E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో సుకన్య చిచ్చు.. భద్రకు తల్లి వార్నింగ్.. నిజం చెప్పిన ప్రేమ..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో సుకన్య చిచ్చు.. భద్రకు తల్లి వార్నింగ్.. నిజం చెప్పిన ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 9th: ఒరేయ్ రామరాజు అని భద్ర ప్రేమను తీసుకొని వెళ్లి అక్కడ అరుస్తుంది.. భద్ర అరుపులు విన్న రామరాజు కుటుంబం అంతా బయటకు వస్తుంది.. ప్రేమ అత్త వద్దని ఎంత చెప్తున్నా సరే వినకుండా భద్రావతి రామరాజు కుటుంబాన్ని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ప్రేమ నగలని తాకట్టు పెట్టాలని అనుకున్న విషయాన్ని మొత్తానికి ధీరజ్ కి తెలిసేలా చేస్తుంది.. మీ ఫ్రెండ్ ని అడిగి డబ్బులు తెస్తాను అన్నావు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు.. ప్రేమ ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. భద్ర మాటలు విన్న రామరాజు ఇంకాస్త బాధ పడిపోతూ ఉంటాడు.. అందరితో నన్ను మాటలు పడేలా చేస్తున్నారు. పెద్ద కోడలు నా కుటుంబ గౌరవాన్ని పెంచేలా ఓ బిడ్డను కనబోతుంది.. కానీ మిగిలిన వాళ్ళు నా పరువు తీయడానికే ఉన్నారు అని అనగానే వల్లి బాధ పడిపోతుంది.. ఇలాంటి మంచి వ్యక్తిని నేను మోసం చేస్తున్నానని వల్లి బాధ పడిపోతూ ఉంటుంది..

నా కడుపులో బిడ్డనే లేదు..

వేదవతి అలాగే రామరాజు ఇద్దరు కూడా అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి అంటూ పోటీ పడుతూ ఉంటారు. రామరాజు అమ్మాయి కావాలని అంటే వేదవతి మాత్రం నాకు అబ్బాయి కావాలని అంటుంది.. అమ్మ వల్లి నీకు ఎవరు కావాలో చెప్పమ్మా అని అడుగుతాడు రామరాజు. నీ కడుపులో ఏ బిడ్డ అయితే బాగుంటుంది అని ఇద్దరు పోటీపడి మరి వాదులు ఆడుకుంటూ అడుగుతారు.. అయితే నా కడుపులో ఏ బిడ్డ లేదు అని శ్రీవల్లి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అదే నా కడుపులో ఏ బిడ్డ ఉండాలో ఆ దేవుడికే తెలుసు అని అంటున్నాను అత్తయ్య అని అంటుంది. వీరందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆటో వచ్చి ఆగుతుంది..

కొత్త క్యారక్టర్ ఎంట్రీ..

Advertisement

ఆటోలో ఎవరో ఒక లేడీ రావడంతో తిరుపతి ఎవరు నేను వెళ్లి చూస్తాను బావ అని వెళ్తాడు. డిఫరెంట్ గెటప్ లో కనిపించిన ఆవిడను చూసి తిరుపతి ఫ్లాట్ అవుతాడు.. ఎవరు ఈవిడ నా కోసమే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా లైఫ్ పార్ట్నర్ అయిపోయేలా కనిపిస్తుంది అని తిరుపతి సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి పరాచకాలు ఆడతాడు. దేవ కన్న లాగా ఉన్నారు మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా అని అంటాడు.. కన్య సుకన్య అని ఆమె చెప్పడంతో తిరుపతి కూడా తన పేరుని చాలా స్టైల్ గా చెప్తాడు.. మొత్తానికి ఆమె ఎవరో తెలుసుకొని తనకి వరస అవుతుందని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. వల్లికి తోడుగా వచ్చిన చుట్టం కాబట్టి నాకు కూడా చుట్టమే అని అనుకుంటాడు..

భాగ్యం పై వేదవతి కౌంటర్స్..

ఇంట్లో ఇంతమంది ఉన్నాము తన కూతుర్ని చూసుకోవడానికి వేరే ఎవరిని తీసుకొని రావాలా.. ఎంత బంధువైనా సరే మేమున్నాం కదా మేము చూసుకుంటాం కదా మీ అమ్మకి ఇంత ముందుచూపు ఏంటో అని వేదవతి భాగ్యంపై కౌంటర్స్ వేస్తుంది. ఇక సుకన్య ఓవరాక్షన్ తట్టుకోలేక వల్లి మనమేదన్న అంటే మనకే మేడకే చుట్టుకుంటుంది.. ఇక సుకన్య మాటలు ఇంట్లోని వాళ్ళందరికీ వెటకారంగా ఉంటాయి. ధీరజ్ నర్మదా ఈవిడ కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది కదా అని అనుకుంటారు. మొత్తానికి శ్రీవల్లి మీద నర్మదకు అనుమానం మరోసారి మొదలవుతుంది.

రామరాజును అవమానించిన భద్ర..

Advertisement

అందరూ సంతోషంగా ఉన్నా సందర్భంలో భద్రావతి ఒరేయ్ రామరాజు అంటూ కోపంగా మాట్లాడుతుంది. ఎందుకు గొంతు చించుకుని అరుస్తున్నావు ఏం జరిగింది అని రామరాజు అంటాడు. నీకు డబ్బులు గతి లేనప్పుడు అడుక్కుంటే పడేస్తాం అంతేకానీ.. మా అమ్మాయికి పెట్టిన నగలని తాకట్టు పెట్టుకోవాలని ఎలా అనుకుంటావు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది భద్రావతి. ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా తెలిసే మాట్లాడుతున్నావా అని రామరాజు మాటకు మాట సమాధానం చెప్తాడు. కొడుకుని ఎలా పెంచాలో చేతకాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక పెద్ద మనిషివేనా? అని భద్ర నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ధీరజ్ ను ఒక్క మాట అన్న నేను ఒప్పుకోను అని ప్రేమ అంటుంది.. అసలు ధీరజ్ నా మెడలో ఎలాంటి పరిస్థితులలో తాళి కట్టాడు తెలుసా అది తెలిస్తే మీరు ఎప్పుడు ధీరజ్ని ఒక్క మాట కూడా అనరు అని ప్రేమ నిజాన్ని చెప్పబోతోంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ ఫ్యామిలీని పంపేందుకు ఆది ప్లాన్.. వెనక్కి తగ్గని మహా.. పోటీలో ట్విస్ట్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×