెమైనా మనిషిలాగ ఆలోచించు సాగర్ ఎక్కడ ఏముండాలో అదే తెలుసుకొని సాగరకి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ ఇస్తుంది నర్మదా. కానీ నర్మదా మాటకు సాగర్ సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ రావు మాత్రం నువ్వు వేరే కాపురం పెట్టడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. మా కుటుంబాన్ని విడగొట్టాలని చూసావు అది మాత్రం నేను సహించలేకపోతున్నాను నాన్న అని నర్మదా అంటుంది.. నేనేం చేసినా అది నీ కోసమే చేశాను అన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది అని ప్రసాద్ రావు అంటాడు..
శ్రీవల్లి టాబ్లెట్స్ అన్ని పెట్టుకొని తెగ బాధ పడిపోతుంది.. అప్పుడే సడన్ గా ఎంట్రీ ఇచ్చిన సుకన్యతో నన్ను చంపేయాలని నువ్వు అనుకుంటున్నావు కదా అని శ్రీవల్లి అంటుంది.. అందంగా ఉన్నానని నీకు కుళ్ళు. అందుకే నన్ను చంపాలని అనుకుంటున్నావు అని శ్రీవల్లి సుకన్యత అంటుంది. ఈ టాబ్లెట్స్ అన్ని మింగాల్సిన అవసరం లేదే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకింగ్ చేయించుకున్నావ్ అని చెప్పడానికి మాత్రమే ఈ టాబ్లెట్స్. వీటిని ఏం చేయాలంటే రోజు ఎన్ని మింగాలో అవన్నీ తీసుకొని కిటికీ తెరిచి అవతల పడేయాలి అని సుకన్య సలహా ఇస్తుంది. అప్పుడే సడన్గా ప్రేమ ఎంట్రీ ఇవ్వడంతో సుకన్య ఆ టాబ్లెట్స్ ని చేతిలో పట్టుకొని కూర్చుంటుంది కానీ ప్రేమకు అనుమానం రావడంతో వాటిని వల్లి సుకన్య నోట్లో వేస్తుంది. చివరికి ప్రేమకి అనుమానం ఎక్కువ పోవడంతో బలవంతంగా సుక్కు చేత మాత్రలని మింగేస్తుంది.. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా నీ మీద ఒక కన్నేసించాలని అనుకున్నాను.. మీ ఇద్దరి ప్రవర్తన తేడాగా ఉంది అదేంటో నేను త్వరలోనే బయట పెడతాను అని ప్రేమ అంటుంది..
నర్మదా తన తండ్రి దగ్గరికి వెళ్లి నా కుటుంబాన్ని ముక్కలు చేశావు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని మాట్లాడుతుంది.. నేను మొదట ఏమీ అనుకోలేదు. ఆ భాగ్యం వాళ్ళు వచ్చి నా కళ్ళు తెరిపించారు.. అందుకే నేను అల్లుడ్ని రెచ్చగొట్టి వాళ్ళ నాన్న దగ్గరికి పంపించాను అని అనగానే ఆ భాగ్యం వాళ్లు నీకు ఏం చెప్పారో చెప్పు నాన్న అని నర్మదా అంటుంది. దీని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. మీరిద్దరూ వేరు కాపురం పెట్టారు కదా ఆస్తి త్వరగా వస్తే వేరే ఇంట్లో కాపురం పెట్టొచ్చు అని ఆయన అనగానే నర్మద మౌనంగా ఉంటుంది.. నర్మదా తల్లి మాత్రం మగాడు ఏం చెప్తే అది వింటే మంచిది కదా అని అంటుంది.
భాగ్యం ఆనందరావు తన కూతురు కడుపు గురించి నర్మద ఇంకా బయట పెట్టే ఉద్దేశాలు లేవు ఎందుకంటే నర్మదకే ఇప్పుడు లేనిపోని సమస్యలు తల మీద ఉన్నాయి అని సంతోషంగా ఉంటారు. అప్పుడే సడన్ గా నర్మదా ధీరజ్ ప్రేమలు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఇలా కాపురాలలో చిచ్చు పెడతారని అనుకోలేదు.. కానీ మీ కూతురు కాపురం నిలబెట్టడం కోసం చందు బావని బ్రతిమలాడి మళ్ళీ తనని కాపురానికి వచ్చేలా చేస్తాము.. కానీ మీరు మాత్రం మా కాపురాల్లో చిచ్చు పెట్టాలని అనుకుంటారా మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని నర్మదా భాగ్యంకి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…