రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా స్వామివారి దర్శనాలను తెల్లవారుజాము నుంచి నిలిపివేశారు. దీంతో ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు అధికారులు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసి వేయడంపై అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటుడు నాగార్జున విషయంలో మంత్రి కొండా సురేఖ వివాదానికి తెరదించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నాగార్జునకి సంబంధించి చేసిన ప్రకటన ఆయన్ను, వారి కుటుంబ సభ్యులను బాధపెట్టాలని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు ఎమ్మెల్యే రవికుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చాలా సమర్థవంతంగా చేశామని అన్నారు.
69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పాఠశాల క్రీడల్లో భాగంగా పాతపట్నంలో సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ అండర్ 14, 17, 19 పోటీలను ఎమ్మెల్యే గోవింద్ రావు ప్రారంభించారు. విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తిగా క్రీడలు మారాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
పోటీలు ప్రారంభం
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పరిధి శాత్రాజుపల్లిలో కోతుల బెడద పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శి కృష్ణ చర్యలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుడిని ఎలుగుబంటి వేషం వేసి వీధులు, స్కూల్ వద్ద తిప్పారు. దీంతో వేలాది కోతులు భయపడి చెరువు వైపు పరిగెత్తాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రన్ ఫర్ యూనిట్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల
విజయనగరం జిల్లా రేగిడిలోని పోరాంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీచర్ శ్రీకాంత్ తనపై దాడికి పాల్పడి, అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడని రుద్రవేణి మహిళా వాపోయింది. అడ్డుకున్న తన కొడుకుపై కూడా శ్రీకాంత్ సెంట్రింగ్ కర్రలతో దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
కాశీబుగ్గ తొక్కిసలాటలోని మృతుల కుటుంబాలకు వైసీపీ ఆర్థికసాయం అందించింది. సోంపేట మండలం జింకిబద్రలో నాయకులు బాధితుల ఇంటికి వెళ్లి 2 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అభివృద్ధి నినాదం కలిసి వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కేవలం సెంటిమెంట్‌నే నమ్ముకుంది. సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ది జరగలేదని కాంగ్రెస్ ఓటర్లకు గుర్తు చేసింది.
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో బట్టలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచాన వేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబుజ్‌మాడ్‌లోని టోకే ప్రాంతంలో నారాయణపూర్ పోలీసులు, బీఎస్ఎఫ్ 135వ బెటాలియన్ సంయుక్తంగా కొత్త భద్రతా, ప్రజాసేవా శిబిరాన్ని ప్రారంభించారు. మావోయిస్టులను అరికట్టేందుకు చేపట్టిన మాడ్ రక్షణ చర్యల్లో భాగంగా ఈ శిబిరం ఏర్పాటైంది. 2024-25లో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభావితమై 208మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు జైష్ ఎ మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహాలు, ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భారత్.. అంగోలా దేశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ భాగస్వామ్యం సమానత్వం, పరస్పర విశ్వాసం అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుందన్నారు. భారత్ తన సహకారాన్ని ఆఫ్రికా ప్రాంతంతో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేసిందని ముర్ము పేర్కొన్నారు.
ఒక వ్యక్తి పితృత్వాన్ని నిరూపించి తీరాల్సిన అవసరం లేని సాధారణ కేసుల్లో కోర్టులు డీఎన్‌ఏ పరీక్షకు తేలికగా ఆదేశాలు జారీ చేయరాదని కోర్టులకు సుప్రీం స్పష్టం చేసింది. డీఎన్‌ఏ పరీక్ష జరపాలన్న ఆదేశాలను అతి జాగ్రత్తగా అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకున్నాకే జారీ చేయాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమై.. పీల్చే గాలి నాణ్యత అత్యంత దయనీయంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యధికంగా 458 వద్ద నమోదైందని అధికారులు తెలిపారు. ఈ కాలుష్యం కారణంగా పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1 నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భారత్‌పై సుంకాలు తగ్గిస్తామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి అని అన్నారు. భారత్‌పై మొదట 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, తర్వాత 50 శాతానికి పెంచింది.
నటి రష్మిక మందన్నకు 2025 సంవత్సరం స్వర్ణయుగంలా నిలిచింది. ఈ ఏడాది ఆమె ఐదు విభిన్న చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పించారు. ముఖ్యంగా ‘ఛావా’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. రష్మిక ప్రస్తుతం ‘మైసా’ అనే యాక్షన్ చిత్రంలో నటిస్తోంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ అంతర్గత గాయంతో తీవ్ర అస్వస్థతకు గురైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నారు. గాయం సమయంలో ఆయన ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోయి ప్రమాదకర స్థితికి చేరుకున్నారని బీసీసీఐ అధికారి తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉండటం అనుమానమే.
ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే రొటీన్ చెకప్ కోసమే వెళ్లారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.