E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: కోడలిపై వేదవతి ప్రశంసలు.. ప్రేమకు ఘోర అవమానం.. నిజం తెలుసుకున్న ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: కోడలిపై వేదవతి ప్రశంసలు.. ప్రేమకు ఘోర అవమానం.. నిజం తెలుసుకున్న ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి వస్తే తొందరగా నాలుగైదు లక్షలు లాగేసి మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ మనం ఇంట్లోనే సెటిల్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని ఆనందరావు ప్లాన్ చేస్తాడు.. నర్మదా నిర్దోషి అని తెలుసుకొని ఇంట్లోని వాళ్ళందరూ చూశారా నర్మదక్క ఏ తప్పు చేయదు అని సంతోష్ పడుతుంటారు. ఎప్పుడు ఏది తప్పు చేయదు. నర్మదా నా కోడలు అని వేదవతి సంతోషంగా అందరితో చెప్తుంది.. ఇక ప్రేమ మా అక్కని తప్పు అన్న వాళ్ళు నోరులు ముగించేలా చేసింది చెప్పుతో కొట్టినట్లు చేసింది అని సంతోష పడుతూ ఉంటుంది. ప్రేమ మాట వినగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఇక తర్వాత శ్రీవల్లి మాత్రం మౌనంగా ఉంటుంది. ఆ నర్మదా పని అయిపోయింది అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత నేనే ఈ ఇంటికి మహారాణినని చాలా సంతోషపడ్డాను. నా ఆశ అప్పుడే ఆవిరి అయిపోయింది అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.. సేనపతి ఇంటికి పోలీసులు వెళతారు. నర్మదా సేనకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… ఇదంతా ఎలా జరిగిందో తెలుసా అని ప్రేమ వివరిస్తుంది.. తండ్రికి మంచి బహుమతి ఇచ్చావు.. నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అమ్మ నా కూతురు అని అనిపించుకున్నావులే అని ప్రేమను తిడతాడు.. ఏ కూతురు తండ్రికి చేయని ద్రోహం నువ్వు చేశావు ఇది నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని సేన ఆవేశపడతాడు. పోలీసులు అక్కడి నుంచి సేనను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు.. నా కోడలు ఎప్పుడు తప్పు చేయదని వేదవతి మాత్రం సంతోష పడుతూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేయాలని చూస్తే కచ్చితంగా ఆ దేవుడు శిక్ష పడేలా చేస్తాడు అని నర్మదా అంటుంది.

Advertisement

సేన అరెస్టు అవ్వడం చూసిన భద్రావతి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. తన తమ్ముడు అరెస్టును తట్టుకోలేక మీ కుటుంబంపై ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని రామరాజుకి వార్నింగ్ ఇస్తుంది.. ప్రేమ తన తండ్రిని అరెస్ట్ చేసినట్లు ప్రేమ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.. కన్నతండ్రిని అరెస్ట్ చేయించని అని తన తండ్రి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా నువ్వు చేసిన పనికి చాలా థాంక్స్ ప్రేమ అని అంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు అక్క అలాంటిది నువ్వెందుకు శిక్షణ అనుభవించాలి.. నువ్వు నిర్దోషివి కాబట్టే బయటకు వచ్చావు..

ఏ కూతురైన తన తండ్రి అరెస్టు అయితే ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ తండ్రి చేసిన తప్పుని బయటపెట్టి నన్ను నిర్దోషిగా బయటకు వచ్చేలా చేశావు అని నర్మదా అంటుంది. ప్రేమ మాత్రం నువ్వు నిర్దోషి అక్క అందుకే నువ్వు బయటికి వచ్చావు దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించకు. నీకేమైనా అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు తట్టుకోలేరు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరి దగ్గర తలవంచాల్సిన అవసరం లేదు అని చాలా గొప్పగా చెప్తుంది. ఆ మాటలు విన్న వేదవతి మాత్రం నువ్వు తింగరి మేనకోడలువే, నాలాంటి దానివే అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైన దానివి గొప్ప మనసున్న దానివి అని కోడలు పై ప్రశంసలు కురిపిస్తుంది.

Advertisement

కోపంగా ఉన్న ధీరజ్ దగ్గరికి ప్రేమ వెళుతుంది.. ఏంటి నా మీద అంత కోపంగా ఉన్నావ్ నేనేం చేశాను రా అని అంటుంది. నా మీద కోపంతో మా పుట్టింటికి వెళ్తాను అని వెళ్లావు అక్కడ నువ్వు ఏం చేసావో చెప్పు. నువ్వు ఏదో చేసి వచ్చావు అది చెప్పకపోతే మాత్రం నువ్వు కచ్చితంగా ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్లాల్సిందే అని ధీరజ్ కండిషన్ పెడతాడు.. ధీరజ్ ఆ మాట అనగానే ప్రేమ మొదట భయపడుతుంది కానీ అసలు నిజాన్ని ధీరజ్ కి చెప్పేస్తుంది. నువ్వు నీ వాళ్ళ దగ్గరే ఇలాంటి ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు అమ్మ నీతో ఇక మీద నుంచి జాగ్రత్తగా ఉండాలని ధీరజ్ అంటాడు..

Also Read :పల్లవికి దిమ్మతిరిగే షాక్.. మీనాక్షికి పల్లవి క్షమాపణలు.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..

భద్ర, తన మేనల్లుడు విశ్వంతో కలిసి లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఏమైంది మీ కేసు గురించి నేను విన్నాను చిన్న మెసేజ్ తో పెద్ద కూపి లాగారు. బయటపడ్డారని అనుకున్నారు దీన్ని నేను తిమ్మిని బమ్మి చేసి సేనాని బయటకు తీసుకొని వస్తాను అని అంటాడు.. ఏదో ఒకటి చేసి నేను సేనాపతిని బయటికి తీసుకొస్తానని లాయర్ భరోసా ఇస్తాడు. భద్రావతి మాత్రం రామరాజు కుటుంబం పై కక్ష తీర్చుకోవాల్సిందే అని అంటుంది.. అమూల్య నాకు పడిపోతుంది నా ట్రాప్ లోకి పడే రోజులు దగ్గరకొచ్చాయి. దాన్ని అడ్డుపెట్టుకొని నేను ఏదో ఒకటి చేసి మన కుటుంబాల్లో మళ్ళీ సంతోషాన్ని నింపుతాను అని విశ్వం భద్రకు మాట ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×