E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అడ్డంగా ఇరుక్కున్న శ్రీవల్లి.. మోసపోయిన ఆనందరావు.. తెలివిగా నగలను దాచేసిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: అడ్డంగా ఇరుక్కున్న శ్రీవల్లి.. మోసపోయిన ఆనందరావు.. తెలివిగా నగలను దాచేసిన శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. రేపటి సాయంత్రం వరకు టైం ఇస్తున్నాం మా నగలు మాకు కావాలి అని భద్ర వార్నింగ్ ఇస్తుంది.. ఇంట్లో నగలు ఏమయ్యాయి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే  శ్రీవల్లి ఆ నగల గురించి ప్రేమకు దేవుడికి తెలుసు మావయ్య అని అంటుంది.. ఆ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. దానికోసం చాలా డబ్బులు కావాలి. అందుకే ఆ నగలని అమ్మేసుకుని ఆ డబ్బులని ఏం చేస్తుందో అడగండి అని అంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ అక్క నీ ప్రేమ ఎంత చెప్పినా సరే నువ్వే తీసి ఉంటావు ధీరజ్ మొన్న షూస్ కూడా కొన్నాడు కదా… ఆ నగల గురించి మీరే చెప్పాలి అని అంటుంది.. ప్రేమకు సపోర్టుగా నర్మదా వస్తుంది.. ఏం మాట్లాడుతున్నావు అక్క ప్రేమ నగలు ప్రేమే తీసుకోవడం ఏంటి..? మాట్లాడితే ఒక అర్థమనేది ఉండాలి అని నర్మదా అంటుంది.. రామ రాజు మాత్రం ఆ నగలను సాయంత్రానికి తీసుకురావాలని ధీరజ్, ప్రేమలకు వార్నింగ్ ఇస్తాడు.. ప్రేమ, ధీరజ్ లు కొట్టుకొనేవరకు వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి నగల మేటర్ బయట పడగానే తన తప్పేమీ లేదు అని అనుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ప్రేమ నగలన్నీ మార్చేసి అసలు నగల్ని నేను అక్కడ పెట్టాను. అయితే ఇప్పుడు అదే నా కొంప ముంచేలా ఉంది అని శ్రీవల్లి అనుకుంటుంది. ఈ నగలు నా దగ్గర ఉన్నాయని తెలిస్తే ఇక అంతే నన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది.. దీని గురించి ఐడియా ఇచ్చింది మా అమ్మే ముందు మా అమ్మని చంపి పడేయాలి అనేసి శ్రీవల్లి కోపంగా ఉంటుంది..

Advertisement

ఆనంద రావు 10 లక్షలు 20 లక్షలు చేసే తీసుకొస్తాడని భాగ్యం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మా ఆయన చాలా గొప్పగా 20 లక్షలు తెస్తాను వెళ్ళాడు. ఇంకా రాలేదు ఏంటబ్బా అని ఎదురు చూస్తూ ఉంటుంది.. అప్పుడే ఎదురుగా ఆనందరావు తల మీద గుడ్డ వేసుకొని వస్తాడు.. అది చూసిన భాగ్యం డబ్బులెక్కడండి 20 లక్షలు తెస్తాను అన్నారు కదా ఒట్టి చేతులతో వచ్చారు ఏంటి అని అంటుంది. ఇడ్లీ పిండితో మనమే ఇడ్లీ వేసుకోవాలి వేరే వాళ్ళ దోశ పిండి కోసం పడవద్దు అనేసి అంటాడు. డబ్బులు ఎత్తుకొని వాడు మాయమైపోయాడు అని చెప్తాడు. 20 లక్షలు తీసుకొని వస్తానని మొత్తం డబ్బులు పోగొట్టు వస్తావా నువ్వు అసలు మనిషివేనా అని భాగ్యం చితక్కొట్టేస్తుంది..

