E-Paper
Advertisement

Aadhaar News: సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత ఉందా?

Aadhaar News: సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత ఉందా?
Advertisement

Aadhaar News: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కోట్లకు పైగా ఆధార్ నెంబర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఇందుకు కారణాలు సైతం వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సమాచారం తీసుకుని దాని ఆధారంగా తొలగించింది.

రెండు కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు

Advertisement

ఆధార్ ఈ పేరు చెప్పగానే సామాన్యుడి భయపడతాడు. ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకం కావాలన్నా కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అంతేకాదు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా అదే పరిస్థితి. చివరకు విద్యార్థులు పాఠశాలలో చేరినప్పుడు కూడా ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అలాంటి ఏకంగా 2 కోట్ల మంది ఆధార్ కార్డులను తొలగించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయి.

ఆధార్ వ్యవస్థ వచ్చిన తొలినాళ్లలో చాలామంది రెండేసి ఆధార్ కార్డులను తీసుకున్నారు. అన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాలు లింకు చేయడంతో చాలావరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చాలామంది ఉపయోగిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.  అంతేకాదు వాటి నిధులు ట్రాన్స్‌ఫర్, సెల్‌ఫోన్ సిమ్‌లు తీసుకోవడం జరిగింది.

Advertisement

ఉడాయ్ సంచలన నిర్ణయం,  మరో విడత కూడా?

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా మరణించిన వ్యక్తుల డేటాను సేకరించింది. యాక్టివేట్ దాదాపుగా రెండు కోట్ల ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను తొలగించినట్లు ఉడాయి తెలిపింది.

తొలగించిన ఆధార్ నెంబర్‌ని మరొక వ్యక్తికి తిరిగి కేటాయించబడదని తేల్చిచెప్పింది. చాలామంది మరణించిన వ్యక్తుల ఆధార్‌ను మోసపూరితంగా సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు కేంద్రం దృష్టిలో పడింది. ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో మరణాలను నమోదు చేసేందుకు my Aadhaar పోర్టల్‌లో నమోదు చేసే సౌకర్యాన్ని UIDAI ప్రారంభించింది.

ALSO READ: తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగం, డిజిటల్ కాపీ రిలీజ్ చేసిన రాష్ట్రపతి

కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో పలుమార్లు తొలగించింది కూడా. ఇలాంటి చర్యల వల్ల ఆధార్ డేటాబేస్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఎవరి కార్డునైనా తొలగిస్తే మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. UIDAI ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్పుడు మళ్లీ మీ ఆధార్ యాక్టివేట్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఒకసారి 2 కోట్ల మందిని తొలగించడం ఇదే ఫస్ట్ టైమ్.

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×