అది కాదు భాగ్యం నేను చెప్పేది విను అని ఆనందరావు ఎంత అన్నా సరే.. నువ్వు ఇలాంటి చేతగాని వాడివి కాబట్టే నేను ఆ డబ్బులు వాళ్ళకి ఇద్దామని అన్నాను.. నువ్వు పెద్ద పోటుగాడిలాగా శపదాలు చేసి మరి ఆ డబ్బులు తీసుకెళ్లి పోగొట్టేసావు అని భాగ్యం దారుణంగా ఆనందరావు అని కొట్టేస్తుంది.. ఇప్పుడే శ్రీవల్లి వాక్యం కు ఫోన్ చేస్తుంది. ఏంటే బాబా నీ గోల అసలే మీ నాన్న డబ్బులు పోగొట్టాడని టెన్షన్ లో ఉన్నాను అని అంటుంది.. నువ్వు నా ముందర లేవు కాబట్టి సరిపోయావు లేదంటే కన్నతల్లి అని కూడా చూడకుండా చంపి పడేసేది అనే శ్రీవల్లి అంటుంది. అంత కోపంగా ఉన్నావంటే ఏం జరిగింది అని అడుగుతుంది.. శ్రీవల్లి భద్రావతి చేసిన నగల రచ్చ గురించి మొత్తం పూస గుచ్చినట్లు భాగ్యానికి చెప్పేస్తుంది.

Advertisement

ఈ నగల మేటర్ బయటపడితే నేను కూడా నీతోపాటి పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవాల్సి వస్తుంది నువ్వు అర్జెంటుగా వెళ్లి ఆ నగలని మూట కట్టి ఒక గొయ్యి తవ్వి అందులో పెట్టేసేయ్ అని సలహా ఇస్తుంది.. శ్రీవల్లి తన తల్లి చెప్పినట్లే ఆ నగలను తీసుకొని వెళ్లి గోతి తీసి పాతి పెట్టేస్తుంది.. ప్రేమ నర్మద ఇద్దరు నగలు ఎక్కడ మాయమయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమకు వల్లినే ఈ నగలు తీసేసిందని డౌట్ వస్తుంది. నువ్వు చెప్తుంటే నిజమని అనిపిస్తుంది. మనం ముందు ఆ వల్లి రూమ్ లో ఈ నగలను వెతుకుదాం అని నర్మదా అంటుంది.. ప్రేమ నర్మదలకు శ్రీవల్లి రూమ్ లో నగలు కనిపించవు. అయితే వాళ్లు ఈ శ్రీ వల్లి మనం కచ్చితంగా వెతుకుదామని తెలుసుకొని ఎక్కడో దాచి పెట్టేసింది అని అంటారు.

Also Read :భానుమతికి కమల్ ఝలక్.. ఆస్తి కోసం శ్రీయ గొడవ..రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం..

ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా శ్రీవల్లి కోసం ఇల్లంతా వెతుకుతారు.. శ్రీవల్లి నగలను పాతి పెట్టేసి దేవుడికి పూజ చేస్తున్నట్లు నటిస్తుంది.. నర్మద ప్రేమలని చూసి షాక్ అయిన శ్రీవల్లి దేవుడా ఇంట్లో పోయిన నగలు వెంటనే దొరకాలి అంటూ దొంగగా దండం పెట్టుకుంటుంది.. అది చూసిన ప్రేమ నీ నాటకాలు ఇక ఆపు.. ఆ నగలని కొట్టేసింది నువ్వే అని మాకు తెలుసు. నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అనేసి శ్రీవల్లిని అడుగుతారు. ఇంత అమాయకురాలని పట్టుకొని మీరు ఇలా మాట్లాడతారు ఏంటి అని శ్రీవల్లి అంటుంది. నాటకాలు ఆపి అసలు ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని ప్రేమ నర్మద ఇద్దరు అడుగుతారు.. నాకేం తెలుసు మీరే వెతుక్కోండి అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×